తెలంగాణ

TRS MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు, సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (TRS MLA poaching case) కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం (telangana-government) సిట్‌ ఏర్పాటు చేసింది. సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో సిట్‌ (SIT) ఏర్పాటైంది.

MLA Raja Singh Gets Bail: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్‌, ప్రెస్‌మీట్‌లు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. జైలు నుంచి విడుదల సమయంలో కుటుంబసభ్యులే ఉండాలని కోర్టు పేర్కొంది. ప్రెస్‌మీట్‌లు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.

Telangana Shocker: పెళ్లైనా బాయ్‌ఫ్రెండ్‌ని మరచిపోలేని యువతి, కలిసి బతకలేమనే బెంగతో రైలు పట్టాల కిందపడి ఆత్మహత్య, యాదగిరి గుట్టలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రేమజంట ( Man, woman suspected to be lovers) ఆత్మహత్య కలకలం రేపింది. బహుపేట రైల్వే గేటు సమీపంలో (rail tracks in Yadagirigutta) రైలు కిందపడి ఈ యువజంట ఆత్మహత్యకు (lovers found dead) పాల్పడింది.

Lunar Eclipse: నేడే చంద్ర గ్రహణం.. హైదరాబాద్‌లో సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానున్న గ్రహణం.. 46 నిమిషాలపాటు కొనసాగి ముగియనున్న వైనం.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం

Sriyansh S

నేడు చంద్రగ్రహణం కావడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. హైదరాబాద్‌లో గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం 46 నిమిషాలపాటు కొనసాగి 7.26 గంటలకు ముగుస్తుందని జీపీ బిర్లా ఇనిస్టిట్యూట్ తెలిపింది.

Advertisement

Meta Layoffs: ట్విట్టర్‌ తర్వాత ఇప్పుడు ఫేస్‌బుక్ వంతు.. పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు ‘మెటా’ సిద్ధం! 18 ఏళ్ల ఫేస్‌బుక్ చరిత్రలో ఇదే తొలిసారి.. బుధవారం ప్రకటన వచ్చే అవకాశం

Sriyansh S

ఉద్యోగుల తొలగింపునకు ఇప్పుడు ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ కూడా సిద్ధమైంది. ఈ వారంలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున లేఆఫ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ఈ విషయంతో సంబంధం ఉన్న ఉద్యోగి ఒకరు ఈ విషయం చెప్పినట్టు తన కథనంలో తెలిపింది.

Tirumala Temple: రేపు చంద్రగ్రహణం... తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. 11 గంటల పాటు ఆలయం మూసివేత.. ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 వరకు మూసివేత.. సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజల అనంతరం దర్శనాలకు అనుమతి

Sriyansh S

ఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా మూతపడిన తిరుమల శ్రీవారి ఆలయం మరోసారి మూతపడనుంది. నవంబరు 8న చంద్ర గ్రహణం సంభవించనుండడంతో, తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 11 గంటల పాటు మూసివేయనున్నారు. ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.

Tamilisai : సీరియళ్లు, సినిమాల్లో నటించి వచ్చిన వారికే కెమెరా, మైక్ మేనియా ఉంటుంది. అగ్నిపర్వతం.. హిమాలయాలను ఏమీ చేయలేదని గుర్తుంచుకోవాలి. డీఎంకే పత్రిక ‘మురసోలి’ వ్యాసంపై తీవ్రంగా మండిపడిన గవర్నర్ తమిళిసై

Sriyansh S

తెలంగాణలో గొప్పలు చెప్పేందుకు వీలుకాక, తమిళనాడును విమర్శిస్తున్నారంటూ తమిళిసైని ఉద్దేశించి డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’లో ప్రచురితమైన వ్యాసంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రస్థాయిలో స్పందించారు.

Munugode Election Results: గత్తర లేపిన కారు, మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం, రాజగోపాల్ రెడ్డిపై 11,666 ఓట్ల మెజారిటీతో గెలుపు, బీఆర్ఎస్ బోణీ అదుర్స్

kanha

మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై 11,666 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ కి 95,028 ఓట్లు, బీజేపీకి 85,128 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ పార్టీ కేవలం 23,601 ఓట్లు సాధించింది.

Advertisement

Munugode Bypoll Result 2022: మునుగోడులో 11వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌కు ఆధిక్యం, 5800 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్, టాప్ గేరులో దూసుకెళ్తున్న కారు..

kanha

మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ టాప్ గేర్ లో దూసుకెళుతోంది. ఉప ఎన్నికల ఫలితాలు 11 రౌండ్లు పూర్తయ్యే సరికి 5800 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ గెలుపు దిశగా ప్రయాణిస్తోంది. 11రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షా 70వేల ఓట్ల కౌంటింగ్ పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Munugode Bypoll Result 2022: మునుగోడులో టీఆర్ఎస్ దూకుడు, ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తి, 3091 ఆధిక్యంలో టిఆర్ఎస్

kanha

మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎనిమిది రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 3091 ఓట్ల మెజార్టీలో ఉంది.

Munugode Bypoll Result 2022: మునుగోడు ఉప ఎన్నికల్లో ఐదో రౌండ్ పూర్తి, 1430 ఓట్లతో టిఆర్ఎస్ మెజారిటీ, ప్రతీ రౌండ్ కీ ఉత్కంఠ రేపుతున్న కౌంటింగ్

kanha

మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఐదు రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఐదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 1430 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 32405 ఓట్లు పడగా బిజెపికి 30975 ఓట్లు, కాంగ్రెస్ కు 10055, బిఎస్ పికి 1237 ఓట్లు పడ్డాయి.

Munugode Bypoll Result 2022: 4వ రౌండ్ కౌంటింగ్ పూర్తి, 714 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్, చౌటుప్పల్ లో అనుకున్నంత మెజారిటీ రాలేదని రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి

kanha

మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 714 ఓట్ల మెజార్టీలో ఉంది.

Advertisement

KTR Bike: కేటీఆర్ నడిపిన బైక్ 29 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు... ఇదిగో ఫొటో!.. 1994లో నిజాం కాలేజీలో విద్యార్థిగా కేటీఆర్.. కేటీఆర్ నాడు వాడిన సుజుకీ బైక్ ను పోస్ట్ చేసిన జాన్సన్.. 24 ఏళ్లుగా ఇదే బైక్ ను వాడుతున్నట్లుగా చెప్పిన వైనం.. జాన్సన్ పోస్ట్ చూసి అమితాశ్చర్యానికి గురైన కేటీఆర్

Sriyansh S

సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్... శనివారం రాత్రి ఓ ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో నిజాం కళాశాలలో తాను నడిపిన బైక్ ఇప్పటికీ చెక్కు చెదరలేదని, 29 ఏళ్లు గడిచినా ఆ బైక్ ఇంకా మంచి కండిషన్ లోనే ఉందంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Munugode Counting: నరాలు తెగే ఉత్కంఠ.. మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. టెన్షన్‌లో అన్ని పార్టీలు.. 8 గంటలకు ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు.. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు.. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు.. మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు

Sriyansh S

యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైనది. దీంతో పార్టీలన్నీ అటెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్య నాయకులందరూ నల్గొండకు చేరుకున్నారు.

Munugode Byelection Live Streaming: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. అటెన్షన్‌లో పార్టీలు.. లైవ్ స్ట్రీమింగ్ ఇదిగో..

Sriyansh S

అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడింది. మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. దీంతో పార్టీలన్నీ అటెన్షన్‌లోకి వెళ్లిపోయాయి.

No Recce on Pawan Kalyan: పవన్‌ హత్యకు కుట్ర జరుగలేదు! రెక్కీ నిర్వహించారనే పుకార్లపై తెలంగాణ పోలీసుల క్లారిటీ, ఇంతకీ పవన్ ఇంటి ముందు జరిగిన గొడవ ఏంటో తెలుసా? రెక్కీ అంశంపై జూబ్లీహిల్స్ పోలీసుల నివేదిక

Naresh. VNS

గత నెల 31న రాత్రి ఘటనపై పవన్ సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా మద్యం మత్తులోనే తాము పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కారు ఆపామని, ఆ సమయంలో తమ కారును అక్కడి నుంచి తీయమన్న పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగామని ఆ యువకులు చెప్పినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు

Advertisement

Congress Leaders Dance Video: తెలంగాణ కాంగ్రెస్ నేతల డ్యాన్స్ వైరల్, కొత్త స్టెప్పులతో అదరగొట్టిన దామోదర రాజనర్సింహ, విహెచ్ హనుమంతరావు

Hazarath Reddy

భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతోంది. గురువారం రాత్రి పాదయాత్రను ముగించే సందర్భంగా జిల్లా పరిధిలోని అందోల్ లో భారీ బహిరంగ సభను జరిగింది.

Telangana: మరో సీఐ ఏకంగా కారులోనే రాసలీలలు, వనస్థలిపురం సీఐ రాజును అరెస్ట్ చేసిన పోలీసులు, సీఐ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు

Hazarath Reddy

మాజీ సీఐ నాగేశ్వరరావు ఉదంతం మరవక ముందే మరో ఇన్‌స్పెక్టర్‌ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంలో ఇన్‌స్పెక్టర్‌ గా పని చేస్తున్న రాజు అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది.

KTR Tweet: ఈ సుందర దృశ్యం ఎక్కడిదో చెప్పమన్న కేటీఆర్... వైరల్ గా మారిన మంత్రి ట్వీట్.. క్షణాలలో వచ్చిన వందల కొలదీ రీట్వీట్లు.. అది గండిపేట లేక్ పార్క్ లోనిదన్న నెటిజన్లు

Sriyansh S

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. పర్యాటక ప్రాంతానికి చెందిన ఓ సుందర దృశ్యాన్ని పోస్ట్ చేసిన ఆయన... ఇదెక్కడిదో చెప్పుకోండి చూద్దాం అంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న సంధించారు.

Munugode Bypoll 2022: పోటెత్తిన ఓటరు.. మునుగోడులో ముగిసిన పోలింగ్.. మొత్తంగా 93.13 శాతం పోలింగ్ నమోదు.. 2018లో జరిగిన ఎన్నికల్లో నమోదైన 91.31 శాతం పోలింగ్ తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ..

Sriyansh S

మునుగోడులో పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. దీంతో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. మొత్తంగా 93.13 శాతం పోలింగ్‌ నమోదైంది. 2018లో జరిగిన ఎన్నికల్లో నమోదైన 91.31 శాతం పోలింగ్ తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ.

Advertisement
Advertisement