తెలంగాణ
Amit Shah Congratulate AVN Reddy: ఏవీఎన్‌ రెడ్డికి అభినందనలు తెలిపిన అమిత్ షా, తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన వద్దు, మోదీ పాలన కోరుకుంటున్నారంటూ ట్వీట్
Hazarath Reddyతెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం పట్ల బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ ద్వారా తెలంగాణ బీజేపీకి అభినందనలు తెలియజేశారు.
Group 1 Prelims Cancelled: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు, అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ
Hazarath Reddyతెలంగాణలో పరీక్షల పేపర్ లీక్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది టీఎస్‌పీఎస్‌సీ. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
Swapnalok Complex Fire Mishap: స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Hazarath Reddyసికింద్రాబాద్ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Sharmila House Arrest: వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్, నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమంటూ మండిపాటు
Hazarath Reddyహైదరాబాద్ లోని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన షర్మిల.. టీఎస్ పీఎస్సీ పేపర్‌ లీక్‌ను నిరసిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి ఆమె ఇంటి దగ్గర పోలీసు బలగాల్ని మోహరించారు. తర్వాత హౌస్ అరెస్ట్ చేసి ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు.
Cheetah Helicopter Crash: చీతా విమాన ప్రమాదంలో అమరుడైన యాదాద్రి బిడ్డ వీవీబీ రెడ్డి, గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు, స్వగ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు
Hazarath Reddyఅరుణాచల్‌ ప్రదేశ్‌లో భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్‌ ‘చీతా’ కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి యాదాద్రి జిల్లా బొమ్మలరామారంకు చెందిన మేజర్. దీంతో ఆయన స్వస్థలం బొమ్మలరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి.
Heavy Rains In Telangana: రేపు తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
Rudraఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తమ్మీద రానున్న 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది.
Swapnalok Fire Accident Update: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదంలో ఆరుగురి సజీవ దహనం.. మృతులందరూ కాల్ సెంటర్ ఉద్యోగులే.. బాధితుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు.. ప్రమాదానికి గల కారణంపై ఇంకా అస్పష్టత
Rudraజంట నగరాల్లోని వాణిజ్య భవంతుల్లో వరుస అగ్ని ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న రుబీ హోటల్ అగ్ని ప్రమాద ఘటనను మరిచిపోకముందే.. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌ లో గత రాత్రి మరో భారీ అగ్నిప్రమాదం జరుగడం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు.
Secunderabad Fire: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం, 7,8 అంతస్తుల్లో భారీగా మంటలు, 8 మంది మంటల్లో చిక్కుకున్నట్లుగా వార్తలు
Hazarath Reddyసికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో 7,8 అంతస్తుల్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.చుట్టుపక్కల పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఆ కాంప్లెక్స్‌లో 8 మంది వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం.
Hailstorm Videos: వడగండ్ల వాన వీడియోలు చూశారా, తెలంగాణను వణికించిన వడగండ్ల వాన, భయంతో ఇంట్లో నుంచి బయటకు రాని ప్రజలు, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyతెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురిసింది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. మ‌ర్ప‌ల్లి మండ‌ల కేంద్రంలో వ‌డ‌గండ్ల వాన ప‌డింది.
TS MLC Elections 2023: తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం, ఇత‌ర పార్టీల నుంచి నామినేష‌న్లు దాఖ‌లు చేయని అభ్యర్థులు
Hazarath Reddyఎమ్మెల్యే కోటా( MLA Quota ) లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు( BRS Candidates ) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అధికార పార్టీ త‌ర‌పున నామినేష‌న్లు దాఖ‌లు చేసిన దేశ‌ప‌తి శ్రీనివాస్( Despathi Srinivas ), న‌వీన్ కుమార్( Naveen Kumar ), చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి( Challa Venkatrami reddy ) ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు
Hyderabad Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌లో భారీ వర్షం, మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
Hazarath Reddyహైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని నాగోల్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది.
Telangana Shocker: ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న వదినా మరదళ్లు, సీన్ కట్ చేస్తే ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyమంచిర్యాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరుసకు వదినా మరదళ్లు ప్రేమికులుగా మారి పెద్దలను ఎదురించి ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే ఇంతలోనే వీరిలో ఒక అమ్మాయి అనుమానస్పదంగా మరణించగా.. మరో అమ్మాయి తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Weather Forecast in TS: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, రానున్న 5 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాలు, వికారాబాద్‌ను ముంచెత్తిన వడగండ్ల వాన
Hazarath Reddyరానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మెస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.
Weather Forecast in TS: వీడియో ఇదిగో, వికారాబాద్ జిల్లాను ముంచెత్తిన భారీ వర్షం, రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyవికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప‌లు చోట్ల భారీ వ‌ర్షం( rain ) కురిసింది. మ‌ర్ప‌ల్లి మండ‌ల కేంద్రంలో వ‌డ‌గండ్ల వాన( Hailstorm ) ప‌డింది. వికారాబాద్, ప‌రిగి, పూడూరు మండ‌లాల్లో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది.
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్, విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పిన ఈడీ, అనారోగ్యంతో రాలేనని తెలిపిన కవిత
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు తెలిపారు. మరికాసేపట్లో ఈడీ (ED) ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె ఈ- మెయిల్‌ ద్వారా అధికారులకు సమాచారం పంపారు. అనారోగ్యం, సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టు పేర్కొన్నారు.
TSRTC: భద్రాచలం వెళ్లనవసరం లేదు, మీ ఇంటికే సీతారాముల కల్యాణ తలంబ్రాలు, రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌
Hazarath Reddyశ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కావాల్సినవారు తమ కార్గో పార్సిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ సూచించారు.
Telangana: ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజే విద్యార్థిని ఆత్మహత్య, హన్మకొండలో హాస్టల్‌లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్న ఇంటర్ స్టూడెంట్ నాగజ్యోతి
Hazarath Reddyతెలంగాణలో వరుసగా విద్యార్థిని ఆత్మహత్యల వార్తలు కలవరం రేపుతున్నాయి. తాజాగా వరంగలో జిల్లాలో హన్మకొండలో ( Hanamkonda) ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది.
BRS-BJP Poster War:హైదరాబాద్‌లో మరోసారి సంచలన పోస్టర్లు, ఏకంగా బీజేపీ ముఖ్యనేత కనపడుట లేదంటూ వెలిసిన పోస్టర్లు, పట్టిస్తే మోదీ ప్రకటించిన రూ. 15లక్షలు ఇస్తామంటూ పోస్టర్లు
VNSబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh) పోస్టర్లను పలు ప్రాంతాల్లో అంటించి, ‘క్రిమినల్’, ‘వాంటెడ్’గా పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు అంటూ అందులో రాసుకొచ్చారు. ఆయన ఆచూకీ చెప్పిన వారికి.. ‘మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షలను బహుమానంగా దక్కుతాయి’ అంటూ పేర్కొన్నారు.
Kavitha To Attend ED Inquiry: మరికాసేపట్లో ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత, ఈ సారి రామచంద్రపిళ్లైతో కలిపి విచారించే అవకాశం, కవితకు మద్దతుగా ఢిల్లీలో మంత్రి కేటీఆర్, హరీష్‌ రావు
VNSఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే 12మందిని అరెస్ట్ చేసి విచారణ జరిపిన ఈడీ (ED) ఈ కేసులో దూకుడు చూపిస్తోంది. మార్చి 11న రామచంద్ర పిళ్లై తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ ఇవాళ మరోసారి కవితను విచారించనుంది. మార్చి 11న పలు కీలక అంశాలపై కవితపై పశ్నల వర్షం కురిపించిన ఈడీ 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది.
MLC Elections Results 2023: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, స్థానిక సంస్థల ఫలితాలు ఈ మధ్యాహ్నం, గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు వచ్చేసరికి రెండు రోజులు పట్టే ఛాన్స్
VNSఈనెల 13న పోలింగ్ జరిగింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొమ్మిది స్థానాలకు మొత్తం 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.