తెలంగాణ
RGV Vs VH: "ఓ తాతగారూ మీరింకా ఉన్నారా?..." వీహెచ్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు.. ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్‌కు వీహెచ్ లేఖ.. ‘మీరింకా ఉన్నారా?’ అంటూ ఆర్జీవీ ట్వీట్
Rudraఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ చేసిన కామెంట్లు రేపిన దుమారం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్జీవీపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా మండిపడటం తెలిసిందే. అయితే వీహెచ్ వ్యాఖ్యలను ఆర్జీవీ సెటైరికల్ గా తిప్పికొట్టారు.
MLC Kavitha ED Row: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేడే.. ఇప్పటికే ఢిల్లీకి కేసీఆర్ కుమార్తె.. ఈడీ విచారణ హాజరుపై సస్పెన్స్
Rudraఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మలిదఫా ఈడీ విచారణ నేడే జరుగనున్నది. ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీ చేరుకున్నారు. కవిత వెంట మంత్రి కేటిఆర్, ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. అయితే ఈడీ విచారణకు కవిత హాజరుపై సస్పెన్స్ నెలకొంది.
‘Millet Man’ PV Sathish Passes Away: ‘మిల్లెట్ మ్యాన్’ పీవీ సతీశ్ కుమార్ కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సతీశ్.. చిరుధాన్యాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సతీశ్
Rudra‘మిల్లెట్ మ్యాన్’గా ప్రపంచ దేశాలకు సుపరిచిరపరిచితమైన పీవీ సతీశ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు.
Corona Alert: దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో 1,071 కేసులు.. 130 రోజుల తర్వాత ఇదే మొదటిసారి.. మొత్తంగా 5,915కు పెరిగిన యాక్టివ్ కేసులు.. రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరి మృతి
Rudraగడిచిన మూడేండ్లుగా యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించి ఇటీవల శాంతించినట్టు కనిపించిన కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతుంది. దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 130 రోజుల తర్వాత ఒక్క రోజే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి.
Naveen Murder Case: నవీన్ హత్యకేసులో నిందితురాలికి బెయిల్‌, విచారణ సమయంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులనే నిహారిక బ్లాక్ మెయిల్‌
VNSవిచారణలో నిహారిక, హాసన్‌లు హత్యకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో నిహారిక తొలుత విచారణకు నిరాకరించింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడం కొసమెరుపు. కాగా ఫిబ్రవరి 17వ తేదీన నల్గొండ జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థి నవీన్‌ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ హత్య చేసిన తీరు సంచలనంగా మారింది.
Telangana Rains: తెలంగాణలో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్, రెండు రోజుల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్ వాసులకు వడగండ్ల వాన అలర్ట్
Hazarath Reddyతెలంగాణలో అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. అయితే, మరో రెండు రోజులు కూడా తెలంగాణ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.
Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వీడియోతో
Rudraకాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డివైడర్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
Telangana SSC Exams: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు... ఈ నెల 24 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు.. ఈసారి 6 పేపర్లతో తెలంగాణ టెన్త్ పరీక్షలు
Rudraతెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు ఉంటాయని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.
Bharat Gaurav Rail: సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ‘భారత్ గౌరవ్’ రైలు.. రైలును జెండా ఊపి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్.. 8 రాత్రుళ్లు, 9 పగళ్లు పూరి, కోణార్క్, గయ, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను చుట్టనున్న రైలు
Rudraసికింద్రాబాద్ నుంచి తొలిసారి ఓ ‘భారత్ గౌరవ్’ రైలు బయలుదేరింది. దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఉద్దేశించిన ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు.
Bandi Sanjay: మరోసారి మహిళలపై సామెతలు వాడితే కఠిన చర్యలే! బండి సంజయ్‌ను మూడుగంటల పాటూ విచారించిన మహిళా కమిషన్, కవితపై వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బండి
VNSబీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ క‌విత‌ (MLC Kavitha) పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్(Bandi Sanjay) తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ (Telangana State Commission for Women) ఎదుట‌ శ‌నివారం హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సంజ‌య్‌ను మ‌హిళా క‌మిష‌న్ దాదాపు మూడు గంట‌ల పాటు విచారించింది.
Heavy Rains: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం, నగరాన్ని కమ్మేసిన కారుమబ్బులు, భారీగా ట్రాఫిక్ జామ్, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటూ భారీ వర్షాలున్నాయంటూ ఐఎండీ హెచ్చరిక
VNSహైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంటనగరాల పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం (heavy rain) కురిసింది. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్నీ, అల్వాల్‌, తిరుమలగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, జీడిమెట్ల, ఆల్విన్‌ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట, కాప్రా, ఈసీఐఎల్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
PM MITRA Mega Textile Park: తెలంగాణకు పీఎం మిత్ర మెగాటెక్స్ టైల్ పార్కులను మంజూరు చేసిన ప్రధాని మోదీ..
kanhaప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో 'పీఎం మిత్ర' మెగా టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేశారు.
TSPSC Paper Leak: పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ హై లెవల్ సమావేశం, అభ్యర్థులెవరూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్న మంత్రి కేటీఆర్..
kanhaపేపర్ లీకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో శనివారం ప్రగతి భవన్‌లో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణితో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
Ram Charan: అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న రామ్‌చరణ్‌.. ఎయిర్‌పోర్టులో మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం
Rudraమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని బేగమ్ పేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్న చరణ్‌కు వందలాదిగా తరలివచ్చిన మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.
Fire accident: రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం.. రెండు డీసీఎం వాహనాలు దగ్ధం
Rudraవరుస అగ్ని ప్రమాదాలు జంట నగరాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న స్వప్నలోక్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ఆహుతయ్యారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాస్త్రిపురంలోని ఓ తుక్కు గోదాంలో వ్యర్థ పదార్థాలు తగలబడతున్నాయి.
Heavy Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన.. ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం.. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి
Rudraతెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Khammam: పెళ్లి ఇంట్లో చావుమేళం, రాత్రి కూతురు పెళ్లి ఉండగా ఉదయమే చనిపోయిన తండ్రి, ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన
VNSపెళ్లి సంబురంతో వచ్చిన బంధువులు, చావు మిగిల్చిన దుఃఖంతో వెళ్లిపోయారు. మరికొన్ని గంటల్లో బిడ్డ పెళ్లి జరగాల్సిన ఇంట్లో.. గుండెపోటు (Heart attack)తో తండ్రి హఠాన్మరణం పాలయ్యాడు. ఖమ్మం (Khammam) జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో ఈ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది.
KTR on TSPSC Leak: టీఎస్‌పీఎస్సీ లీక్‌ పాపం బీజేపీదే! యువతను రెచ్చగొడుతున్న బండి సంజయ్‌కు బుద్ది చెప్పాలన్న మంత్రి కేటీఆర్, గుజరాత్‌లోనూ ప్రశ్నాపత్రాలు లీకైతే మోదీ రాజీనామా చేశారా? అంటూ ప్రశ్నించిన కేటీఆర్
VNSబీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)లో లీకేజీ కేసు, దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్ లో (Gujrat) 13 సార్లు క్వశ్చన్ పేపర్లు లీకు అయ్యాయని తెలిపారు.
TSPSC Paper Leak: బండి సంజయ్‌, ఈటల రాజేందర్ అరెస్టు, గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద తీవ్ర ఉద్రిక్తత
Hazarath Reddyతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పేపర్‌ లీకేజీ అంశంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) దీక్షకు దిగారు.
MLC Election Result: తగ్గని వైఎస్ జగన్ మేనియా, 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్, తెలంగాణలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు (MLC Election Result) విడుదలయ్యాయి. ఏపీలో మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections Results) ఈనెల 13న పోలింగ్ జరిగింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.