తెలంగాణ
Singer Mangli Car Attacked: సింగర్ మంగ్లీ కారుపై రాళ్లతో దాడి, బళ్లారిలో పాటపాడి వస్తుండగా దాడికి పాల్పడ్డ దుండగులు, ఆ వ్యాఖ్యలే దాడికి కారణమా?
VNSప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో (Bellary) ఈ దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్స్ లో బళ్ళారి ఉత్సవ్ లోపాల్గొన్న మంగ్లీ.. తిరిగి వెళ్తుండగా ఆమె కారుపై దుండగులు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉత్సవ్ కు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజకుమార్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Ninth Nizam of Hyderabad: 9వ నిజాంగా బాధ్యతలు చేపట్టిన మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్ అజ్మత్ జా, పట్టాభిషేకం పూర్తి చేసినట్లు ప్రకటన
kanhaఎనిమిదవ నిజాం ముకర్రం జా మరణం తరువాత, అతని కుమారుడు మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్ అజ్మత్ జాను హైదరాబాద్ తొమ్మిదవ నిజాంగా అధికారికంగా ప్రకటించారు,
Jubilee Hills Shocker: మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటు.. ఎందుకొచ్చావ్ అన్న అధికారిణి? అతని సమాధానం ఏంటంటే?? జూబ్లీహిల్స్‌ లో కలకలం
Rudraహైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో నివసిస్తున్న ఓ మహిళా ఐఏఎస్ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ డిప్యూటీ తహసీల్దార్ చొరబడడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.
Train Accident In Nellore: నెల్లూరులో అర్ధరాత్రి రైలు ఢీకొని ముగ్గురి దుర్మరణం.. పట్టాలపై ఉన్న మహిళను రక్షించే ప్రయత్నంలో పురుషులు మరణించారంటున్న ప్రత్యక్ష సాక్షులు
Rudraశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్‌ ప్రెస్ రైలు ఢీకొని ఓ మహిళ, ఇద్దరు పురుషులు మృతి చెందారు.
Telangana Budget sessions: ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు, ఇండ్లు కట్టుకునేవారికి ఆర్ధికసాయంపై మధ్యతరగతి ఆశలు
VNSతెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24 ప్ర‌తిపాద‌న‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR) శ‌నివారం మ‌ధ్యాహ్నం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావుతో (Harish Rao) పాటు ఆ శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
SSC Exam In Telugu: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 స్థానిక భాషల్లోనూ పరీక్ష
Rudraగ్రామీణ ప్రాంత ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) పరీక్షను తెలుగులోనూ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పరీక్షను ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లిష్‌లో నిర్వహిస్తుండగా, ఇకపై మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్టు చెబుతూ ప్రకటన విడుదలైంది.
Accident In Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. ప్రి వెడ్డింగ్ షూట్‌కు వెళ్తుండగా ప్రమాదం
Rudraభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఇల్లెందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Secunderabad Fire MIshap: రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు తొలగించడం సాధ్యం కాదు,మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు, డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు
Hazarath Reddyసికింద్రాబాద్ డెక్కన్ మాల్‌ అగ్నిప్రమాదంపై కేసు నమోదు (Deccan mall owner for fire mishap) చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర మీడియాకు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం (Secunderabad Fire MIshap) జరిగిన తీరును వివరించారు
Nitish Kumar: కేసీఆర్ సభ సంగతి నాకు తెలియదు.. ఆహ్వానం అందనే లేదు.. నితీశ్ కుమార్ కామెంట్స్
Rudraఖమ్మంలో కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ నిర్వహిస్తున్న సంగతి తనకు తెలియదని, ఆహ్వానం అందుకున్న వారంతా వెళ్లారని అన్నారు.
Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన హైదరాబాదీ మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్
Rudraఅమెరికాలోని మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండియన్‌-అమెరికన్‌గా అరుణా మిల్లర్‌ అమెరికాలో చరిత్ర సృష్టించారు.
Etela Rajendar: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పతనం మొదలైంది.. ఈటల సంచలన వ్యాఖ్యలు
Rudraబీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు. దళితులను వంచించి అధికారంలోకి వచ్చిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు.
Secunderabad Fire Accident: డెక్కన్ స్టోర్‌ ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు, ఆందోళన కలిగిస్తున్న బిల్డింగ్ లోపలపేలుడు శబ్దాలు, దాదాపు 4 గంటలకు పైగా సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌
Hazarath Reddyసికింద్రాబాద్ పరిధిలో గల రామ్‌గోపాల్‌పేట్‌లోని డెక్కర్‌ స్టోర్‌ భవనంలో చెలరేగిన మంటలు (Secunderabad Fire Accident) ఇంకా అదుపులోకి రాలేదు.మంటలు ఆరవ అంతస్తు నుంచి రెండో అంతస్తుకు కూడా ( massive fire breaks out) వ్యాప్తించాయి.
Telangana: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం, మొదటి అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్టుగా వార్తలు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyసికింద్రాబాద్ లోని డెక్కన్‌ స్టోర్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది మంటల కారణంగా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. భవనం ఆరో అంతస్తులో మంటలు చెలరేగి కింద వరకు వ్యాపించాయి.
Kanti Velugu Program: కంటి పరీక్షలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి, నేటి నుంచి తెలంగాణలో వంద రోజుల పాటు పరీక్షలు కంటి పరీక్షలు, 16,556 శిబిరాలు ఏర్పాటు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు (Kanti Velugu Program) రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహిస్తున్నాయి.
Teacher Dies Of Heart Attack: స్కూల్లో కుర్చీలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా గుండెపోటు, తోటి ఉపాధ్యాయుల ముందే కుప్పకూలిన ఉపాధ్యాయురాలు, మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాద ఘటన
Hazarath Reddyకరీంనగర్ జిల్లాలోని మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన్నీరు సునీత(37) పాఠశాలలో బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఫిజికల్‌ సైన్స్‌ బోధించే సునీత పాఠశాలలోని కార్యాలయగదిలో తోటి ఉపాధ్యాయులతో కలిసి కుర్చీలో కూర్చుంది. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయింది.
Revanth Reddy on CM KCR: కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ ఫాంహౌస్‌లో రూ. 500 కోట్ల బేరసారాలు, తెలంగాణ సీఎం మీద తీవ్ర ఆరోపణలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Hazarath Reddyకర్ణాటకలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ కీలక నేతను లొంగదీసుకునేందుకు రూ. 500 కోట్లు ఆఫర్‌ (KCR offered Rs 500 crores) చేశారన్నారు.
Bandi Sanjay's Son Ragging Row: బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ నుంచే వీడియో లీక్, చిన్నపిల్లల జీవితాన్ని నాశనం చేస్తావా కేసీఆర్, కొడుకు వైరల్ వీడియోపై స్పందించిన బండి సంజయ్
Hazarath Reddyకరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తన కాలేజీలో జూనియర్ విద్యార్థులను కొట్టిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. సోషల్ మీడియాలో దాడికి సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేస్తోన్నాయి. ఈ క్రమంలో ఘటనపై బండి సంజయ్ స్పందించారు.
Bandi Sanjay's Son Ragging: నా కొడుకు పోలీసుల ముందు లొంగిపోయాడు, కుమారుడు వైరల్ వీడియోపై స్పందించిన బండి సంజయ్, స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన బండి సాయి భగీరత్‌
Hazarath Reddyతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన కొడుకు కాలేజీలో విద్యార్థిని కొట్టిన వీడియో వైరల్ (Bandi Sanjay's Son Slaps Row) పై స్పందించాడు. నా కొడుకు పోలీసుల ముందు లొంగిపోయాడు (My son has surrendered before the police). నా కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే (If my son has done anything wrong), అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని (police should take action) కోరారు.
Khammam Collectorate Inauguration: ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయనున్న సమీకృత కలెక్టరేట్‌
Hazarath Reddyఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు.
Kanti Velugu Programme: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, కంటి వెలుగు లబ్ధిదారులకు అద్దాలను అందజేసిన జాతీయ నేతలు
Hazarath Reddyరెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభించారు