తెలంగాణ

Hyderabad Rains: హైదరాబాద్ ట్రాఫిక్ జాం, ఐటీ ఉద్యోగులకు లాగ్ అవుట్‌పై కీలక సూచనలు చేసిన సైబరాబాద్ పోలీసులు

Hazarath Reddy

వర్షాల కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి సూచించిన సైబరాబాద్ పోలీస్ శాఖ.

Video: భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం మీద నుంచి దూకిన భర్త, కాసేపు వైర్లు పట్టుకొని వేలాడుతూ ప్రాణాలు తీసుకుంటానంటూ బెదిరింపులు

Hazarath Reddy

భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమైనది. కానీ వారు చిన్నచిన్న విషయాలకే గొడవ పడుతూ ఆ బంధానికే మాయని మచ్చ తెస్తున్నారు. తాజాగా ఓ భర్త.. భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం ఎక్కారు. ఆపై కాసేపు వైర్లు పట్టుకొని వేలాడుతూ ప్రాణాలు తీసుకుంటానంటూ నానా హడావుడి చేశారు. తీరా పట్టు తప్పడంతో పై నుండి కింద పడిపోయారు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

My Home Cement Factory Accident: మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, అయిదుగురు కార్మికులు మృతి

Hazarath Reddy

సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది

Hyderabad Rains: హోంగార్డుల నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు అందరూ వర్షంలోనే, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేసిన యంత్రాంగం

Hazarath Reddy

మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరజీవనం దాదాపు స్తంభించింది. మరో నాలుగురోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.

Advertisement

Hyderabad Road Accident: ఘోర ప్రమాదం, అతివేగంతో వచ్చి డివైడర్‌ను ఢీకొట్టిన అంబులెన్స్‌, వెంటనే పేలిన ఆక్సిజన్ సిలిండర్, డ్రైవర్ మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అతడి ఇంటి వద్ద వదిలిపెట్టి తిరిగి వస్తుండగా అంబులెన్స్‌ బీఎన్‌ రెడ్డి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది.

Hyderabad Traffic Video: హైదరాబాద్‌ ట్రాఫిక్ జామ్ వీడియో ఇదిగో, కదిలే లోపు రెండు గంటలు సినిమా చూడవచ్చు

Hazarath Reddy

హైదరాబాద్‌ లో భారీ వర్షాలకు గడిచిన మూడు రోజులుగా ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి. రోడ్డుపైకి వెళ్తే.. గమ్యస్థానికి ఎప్పుడు వెళ్తామో చెప్పలేని పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే.. ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. చాలా ప్రాంతల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కనిపించింది.

IRCTC Down: ఐఆర్సీటీసీ యాప్, వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు.. ట్విట్టర్ లో వెల్లడించిన ఐఆర్సీటీసీ

Rudra

రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ముఖ్య సూచన చేసింది. టికెట్ కొనుగోలు విషయంలో యాప్, వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొంది. దీని కారణంగా టికెట్ చెల్లింపులు జరపడం కష్టంగా మారిందని.. దీనికి ప్రత్యామ్నయంగా ఆస్క్ దిశాను సంప్రదించాల్సిదిగా కోరారు.

Video: మందుబాబులా మజాకా, ఏకంగా పోలీస్ ట్రాఫిక్ బూత్‌లో మద్యం తాగుతూ బిర్యానీ తింటూ ఎంజాయ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాదాపూర్ లోని హైటెక్ సిటీ జంక్షన్లో ట్రాఫిక్ బూత్లో పోకిరీలు మద్యం తాగుతున్న వీడియో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేసిన బూత్లో ఇద్దరు పోకిరీలు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటూ మందు కొట్టడానికి అడ్డాగా మార్చుకున్నారు. వీడియో ఇదే..

Advertisement

Ambulance in Fire: డివైడర్ ను ఢీ కొట్టడంతో అంబులెన్స్ లో మంటలు.. డ్రైవర్ మృతి.. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో ఘోర ప్రమాదం

Rudra

హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడడంతో అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నగరంలోని వనస్థలిపురంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

IITH Student Case: విషాదాంతంగా మారిన ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కథ.. విశాఖ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న కార్తీక్.. ఈ ఉదయం వైజాగ్ సముద్రం ఒడ్డున మృతదేహం గుర్తింపు

Rudra

ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) విద్యార్థి కార్తీక్ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. నగరం నుంచి విశాఖపట్టణం చేరుకున్న విద్యార్థి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Viral Video: భవనం పక్కనే పిడుగుపాటు.. కాలిపోయిన టీవీలు, ఫ్రిజ్‌లు.. హైదరాబాద్‌ అత్తాపూర్‌ లో ఘటన.. వీడియోతో

Rudra

హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌ లో ఓ నాలుగు అంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడింది. దీంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ల లోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి.

Telangana Rains: రానున్న మూడ్రోజులు మరింత దంచికొట్టనున్న వానలు.. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌

Rudra

తెలంగాణలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని సూచించింది.

Advertisement

Amit Shah Hyderabad Visit: ఈ నెల 29న హైదరాబాద్‌ కు అమిత్ షా.. సంస్థాగత అంశాలపై సమీక్ష

Rudra

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్షించనున్నారు.

Hyderabad Rains: కుతుబ్ షాహీ మసీద్ పై పడిన పిడుగు.. బీటలు వారిన మినార్.. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. పొద్దున్నే మళ్లీ మొదలైన వాన

Rudra

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరవాసులను వణికించింది. నిన్నటి వర్షానికి కుతుబ్ షాహీ మసీద్ పై పిడుగు పడటంతో మినార్ బీటలు వారింది. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

IMD Weather Forecast: వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం, ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

Hazarath Reddy

దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.

Hyderabad Rains: హైదరాబాద్‌‌ను కుమ్మేసిన భారీ వర్షం, రాత్రికి ఇంకా కుండపోతగా కురిసే అవకాశం, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

హైదరాబాద్‌లో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌ జారీ చేయగా.. హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

Advertisement

Abolition of VRA System: 20,555 మంది వీఆర్‌ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్, ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ సర్కారు, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు

Hazarath Reddy

వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ, వారి పేస్కేల్‌ విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సోమవారం జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతి కుమారి సోమవారం సచివాలయంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు

Telangana Weather Update: తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ, రాగల 3 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచన

Hazarath Reddy

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది.

Bandi Sanjay Meets Amit Shah: అమిత్ షాతో బండి సంజయ్ భేటీ, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడి

Hazarath Reddy

ఢిల్లీ పార్లమెంట్‌ భవనంలోని హోంమంత్రి కార్యాలయంలో సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కలిశారు.ఈ సందర్భంగా గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కేంద్రమంత్రిని కోరారు.

KTR's Birthday: కేటీఆర్ పుట్టినరోజు సంధర్భంగా టమోటాలు పంచిన రాజనాల శ్రీహరి, గతేడాది బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు సందర్భంగా చికెన్, లిక్కర్

Hazarath Reddy

మరోసారి రాజనాల శ్రీహరి వెరైటీగా వార్తల్లో నిలిచారు. గతేడాది బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు సంధర్భంగా చికెన్, లిక్కర్ పంచిన రాజనాల శ్రీహరి. ఈసారి మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సంధర్భంగా వరంగల్ చౌరస్తాలో టమాటాలు పంచాడు.

Advertisement
Advertisement