తెలంగాణ
Telangana: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రైవేట్‌ మందుల దుకాణాలు ఎత్తివేయాలని నిర్ణయం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని (govt. hospitals) ప్రైవేట్‌ మందుల దుకాణాలను ఎత్తివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు వీటిని (private pharmacies ) ఎందుకు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Telangana Shocker: తెలంగాణలో దారుణం, పుట్టిన రోజు పేరుతో 12 ఏళ్ళ బాలికను పెళ్లి చేసుకున్న 35 ఏళ్ళ యువకుడు, సహకరించిన బాలిక తల్లిదండ్రులు
Hazarath Reddyపుట్టిన రోజు వేడుక పేరుతో 35ఏళ్ల వ్యక్తికి 12ఏళ్ల చిన్నారిని ఇచ్చి పెండ్లి చేశారు. అనంతరం పెళ్లి ఇష్టం లేదని చెప్పిబాలిక బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారిని పంపించాలని తల్లిదండ్రులు వాగ్వివాదంకు దిగారు.
TS Inter Academic Calendar 2023: జూన్ 15 నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ సెకండ్ ఇయర్ త‌ర‌గ‌తులు, జూలై 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ క్లాసులు, అక‌డ‌మిక్ షెడ్యూల్‌ విడుదల చేసిన తెలంగాణ ఇంట‌ర్ బోర్డు
Hazarath Reddyతెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు జూన్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ఇంట‌ర్ బోర్డు సోమ‌వారం 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి ఇంట‌ర్మీడియ‌ట్ అక‌డ‌మిక్ షెడ్యూల్‌ను విడుద‌ల (TS Inter Academic Calendar 2023) చేసింది
Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరిక, రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం, అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
Hazarath Reddyఅమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Rains in Telugu States) ఇంకా కొనసాగనున్నాయి. ఈ నెల 19 వరకూ ఏపీకి వర్ష సూచన ఉంది
Harish Rao Fires on Amith Shah: అమిత్ షా కాదు అబద్దాల బాద్‌ షా, తుక్కుగూడ సభలో పచ్చి అబద్దాలు చెప్పారంటూ మండిపడ్డ హరీష్‌ రావు, పార్లమెంట్‌ లో ఒక మాట, ప్రజల్లో ఒక మాట చెప్తున్నారంటూ అమిత్ షా పై ఫైర్‌
Naresh. VNSత‌న అబ‌ద్ధాల‌తో తెలంగాణ ప్రజ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై (Amith Shah) హ‌రీశ్‌రావు (Harish Rao) ధ్వజ‌మెత్తారు. నిన్న ఆయ‌న చెప్పివ‌న్నీ అస‌త్యాలేన‌ని హ‌రీశ్‌రావు స్పష్టం చేశారు. అమిత్ షా చెప్పిన అబ‌ద్ధాల‌పై స్థానిక బీజేపీ నాయ‌కుల‌కు ద‌మ్ము, ధైర్యం ఉంటే తాను అడుగుత‌న్న ప్రశ్నల‌కు స‌మాధానం చెప్పాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.
Manchu Vishnu: ఆరు నెలల్లో మా బిల్డింగ్‌ కు శంకుస్థాపన, భూమిపూజకు ముహుర్తం ఖరారు చేస్తామన్న మంచు విష్ణు, మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేయించిన విష్ణు
Naresh. VNSమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) శాశ్వత బిల్డింగ్ కోసం త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. మరో ఆరు నెలల్లో భూమి పూజ చేస్తామన్నారు. తాజాగా AIG హాస్పిటల్ లో ‘మా’ సభ్యులకి ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Amith Shah in Hyderabad: దమ్ముంటే రాజీనామా చెయ్‌! కేసీఆర్‌ కు అమిత్ షా సవాల్, కేంద్రం డబ్బుతో రాష్ట్రం పథకాలు పెడుతోందని విమర్శలు, తుక్కుగూడ సభలో కేసీఆర్‌పై ఫైర్ అయిన షా
Naresh. VNSతెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారని, దమ్ముంటే రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేసీఆర్‌పై (KCR) ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణను కేసీఆర్ (KCR) అప్పుల్లో ముంచేశారని అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో(Tukkuguda) నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో (BJP Rally) అమిత్ షా ప్రసంగించారు.
Amit Shah in Hyderabad: హైదరాబాద్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు చేరుకున్న అమిత్ షా, 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు, షా టూర్ లో హైలైట్స్ ఇవే..
Krishnaకేంద్ర హోం మంత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన అమిత్‌షాను కిషన్‌ రెడ్డి, మురళీధర్‌ రావు, దుబ్యాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌, ఈటల రాజేందర్, విజయ శాంతి, వివేక్ తో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు.
Hyderabad Shocker: మియాపూర్‌లోని అపార్ట్‌మెంటులో ఫ్యామిలీ ముసుగులో వ్యభిచారం, గుట్టురట్టు చేసిన పోలీసులు, అదుపులో నిర్వాహకులు
Krishnaఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై మియాపూర్‌ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
Amit Shah In Hyderabad: నేడు హైదరాబాద్ కు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.
Krishnaకేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించబోతున్నారు. తుక్కుగూడలో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొనడం కోసం ఆయన నగరానికి వస్తున్నారు.
KTR vs Bandi Sanjay: బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి, లీగల్‌ నోటీసులు పంపించిన తెలంగాణ మంత్రి కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు.. మంత్రి కేటీఆర్‌ (Minister KTR) శుక్రవారం లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ నెల 11న ట్విట్ట‌ర్‌లో త‌న‌పై బండి సంజ‌య్ నిరాధార‌మైన‌ ఆరోప‌ణ‌లు చేశార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోప‌ణ‌ల‌పై ఆధారాలు ఉంటే బ‌య‌ట పెట్టాల‌ని, లేదంటే బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా డిమాండ్ చేశారు
C Narasimha Rao Passes Away: ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకులు సి. నరసింహారావు కన్నుమూత, సంతాపం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
Krishnaహైదరాబాద్, మే 12: ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి. నరసింహారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.
Rajiv Swagruha Flats: హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం, రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలానికి నోటిఫికేషన్, బండ్లగూడ, పోచారంలో అందుబాటులో ఉన్న ఫ్లాట్లు, వేటి ధర ఎంతంటే? కొనాలనుకుంటే చేయాల్సింది ఇది!
Naresh. VNSసొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే హైదరాబాద్ (Hyderabad) వాసులకు హెచ్ఎమ్‌డీఏ (HMDA) శుభవార్త చెప్పింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ (Bandlaguda), పోచారం (Pocharam) పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను (Rajiv Swagruha Flats) అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ (Notification) కూడా తాజాగా విడుదలైంది.
Telangana: తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది, రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని తెలిపిన మంత్రి హరీష్ రావు
Hazarath Reddyమహబూబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని.. తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.
Telangana: వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌ పెంచిన తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుతం వాహన ధర ఆధారంగా రూ.50 వేల లోపు అయితే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12 శాతంగా నిర్ణయం
Hazarath Reddyవాహనాల లైఫ్‌ ట్యాక్స్‌లను స్వల్పంగా పెంచుతూ (Transport dept. enhances life tax) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త లైఫ్‌ ట్యాక్స్‌లు మే9 నుంచి నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు
Telangana: అన్న మరణం తట్టుకోలేక గుండెపోటుతో తమ్ముడి మృతి, మంచిర్యాల జిల్లాలో 3 గంటల వ్యవధిలో విషాద ఘటనలు, శోక‌సంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyల‌క్సెట్టిపేట ప‌ట్ట‌ణానికి చెందిన గాజుల భాస్క‌ర్ గౌడ్(46), శ్రీనివాస్ గౌడ్ అన్న‌ద‌మ్ములు. అయితే భాస్క‌ర్ గౌడ్ గుండెపోటుతో మ‌ర‌ణించాడు. అన్న మృతి చెందాడ‌న్న వార్త శ్రీనివాస్ గౌడ్‌కు తెలిసింది. దీంతో హుటాహుటిన ల‌క్సెట్టిపేట‌కు శ్రీనివాస్ గౌడ్ చేరుకుని అన్న మృత‌దేహాన్ని చూసి బోరున విల‌పించాడు. ఈ క్ర‌మంలో శ్రీనివాస్ గౌడ్ కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
Kamareddy Road Mishap: కామారెడ్డి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyకామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.
Telangana Shocker: ప్రియుడి మోజులో..పెళ్లయిన 35 రోజులకే భర్తను చంపేసిన భార్య, ప్రేమించిన వ్యక్తి, అతని స్నేహితులతో కలిసి దారుణంగా హతమార్చిన కసాయి, నిందితులంతా కటకటాల్లోకి..
Hazarath Reddyతెలంగాణలోని సిద్దిపేటలో దారుణం (Telangana Shocker) చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి పెళ్లయిన 35 రోజులకే కట్టుకున్న భర్తను చంపేసింది ఓ ఇల్లాలు. ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరో వ్యక్తితో పెళ్లి చేయడంతో అతన్ని చంపేందుకు (Woman Kills Husband for Lover in Siddipet) పథకం రచించి ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లింది.
Kamareddy Road Mishap: తెలంగాణలో రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 50 వేలు
Hazarath Reddyఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు, గాయపడిన వారితో త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరణించిన వారి బంధువులకు పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 సాయం ప్రకటించారు.
Kamareddy Road Mishap: తెలంగాణలో ఘోర విషాదం, కొడుకు దినకర్మకు వెళ్లి వస్తూ తల్లితో సహా 9 మంది మృత్యువాత, మరో 17 మందికి గాయాలు
Hazarath Reddyకొడుకు దినకర్మ తర్వాత ‘అంగడి తిప్పడం’ కోసం వెళ్లి వస్తూ తల్లి సహా సమీప బంధువులు తొమ్మిది మంది ఘోర రోడ్డు ప్రమాదంలో (Kamareddy Road Mishap) మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలు కాగా, ముగ్గురు చిన్న పిల్లలు సహా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.