తెలంగాణ

Giridhar Gamang Joins BRS: బీఆర్‌ఎస్‌ లో చేరిన ఒడిశా మాజీ సీఎం, కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్న గిరిధర్ గమాంగ్, 9 సార్లు లోక్‌ సభ సభ్యుడిగా గెలిచిన గమాంగ్

VNS

గిరిధ‌ర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కుమారుడు శిశిర్ గ‌మాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ గిరిధర్‌ గమాంగ్‌కు ప్రత్యేకత ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్‌ సొంత రాష్ట్రం నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

Govt Jobs in Telangana: తెలంగాణలో  2,391 కొత్త ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి, ఖాళీ పోస్టుల‌ను టీఎస్‌పీఎస్సీ, మెడిక‌ల్ హెల్త్ బోర్డు, మ‌హాత్మా జ్యోతిబాపూలే గురుకుల‌ విద్యాసంస్థ ద్వారా భ‌ర్తీ

Hazarath Reddy

తెలంగాణలో కొత్తగా మరో 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్స్‌ 480, జూనియర్‌ లెక్చరర్స్‌ 185 పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.ఈ మేరకు మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.

Telangana: రేపు పెళ్లి.. అర్థరాత్రి దాకా పనులు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన పెళ్లి కొడుకు, చికిత్స పొందుతూ మృతి, రెండు కుటుంబాల్లో తీరని విషాదం

Hazarath Reddy

అదిలాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రేపు పెళ్లి అనగా ఈ రోజు పెళ్ళికొడుకు పెళ్లి పనులు చేస్తుండగా గుండెపోటుతో (Bridegroom dies of cardiac arrest) కుప్పకూలిపోయాడు. ఆసపత్రిలో చికిత్ప పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

TS SET 2022: మార్చి 13, 14, 15 తేదీల్లో టీఎస్‌సెట్‌ పరీక్షలు, అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలు ఇవే..

Hazarath Reddy

అధ్యాపక ఉద్యోగాల అర్హతకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్‌సెట్‌–2022)లను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు మెంబర్‌ సెక్రటరీ మురళీకృష్ణ గురువారం తెలిపారు. ఈనెల 25న చివరి తేదీ గడువు ముగిసేనాటికి వివిధ సబ్జెక్టులకు 49 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Jamuna No More: ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన జమున ఆత్మకు శాంతి కలగాలి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

అలనాటి నటి జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. వందల చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని చెప్పారు.

MM Keeravani: తెలంగాణ రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం.. వీడియోతో..

Rudra

భారత 74వ రిపబ్లిక్ డే వేడుకలను తెలంగాణ రాజ్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను సత్కరించారు.

Deccan Mall Demolition: హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు షురూ.. భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో ముందే కూల్చేయాలని నిర్ణయం

Rudra

సికింద్రాబాద్ సమీపంలోని రాంగోపాల్‌పేటలోని దక్కన్ మాల్‌ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఈ మాల్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. భవనం ఏ క్షణాన్నయినా కూలిపోయే ప్రమాదం ఉండడంతో దానిని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.

Telangana CM KCR: రిపబ్లిక్ డే వేదికగా తెలంగాణలో కొనసాగుతున్న గవర్నర్ వర్సెస్ సీఎం కేసీఆర్ తగాదా, రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ డుమ్మా..

kanha

గురువారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గైర్హాజరు కావడంతో తెలంగాణలో గవర్నర్‌ వర్సెస్‌ రాష్ట్ర పోరు సాగుతోంది.

Advertisement

Padma Awards 2023: తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ పురస్కారాలు దక్కింది వీరికే! తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏడుగురికి పద్మ అవార్డులు

VNS

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma awards 2023) కేంద్రం ప్రకటించింది.ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. అందులో ఆరుగురు పద్మ విభూషణ్, 9 మంది పద్మ భూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.

Telangana IPS Reshuffle: ఎలక్షన్స్ కోసం రెడీ అవుతున్న సీఎం కేసీఆర్, ఒకేరోజు 91 మంది పోలీసు ఆఫీసర్ల బదిలీ, పలు జిల్లాల ఎస్పీలను మార్చుతూ ఉత్తర్వులు

VNS

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ (IPS transfers) చేసింది ప్రభుత్వం. పోలీస్‌శాఖను ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా 91 మంది పోలీస్‌ ఉన్నతాధికారులను ఒకేరోజు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 51 మంది ఐపీఎస్‌లు, 40 మంది నాన్‌-క్యాడర్‌ ఎస్పీలను ప్రభుత్వం వివిధ ప్రాంతాలకు బదిలీ (Telangana government) చేసింది.

Republic Day Celebrations: అన్ని రంగాల్లో హైదరాబాద్ భేష్, రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై, నాటు నాటు టీమ్‌కు సత్కారం చేసిన గవర్నర్

VNS

గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic day celebrations) రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Dr Tamilisai Soundararajan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

Angapradakshina In Tirumala: నేటి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల.. సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అంగప్రదక్షిణకు అనుమతి

Rudra

నేటి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణం కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. అలాగే, బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని నిలిపివేసినట్టు పేర్కొంది.

Advertisement

Vasant Panchami 2023: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు, గురువారం వేకువజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం

Hazarath Reddy

తెలంగాణలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో విజయరామారావు ఆదివారం ఒక ప్రకటనలోతెలిపారు.

Telangana: తెలంగాణ ఉద్యోగులకు DA ప్రకటించిన ప్రభుత్వం, 2.73 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ, టీచర్ల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదల

Hazarath Reddy

తెలంగాణలో ఉద్యోగులకు డియర్నెస్‌ అలవెన్స్‌ను ప్రకటించింది ప్రభుత్వం. ఒక డీఏ మంజూరు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2.73 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగులకు 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ చెల్లింపులు ఉండనున్నట్లు తెలిపింది.ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Cyber Army in Telangana: 14,286 మంది విద్యార్థులు,టీచర్లతో రెడీ అయిన తెలంగాణ సైబర్ ఆర్మీ, ప్రతి విద్యాసంస్థ నుంచి ఆరుగురు అంబాసిడర్లు నియామకం, రేపటి నుంచి దశలవారీగా ట్రైనింగ్‌

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో సైబర్‌ నేరాలను క్షేత్రస్థాయి నుంచి నివారించేందుకు సైబర్‌ ఆర్మీ (Cyber Army in Telangana) రెడీ అయింది.తెలంగాణ పోలీస్‌, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్‌ ఆర్మీకి అంకురార్పణ చేశారు.

Hyderabad Metro: వీడియో, సాంకేతిక కారణాలతో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద ఆగిపోయిన మెట్రో రైలు, సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

సాంకేతిక కారణాల వల్ల హైదరాబాద్ మెట్రో.. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆఫీసుకు వెళ్లే సమయం కావడం, మెట్రో ఆగిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తున్నారు. వీడియో ఇదే..

Advertisement

Hyderabad Horror: హైదరాబాద్ నగరంలో పట్టపగలే దారుణం, బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

అంబర్‌పేట్‌కు చెందిన జంగం సాయినాథ్‌ బైక్‌పై కోఠి ఇసామియా బజార్‌ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి పురానాపూల్‌ జాతీయ రహదారిలో కార్వాన్‌ వైపు వెళ్తుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి రాడ్డుతో దాడి చేశారు. కింద పడవేసి వేట కొడవలితో నరికి చంపారు.

Video: ఈ గోస ఎవలకు రావద్దు రో అయ్యో, పిల్లాడు స్కూలుకు వెళుతున్న వీడియోని షేర్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ సుమతి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఐఏఎస్ ఆఫీసర్ సుమతి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నవ్వులు పూయిస్తోంది.ఈ వీడియోలో ఓ బాబును వాళ్ల అమ్మ స్కూలుకు తీసుకువెళుతుంగా బాలుడు ఏడుస్తున్నాడు. వాయో, వాప్పో అంటూ పిల్లాడు ఏడుస్తున్న తీరును ఈ గోస ఎవలకు రావద్దు రో.. అయ్యో అంటూ అధికారి ట్వీట్ చేసింది. ఈ వీడియోని ఇప్పటికే 76 వేల మంది చూశారు.

Zomato Delivery Scam: జొమాటోలో ఫుడ్‌ డెలివరీ స్కామ్‌ ను బయటపెట్టిన కస్టమర్.. కంపెనీ సీఈవో స్పందన ఏంటంటే??

Rudra

ఫుడ్‌ ఆగ్రిగేటర్‌కు చెందిన డెలివరీ క్యాష్‌ ఆన్‌ డెలివరీతో డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవచ్చో కస్టమర్లకు చెబుతున్నాడు జొమాటో డెలివరీ బాయ్‌. అందులో ఓ కస్టమర్‌ డెలివరీ బాయ్‌ చేస్తున్న ప్రచారం గురించి నెటిజన్లతో పంచుకున్నాడు.

US Visa Interviews On Saturdays: అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఇక శనివారాల్లోనూ ఇంటర్వ్యూ

Rudra

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాలు శనివారం కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే ప్రక్రియను ప్రారంభించాయి.

Advertisement
Advertisement