తెలంగాణ
John Cena Viral: హైద‌రాబాద్‌లో దుమ్మురేపిన స్టార్ రెజ్ల‌ర్‌.. జాన్ సీనా ఫైటింగ్ వీడియోలు ఇవే
Rudraజాన్ సీనా(John Cena) త‌న రెజ్లింగ్ ట్యాలెంట్‌ ను హైద‌రాబాదీల‌కు (Hyderabad) చూపించాడు. ప‌వ‌ర్‌ ఫుల్ పంచ్‌ ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ్డ సీనా అటాకింగ్ గేమ్‌ కు న‌గ‌ర ప్ర‌జ‌లు ఫిదా అయ్యారు.
Chandrababu Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో అంశాలు వెల్లడి.. ఇంతకీ ఆ నివేదికలో ఏమేం విషయాలు ఉన్నాయంటే??
Rudraస్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు చెందిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తికి అందించారు.
Chandrababu Arrest Update: విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు.. న్యాయస్థానానికి ఈ ఉదయం రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. కోర్టు వద్ద భారీ భద్రత... కొనసాగుతున్న విచారణ
Rudraస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నిన్న అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈమేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు.
Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్.. స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నిరసన
Rudraస్కిల్ డెవలప్‌ మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు.
G20 Summit kicks off Today: నేడే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం.. సదస్సు అజెండా ఏంటి?? ఏమేం చర్చించనున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?? పూర్తి వివరాలు ఇదిగో
Rudraప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశాలు ఢిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి.
Video: తెలంగాణలో 15 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణలో కరెంట్ కోతల అంశంపై ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో కనీసం 15 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. వీడియో ఇదిగో..
Telangana Shocker: వీడియో ఇదిగో, ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తల దాడి, SFI సంగారెడ్డి జిల్లా కార్యదర్శి రమేష్ తలకు తీవ్రగాయం, సంగారెడ్డిలో ఘటన
Hazarath Reddyసంగారెడ్డి - నేడు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు జెండాలు కడుతుండగా ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేసారు.ఎందుకు దాడి చేస్తున్నారని అడిగిన సంగారెడ్డి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ తలపై ఏబీవీపీ కార్యకర్తలు కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయాడు. రమేష్‌ని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Bus Caught Fire Video: వీడియో ఇదిగో, అర్థరాత్రి మంటల్లో కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, డ్రైవర్ అప్రమత్తం కావడంతో తప్పిన పెను ప్రమాదం
Hazarath Reddyహైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ నుంచి నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 26 మంది ప్రయాణికులతో బయల్దేరిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు(కావేరీ) మిర్యాలగూడ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్‌ వద్ద ఒక్కసారిగా టైరు పేలి బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Hyderabad: ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ట్రాఫిక్‌ హోంగార్డు మృతి, వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్‌ చేయలేదంటూ హోంగార్డు భార్య సంచలన ఆరోపణలు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో గోషామహల్‌లో నాలుగు రోజుల క్రితం పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న ట్రాఫిక్‌ హోంగార్డు ఎం. రవీందర్‌ (38) మృతిచెందాడు. అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Weather Forecast: వాతావరణంలో ఎన్నడూ లేనంతగా పెను మార్పులు, తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న భారీ వర్షాలు
Hazarath Reddyవాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.
Hyderabad Shocker: దారుణం, పరీక్షల్లో చిట్టీలు అందించలేదని స్నేహితుడిపై దాడి, మెదడులో రక్తం గడ్డకట్టడంతో డేంజర్‌జోన్ లోకి వెళ్ళిపోయిన యువకుడు
Hazarath Reddyహైదరాబాద్ - చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరీక్షల్లో చిట్టీలు అందించలేదని ఆరిఫ్ అనే విద్యార్థితో కసబ్ గొడవపడి విచక్షణా రహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ వైరల్ అవుతోంది.
Left Parties Alliance: చెరో ఐదు సీట్లు కావాల్సిందే! తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుకు వామపక్షాల డిమాండ్‌, పోటీ చేయాల్సిన స్థానాలపై ఇరు పార్టీల నేతల చర్చలు
VNSరాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు (Alliance With Congress) కామ్రేడ్లు కసరత్తు చేస్తున్నారు. హస్తం పార్టీతో ఫస్ట్ సీట్ల విషయం తేల్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీపీఐ (CPI) నేత నారాయణ సమావేశమై చర్చించగా, సీపీఎం హుటాహుటినా ఆన్ లైన్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది.
TRT Notification: తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మొత్తం 5089 పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
VNSరాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (TRT) నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5089 స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, లాంగ్వేజ్‌ పండిట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ (PET) పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ (Notification) జారీచేసింది.
Telangana: నెల క్రితం తగిలిన గాయానికి కట్టు కట్టుకుని మేము కొట్టినట్లు నాటకమాడారు, యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు దాడి ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్
Hazarath Reddyనెల కింద క్రికెట్ ఆడుతుండగా జరిగిన గాయానికి కట్టు కట్టుకొని పోలీసులు కొట్టినట్లు డ్రామా ఆడారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు వీసీ మీద దాడి చేసి డోర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినపుడు అదుపులోకి తీసుకుంటే మేము కొట్టినట్లు కట్టుకథ సృష్టించారని వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు.
Meghalaya CM Sangma Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన మేఘాలయ సీఎం సంగ్మా
Hazarath Reddyమేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా, గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.అనంతరం తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరువురు సిఎం లు ఇష్టాగోష్ఠి నిర్వహించారు.
Video: ఆంధ్రలో కరెంట్ తీగల మీద బట్టలు అరేసుకుంటున్నారు, ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆనాడు తెలంగాణ వస్తే కరెంట్ తీగల మీద బట్టలు అరేసుకోవాలి అన్నారు.. ఇప్పుడు ఆంధ్రలో కరెంట్ తీగల మీద బట్టలు అరేసుకుంటున్నారు అంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..
Telangana: కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం, నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి
Hazarath Reddyకూకట్ పల్లిలోని కే.పి.హెచ్.బి కాలనీ అడ్డగుట్టలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది.. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు.మృతి చెందిన కార్మికులు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంతోష్, సోనియాగా గుర్తించారు.
Viral Video: బాహుబలి సీన్ రిపీట్ వీడియో ఇదిగో, తీవ్ర జ్వరంతో ఉన్న చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి, ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స
Hazarath Reddyతెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో విషయంలోకి వెళ్తే.. లక్మాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.
Bandi Sanjay: వీడియో ఇదిగో, పిల్లాడితో ఫుట్‌బాల్ గేమ్ ఆడిన బండి సంజయ్, నిఖార్సైన హిందువని చెప్పుకున్న కేసీఆర్‌ స్టాలిన్ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించరని ఫైర్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అమెరికాలో పర్యటనలో ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు, పిల్లవాడితో పుట్ బాల్ గేమ్ ఆడుతూ సరదాగా గడుపుతున్న వీడియోని తన ఖాతాలో పంచుకున్నారు.
Palamuru Rangareddy Project: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఈ నెల 16న నార్లాపూర్‌ ఇన్‌టేక్ నుంచి బాహుబలి పంపు ద్వారా కృష్ణాజలాల విడుదల
VNSపాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (Palamuru Rangareddy Project) పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) నిర్ణయించారు. ఇందులో భాగంగా నార్లాపూర్ ఇన్‌టేక్ నుంచి ఈ నెల 16న మధ్యాహ్నం బటన్ నొక్కి బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను సీఎం ఎత్తిపోయనున్నారు.