తెలంగాణ
Telangana: కోమటిరెడ్డి కంపెనీలో జీఎస్టీ అధికారులు సోదాలు, పన్ను ఎగవేత ఆరోపణలపై హైదరాబాద్‌లో పలు చోట్ల సోదాలు చేసిన అధికారులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని కోమటిరెడ్డి కంపెనీ సుశి ఇన్‌ఫ్రాలో జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి
Telangana: గొర్రెల పంపిణీ డబ్బులు ఎక్కడ కేసీఆర్, మునుగోడులో ధర్నాకు దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
Hazarath Reddyగొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన (Komatireddy Rajagopal Reddy) రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Suryapet Road Accident: అర్ధరాత్రి నెత్తురోడిన సూర్యాపేట.. మునగాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం.. అయ్యప్ప స్వామి పడిపూజకు హాజరై వస్తుండగా.. రాంగ్ రూట్‌లో ప్రయాణించిన ట్రాక్టర్.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం
Sriyansh Sసూర్యాపేట జిల్లాలో గత అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మునగాల శివారులోని పెట్రోలు పంపు వద్ద గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిందీ ఘటన.
Heavy Crowd at Yadadri Temple: యాదాద్రి క్షేత్రానికి ఒక్కరోజులో రూ.1 కోటికిపైగా ఆదాయం... చరిత్రలో ఇదే ప్రథమం.. యాదాద్రీషుడి దర్శనానికి నిన్న ఒక్కరోజే లక్షమందికి పైగా కొండకు.. ఆదివారం, కార్తీకమాసం కావడంతో పోటెత్తిన భక్తులు..
Sriyansh Sతెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి. నిన్న ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, యాదాద్రికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. నేడు ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం వచ్చింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం చరిత్రలో ఇదే ప్రథమం.
Happy Children’s Day: బాలల దినోత్సవం వచ్చింది.. బోలెడు సందడి తెచ్చింది.. నేడే చిల్డ్రన్స్ డే.. పండిట్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారంటే?
Sriyansh Sనవంబర్ 14 వచ్చింది.. బాలలకు బోలెడు సందడి తెచ్చింది. ఈ రోజంటే పిల్లలకు పండగ లాంటిది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. బాలల దినోత్సవం అంటే.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు
Woman Murdered by FB Friend: ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికోసం ఇద్దరు పిల్లలను వదిలి పారిపోయిన మహిళ, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో బండరాయితో కొట్టిచంపిన ప్రియుడు
Naresh. VNSఫేస్‌బుక్‌లో పరిచయమైన (FB friend) యువకుడితో వివాహిత ప్రేమలో పడింది. అతన్ని వెతుక్కుంటూ భర్త, పిల్లలను వదిలి వెళ్లింది. తీరా ప్రియుడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ కు (Nizamabad) చెందిన ఉస్మా బేగం(32) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Special Trains For Sabaraimala: అయ్యప్ప స్వాముల కోసం శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న భారతీయ రైల్వే, ఏ ఏ స్టేషన్ల నుంచి అందుబాటులో ఉన్నయో చెక్ చేసుకోండి..
kanhaకార్తీకమాసం వచ్చేసింది ఇక అయ్యప్ప స్వాములు శబరిమలై దర్శించుకునేందుకు కేరళ వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు అయితే అయ్యప్ప స్వాముల సందర్శనార్థం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది.
New Traffic Rules: పిల్లలకు బండి ఇస్తే మీరే జైలుకెళ్తారు.. ఇతరులకు వాహనం ఇచ్చినా మీకే ఇబ్బంది.. భారీగా జరిమానా.. అదనంగా జైలు శిక్షకూ అవకాశం.. కొత్త ట్రాఫిక్ రూల్స్!
Sriyansh Sదేశంలో రోడ్డుప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అతివేగం, హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చేస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.
Munugode Bypoll: మునుగోడులో ఓటుకు రూ.9 వేలు ఇచ్చారు... ఈసీకి ఫిర్యాదు చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్.. రూ.627 కోట్ల ధనప్రవాహం చోటుచేసుకుందన్న ఎఫ్ సీజీ.. విచారణ జరిపించాలని డిమాండ్
Sriyansh Sయుద్ధాన్ని తలపించేలా సాగిన మునుగోడు ఉప ఎన్నిక ఇటీవల పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజేతగా నిలిచారు. అయితే, మునుగోడు ఎన్నికల్లో ధనప్రవాహం కొనసాగిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ సీజీ) సంస్థ ఆరోపిస్తోంది. మునుగోడు ఎన్నికల్లో రూ.627 కోట్లు ఖర్చు చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Pawan at Beach: విశాఖ బీచ్ లో పవన్ కల్యాణ్ షికారు... ఫొటోలు వైరల్.. విశాఖ పర్యటనకు వచ్చిన జనసేనాని.. ప్రధాని మోదీతో భేటీ.. నిన్న రుషికొండ పనులను పరిశీలించిన వైనం.. అనంతరం బీచ్ లో పర్యటన
Sriyansh Sజనసేనాని పవన్ కల్యాణ్ నిన్న సాయంత్రం విశాఖ రుషికొండ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక బీచ్ కు వెళ్లారు. అక్కడ అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో చేపలవేటకు వచ్చిన ఓ మత్స్యకారుడితో మాట్లాడారు.
PM Modi Telangana Tour: సింగరేణిని ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదు, తెలంగాణలో రూ.10వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని
Naresh. VNSసింగరేణి ప్రైవేటీకరణ (Singareni pravaitazation) ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో (Ramagundam) ఆర్ఎఫ్సీఎల్‌లో (RFCL) ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
PM Modi in Telangana: తెలంగాణలో రూ.2200 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, సుధీర్ఘంగా కాలంగా డిమాండ్‌ చేస్తున్న పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేసిన ప్రధాని, భద్రాచలంరోడ్డు రైల్వే లైన్ జాతికి అంకితం
Naresh. VNSతెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రామగుండంలో పర్యటిస్తున్న ఆయన...వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు.
PM Modi in Telangana: రోజుకు మూడు కిలోల తిట్లు తింటాను అందుకే అలిసిపోను: మోడీ, సాయంత్రం ఛాయ్ తాగుతూ తిట్లను ఎంజాయ్ చేయాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపు, హైదరాబాద్‌ విమానాశ్రయంలో మోదీ సభ
Naresh. VNSఎందుకంటే తనను చాలామంది తిట్టుకుంటుంటారని అలా నేను రోజుక రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే అలసిపోను అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు వేశారు ప్రధాని మోడీ. 22 ఏళ్లుగా నన్ను చాలామంది తిడుతునే ఉన్నారు..నన్ను తిట్టేవారిని పట్టించుకోకండీ..సాయంత్రం చాయ్ తాగుతు ఆ తిట్లను ఎంజాయ్ చేయండీ అంటూ కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్ధేశం చేశారు.
Hyderabad Traffic Diversions: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే చాన్స్.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలీసుల ఆంక్షలు.. ట్రాఫిక్ ఉండే ప్రాంతాలు, ప్రధాని షెడ్యూల్ ఏమిటంటే??
Sriyansh Sప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్ పురా, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
Hyderabad Shocker: భార్యతో చిన్న గొడవ, కోపం ఆపుకోలేక కత్తితో ఆమె గొంతు కోసిన భర్త, చేసిన తప్పు తెలుసుకుని రూంలోకి వెళ్లి ఉరేసుకుని చనిపోయిన బాధితుడు
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైద‌రాబాద్‌లోని జ‌గ‌ద్గిరిగుట్ట‌లో దారుణం (Hyderabad Shocker) చోటు చేసుకుంది. ఏరియాలోని రాజీవ్ గాంధీ న‌గ‌ర్ కాల‌నీలో ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను హ‌త్య చేసి, అనంత‌రం తానూ ఆత్మ‌హ‌త్య‌కు (ends life at Jagadgirigutta) పాల్ప‌డ్డాడు.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ముగ్గురు నిందితులను రెండో రోజు విచారించనున్న సిట్ అధికారులు, కీలకం కానున్న ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక
Hazarath Reddyతెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.ఈ కేసులో విచారణ కొనసాగుతున్నది. చంచల్‌గూడలో జైలులో (Chanchalguda jail) ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను సిట్‌ అధికారులు రెండో రోజు తమ కస్టడీలోకి (police take three accused into custody)తీసుకున్నారు.
Sai Samadhi: షిర్డీ సాయి భక్తులకు అద్భుత అవకాశం.. సాయి సమాధిని స్పృశించే గొప్ప భాగ్యం మళ్లీ.. ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు మాత్రమే సాయి సమాధిని తాకే అవకాశం.. సాధారణ భక్తులకు, సమాధికి మధ్య గాజు అద్దం.. సాయి సంస్థాన్ తాజా నిర్ణయంతో సాధారణ భక్తులకూ సాయి సమాధిని తాకే గొప్ప అవకాశం.. భక్తుల ఆనందం
Sriyansh Sషిర్డీ సాయి భక్తులకు ఇది గొప్ప శుభవార్త. ఇకపై సాయిబాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లే భక్తులకు సాయి సమాధిని స్పృశించే భాగ్యం కూడా కలగనుంది. ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు మాత్రమే సాయి సమాధిని తాకే అవకాశం ఉండేది. ఇప్పుడు సాధారణ భక్తులకు కూడా ఆ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.
Brothel House : కేపీహెచ్‌బీలో వ్యభిచారం జరుగుతున్న ఇంటిపై పోలీసుల మెరుపుదాడి.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన విటుడు, యువతి, అందులో పనిచేసే యువకుడు.. పరారీలో వ్యభిచార గృహ నిర్వాహకుడు
Sriyansh Sహైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం దాడి చేసింది. కాలనీలోని రోడ్ నంబరు 2, 3 మధ్యనున్న ఓ ఇంట్లో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారాన్ని అందుకున్న అధికారులు ఆ ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు.
Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి 26 ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు రైళ్లు.. ఈ నెల 20 నుంచి జనవరి 17వ తేదీ వరకు అందుబాటులో.. కాచిగూడ, నల్గొండ, కాజీపేట మార్గంలో ప్రయాణించనున్న రైళ్లు
Sriyansh Sశబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. శబరిమల వెళ్లి వచ్చే భక్తుల కోసం మొత్తంగా 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
Telangana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, హాజరైన టీఆర్ఎస్ నేతలు
Hazarath Reddyఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు.