తెలంగాణ
Vijayashanti Joined Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపిన నటి
Hazarath Reddyబీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి తాజాగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌ పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు.
Hyderabad Fire Video:హైదరాబాద్ పాతబస్తీ జాకీ షోరూమ్‌లో అగ్నిప్రమాదం, మదీనా బిల్డింగ్ జాకీ షోరూమ్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
Hazarath Reddyహైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి.తాజాగా పాతబస్తీలోని మదీనా బిల్డింగ్ జాకీ షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షోరూమ్ లో ఉన్న బట్టలన్నీ కాలిపోయాయి.
Hyderabad Fire Video: హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం, జాకీస్ స్టోర్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బంది
Hazarath Reddyహైదరాబాద్‌లోని ఒక వస్త్ర దుకాణంలో, ప్రత్యేకంగా జాకీస్ స్టోర్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయి. వార్తా సంస్థ PTI షేర్ చేసిన వీడియోలో చూసినట్లుగా, దట్టమైన నల్లటి పొగతో దుకాణం చుట్టుముట్టడంతో ఈ సంఘటన జరిగింది
Telangana Shocker: చిన్నవయసులోనే గుండెపోటుతో కుప్పకూలి ఇంజనీరింగ్ విద్యార్ధిని మృతి, హైదరాబాద్‌లో విషాదకర ఘటన
Hazarath Reddyకాలేజీలో హఠాత్తుగా గుండెపోటుతో ఓ విద్యార్థిని మృతి చెందిన తీవ్ర కలకలం రేపింది. ఇంకా విషాదకరం ఏంటంటే..అత్యంత చిన్న వయసులో గుండెపోటు రావడం. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లా పట్టణంలో చోటు చేసుకుంది.
Telangana Assembly Elections 2023: నెలకు రూ. 4 వేలు ఫించన్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీల బుక్‌లెట్‌ ‘అభయ హస్తం’ను విడుదల చేశారు.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు
Hazarath Reddyహైదరాబాద్‌లో ఓ దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నగరంలోని వారాసిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఘటన చోటు చేసుకుంది.
Vote at Home: 28 వేల మందికి ఇంటి వద్దే ఓటు హక్కు.. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 757 మందికి అవకాశం
Rudra28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు.
Vijayashanti Quits BJP: అనుకున్నదే అయింది! బీజేపీకి షాక్‌ ఇచ్చిన రాములమ్మ, మరోసారి కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న విజయశాంతి, కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరం, మెదక్ పార్లమెంట్ సీటు ఆఫర్‌ చేసిన కాంగ్రెస్‌
VNSఅసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి (BJP) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను (Vijayashanti Quits BJP) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పంపించారు. గత కొంతకాలంగా ఆమె రాష్ట్ర పార్టీ అధిష్టానం తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
IT Raids in TS: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధిపై ఐటీ రైడ్స్‌, ఒకేసారి 40 బృందాలతో విస్తృతంగా సోదాలు, తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభం
VNSతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు ముమ్మరమయ్యాయి(IT RAIDS). 40 బృందాలతో హైదరాబాద్‌తో పాటు నల్గొండ, మిర్యాలగూడలో (Miryalaguda)ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Telangana Elections 2023: రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా, జాతీయ పార్టీలు మూలకు వెళతాయంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddy2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఏర్పడటం ఖాయమని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హ‌వా ఉండ‌దు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.
Telangana Elections 2023: రెండు రోజలు పాటు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు, కారణం ఏంటంటే..
Hazarath Reddyతెలంగాణలో పాఠశాలలకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 30 న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 30, వ తేదీ.. ఆ ముందు రోజు అనగా 29 వ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలియజేసారు.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, నేను ఈడ గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే, తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyనేను ఈడ గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లేనంటూ తుమ్మల నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే నా ఆలోచన. ఏపీ నుండి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయం నేను ఉంచుకోను. ఈ టీడీపీ పార్టీకి నేను చాలా రుణపడి ఉన్నానని తెలిపారు.
Sadar Utsav Mela: ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్‌ లో ‘సదర్’ ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 3 వరకు ట్రాఫిక్ మళ్లింపు.. పూర్తి వివరాలు ఇదిగో!
Rudraసదర్‌‌‌‌ ఉత్సవ మేళాను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. నారాయణగూడ వైఎంసీఏ మార్గంలో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని నిర్ణయించారు.
Harish Rao About CM Post: కేటీఆర్‌ ను సీఎం చేసినా నాకు ఓకే అంటున్న హరీశ్ రావు.. కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ
Rudraతెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో లాగా తమ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావాలని, అధికారం కావాలని తాను ఏనాడూ అనుకోలేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
Hyderabad Fire Accident: నాంపల్లి ఘటన మరువక ముందే శాలిబండలో కూడా అగ్నిప్రమాదం...తృటిలో తప్పిన భారీ ప్రమాదం..
ahanaహైదరాబాద్‌లోని శాలిబండలో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆరు అగ్నిమాపక యంత్రాలతో పాటు 30 మంది అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Nampally Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాద బాధిత కుటుంబాల‌కు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం
ahanaనాంపల్లి బజార్‌ఘాట్‌ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 5 లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున సాయం అందజేస్తామన్నారు.
Telangana Assembly Elections 2023: రైతుబంధు పుట్టించిందే నేను..24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం - కేసీఆర్‌
ahanaతెలంగాణ వచ్చిందే రాష్ట్ర హక్కుల కోసం.. దళితుల బాగు కోసం దళితబంధును తీసుకొచ్చాం.. పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ పెట్టాలి.. గతంలో రైతులు అప్పు కట్టకపోతే తలుపులు తీసుకెళ్లేవారు.. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్..24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం అని పేర్కొన్నారు.
Hyderabad Fire: నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో ఆరుగురు సజీవ దహనం, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం, కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా ఎగసిన మంటలు
Hazarath Reddyహైదరాబాద్‌లోని నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Viral Video: పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఇలాంటి చేష్టలు మానుకోవాలని సూచన
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియో షేర్ చేశారు.ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?
CM KCR Meetings: నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు.. నేడు బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ సభ
Rudraనేటి నుంచి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. నేడు బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు.