తెలంగాణ

Beware Of Frauds: ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదు రా అంటున్న సైబరాబాద్ పోలీసులు, ఫేక్‌ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

Hazarath Reddy

ఈ మధ్య కాలంలో ఫేస్ బుక్ లో చాలా మంది ఫేక్ అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. కొందరయితే ఏకంగా వేరే వాళ్ల ప్రాఫైల్స్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారు. ఈ మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే (Beware Of Frauds) ఉన్నారు.

TS Dussehra Holidays: 12 రోజుల పాటు దసరా సెలవులు, ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించిన తెలంగాణ, దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపనున్న టీఎస్‌ఆర్టీసీ

Hazarath Reddy

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు (TS Dussehra Holidays) ఇవ్వనున్నారు. ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు.

TS Monsoon Session 2021: కేంద్రంపై మండిపడిన కేసీఆర్, తెలంగాణను కేంద్రం చిన్న‌చూపు చూస్తోంద‌ని ధ్వజం, తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్రశ్నోత్తరాలపై కొనసాగుతున్న చర్చలు

Hazarath Reddy

తెలంగాణ ప‌ట్ల కేంద్ర నిర్ల‌క్ష్య వైఖ‌రిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. తెలంగాణను కేంద్రం చిన్న‌చూపు చూస్తోంద‌ని సీఎం ధ్వ‌జ‌మెత్తారు. శాస‌న‌స‌భ‌లో (Telangana Assembly Monsoon Session 2021 day 4) ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌పంచ వార‌సత్వ క‌ట్టడంగా రామ‌ప్ప దేవాల‌యం మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌మాధానం ఇచ్చిన అనంత‌రం సీఎం కేసీఆర్ మాట్లాడారు. టూరిజంతో పాటు ఇత‌ర విష‌యాల్లో కేంద్రం తెలంగాణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.

Huzurabad Bypoll 2021: హుజూరాబాద్ హీరో ఎవరు కాబోతున్నారు, బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ఖరారు, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరు వెంకట్, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్, అక్టోబర్ 30న ఉప ఎన్నిక

Hazarath Reddy

తెలంగాణ హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. ఈటల రాజేందర్ కే (Ex-Telangana Minister Etela Rajender) టికెట్ ను కన్ఫర్మ్ చేసింది. బీజేపీ అధిష్ఠానం దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దాంతో పాటు మిజోరాంలోని తురివాల్, మహారాష్ట్రలోని చెగలూరు నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకూ అభ్యర్థులను ప్రకటించింది.

Advertisement

Telangana Shocker: మగ పిల్లాడు పుడితేనే మా ఇంటికి రా, కోడలిని శాసించిన అత్త, ఆమె కొడుకు, కూతురును భూమి మీదకు రానివ్వడం లేదని వేదనతో ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురాలో దారుణం చోటు చేసుకుంది. అత్త, భర్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. గర్భంలో ఆడపిల్ల ఉంటే ఆబార్షన్‌ చేయించుకో.. మగపిల్లవాడు పుడితేనే ఇంట్లో అడుగుపెట్టమని భర్త, అత్త ఖరాఖండిగా (husband torture) చెప్పడంతో నాలుగు నెలల గర్భిణీ మనోవేదనకు గురై ఉరి వేసుకుని ఆత్మహత్య (Woman ends life ) చేసుకుంది.

Madhapur Road Accident: మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు, కృష్ణా జిల్లాలో విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు మృతి

Hazarath Reddy

భాగ్యనగరంలో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం (Madhapur Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. ద్విచక్రవాహనంపై భాగ్యనగర్‌ సొసైటీ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారన్న విషయాన్ని గమనించారు.

Telangana Green Fund: తెలంగాణ హరిత నిధి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు జీతాల నుంచి కొంత పండ్ జమ చేయాలని కోరిన కేసీఆర్, నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్‌ఫండ్‌)ను (Telangana Green Fund) ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు (Telangana Haritha Fund) జమ చేయాలని కోరారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 220 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 67 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,193 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 67 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు గుర్తించారు.

Advertisement

Nizamabad Gang Rape Case: మద్యం తాగించి యువతిపై తెగబడిన కామాంధులు, ఆరుగురిని ఆరెస్ట్ చేసిన నిజామాబాద్ పోలీసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Hazarath Reddy

నిజామాబాద్‌లో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ తెలిపారు. సామూహిక అత్యాచారం కేసు (Nizamabad Rape Case) వివరాలను గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 245 మందికి కరోనా, ప్రస్తుతం రాష్ట్రంలో 4,620 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 52,683 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 245 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,65,749కి చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు.

Telangana Shocker: బరి తెగించిన కామాంధులు, యువతికి మద్యం తాగించి ఆస్పత్రి గదిలో సామూహిక అత్యాచారం, నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

తెలంగాణలో నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి (young woman gang-raped in Nizamabad ) పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం (gang-raped in Nizamabad) జరిగింది.

Hyderabad Weather Report: భారీ వర్షాలకు వణుకుతున్న హైదరాబాద్, మరో 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలుండడంతో నగరంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టంచేసింది.

Advertisement

Cyclone Gulab: తెలుగు రాష్ట్రాలను వణికించిన గులాబ్ తుఫాన్, తెలంగాణలో 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా, అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు, ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపిన సైక్లోన్ గులాబ్

Hazarath Reddy

గులాబ్ తుపాను ఎఫెక్ట్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad MD) అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ సహా పలు జిల్లా్ల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపారు.

By-Polls 2021: తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 30న ఉపఎన్నికలు, తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు బై పోల్స్, నవంబర్‌ 2న కౌంటింగ్‌

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్‌ (Huzurabad Bypoll 2021), ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న (By-poll Scheduled On October 30) ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.

Cyclone Gulab: గులాబ్ గుబులు..దయచేసి ఎవరూ బయటకు రావొద్దు, మరో రెండు రోజులు తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు, తెలంగాణలోని 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లపై వరద పొటెత్తింది. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. వర్షానికి వాహనదారుల ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా స్థానికులు మ్యాన్‌హోల్స్‌ మూతలు తీశారు. వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Cyclone Gulab: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, అవసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన, గులాబ్‌ తుపాన్ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Hazarath Reddy

కళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన గులాబ్‌ తుపాను తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీన పడిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు 65 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం (IMD) తెలియజేసింది.

Advertisement

Corona in TS: జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 కొత్త కేసులు, తెలంగాణలో గత 24 గంటల్లో 170 పాజిటివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 34,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 11, నల్గొండ జిల్లాలో 10 కేసులు గుర్తించారు.

Telangana: కూతుర్ల దినోత్సవం రోజే తల్లిదండ్రులకు శోకం, గోవాలో గుండెపోటుతో మృతి చెందిన మంచిర్యాల వైద్యురాలు, ఆమె పుట్టిన రోజు నాడే ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిన కుటుంబం

Hazarath Reddy

తెలంగాణ మంచిర్యాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కూతుర్ల దినోత్సవం (Dauhters Day) రోజునే ఓ కూతురు తన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చుతూ తిరిగిరాని లోకాలకు (Mancherial Female doctor Dies) వెళ్లిపోయింది. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.

TS Monsoon Session 2021: పెట్టుబడులను రుణంగా చూడొద్దన్న మంత్రి కేటీఆర్, గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంప‌ద‌ను సృష్టించామన్న మంత్రి తలసాని, రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

Hazarath Reddy

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Telangana Assembly Monsoon Session 2021) ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని రోడ్ల పరిస్థితులపై సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో రోడ్లు, పైవంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ( Minister KTR) సమాధానమిచ్చారు.

Hyderabad Shocker: పెళ్లయిన నెలకే భార్య గొంతు కోసి చంపేసిన కసాయి భర్త, అనంతరం ఆత్మహత్యా ప్రయత్నం, హైదరాబాద్ ప్రగతినగర్‌లో దారుణ ఘటన

Hazarath Reddy

పెళ్లయి నెల కూడా కాలేదు. అప్పుడే భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తాయి. ఇవి తారాస్థాయిక చేరడంతో భార్యను గొంతు కోసి భర్త అతి కిరాతకంగా హత్య (Man kills wife over suspicion of affairs) చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది.

Advertisement
Advertisement