తెలంగాణ
MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ
Arun Charagondaనిన్న సినీ హీరో అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై స్పందించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పుష్ప 2 సినిమా కోసం సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ నిన్న హడావుడిగా ఒక ప్రెస్ మీట్ లో ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తారనుకున్నామన్నారు.
Telangana: గురుకులంలో దారుణం..మెట్లపై నుండి జారిపడి విద్యార్థిని మృతి..వీడియో
Arun Charagondaమెట్ల పై నుండి జారిపడి మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి చెందారు. సంగారెడ్డి - జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో ఈఘటన చోటు చేసుకుంది.
Attack On Police: పోలీసుల మీదే దాడి చేసిన ప్రజలు...మతిస్థిమితం లేదని బాలికపై అత్యాచారం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...ఆగ్రహంతో పోలీసులపైనే స్థానికుల దాడి
Arun Charagondaబాలికను కిడ్నాప్ చేసి తన ఇంట్లో మూడు గంటలు అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో ఓ యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేసి, తన ఇంట్లో మూడు గంటలు బంధించి అత్యాచారం చేశాడు.
CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు
Rudraఅల్లు అర్జున్ నటించిన పుష్ప- 2 సినిమాపై, ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించడంపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. పుష్ప-2 ఘటన విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయి అని నారాయణ ఆరోపించారు.
CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం
Arun Charagondaక్రిస్టియన్ల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు సీఎం రవేంత్ రెడ్డి. తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమని వెల్లడించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎల్పీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కేక్‌ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు
Blade Found in Biryani: బిర్యానీలో బ్లేడు.. హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లోని ఆదర్శ్ బార్ & రెస్టారెంట్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో ఉన్న ఆదర్శ్ బార్ & రెస్టారెంట్ లో వడ్డించిన ఓ బిర్యానీలో బ్లేడ్ కలకలం సృష్టించింది. బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య, అతని ఫ్రెండ్స్ కి బిర్యానీ తింటుండగా ఈ బ్లేడు కనిపించినట్టు తెలుస్తుంది.
Allu Arjun: వీడియో ఇదిగో, నేను కష్ట పడిందే తెలుగువాళ్ళ పేరు నిలబెట్టడానికి, ఇప్పుడు నేషనల్ మీడియా ముందు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని మండిపడిన అల్లు అర్జున్
Hazarath Reddyమీరు అలా అన్నారు.. ఇలా అన్నారు.. అంటూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. నేను కష్ట పడిందే తెలుగువాళ్ళ పేరు నిలబెట్టడానికి.. అలాంటిది ఒక నేషనల్ మీడియా ముందు నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది - అల్లు అర్జున్
Allu Arjun on Sandhya Theatre stampede: వీడియో ఇదిగో, నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకొనా? లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయానని తెలిపిన అల్లు అర్జున్
Hazarath Reddyలీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్లి వాళ్ళ కుటుంబాలను కలిశాను.అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకొనా? నేను వెళ్ళలేక తరువాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా..
Allu Arjun on Sandhya Theatre Stampede: వీడియో ఇదిగో, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ వేసింది, అలా జరిగిందని తెలిసి ఉంటే వాళ్ళను థియేటర్లోనే వదిలి వెళ్ళను కదా అంటే అల్లు అర్జున్ ఎమోషన్
Hazarath Reddyనేను రోడ్డు షో చేయలేదు. నాకు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోమని చెప్పారు అనేది పచ్చి అబద్దం. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏ పోలీస్ వాళ్ళు ఏమీ చెప్పలేదు. మా మేనేజర్ వాళ్ళు వచ్చి బైట ఓవర్ క్రౌడ్ ఉంది మీరు వెళ్లిపోండి అంటే వెళ్ళిపోయా.నా భార్య, పిల్లలు నా పక్కనే ఉన్నారు.. అలా జరిగిందని తెలిసి ఉంటే వాళ్ళను థియేటర్లోనే వదిలి వెళ్ళను కదా.
Allu Arjun: వీడియో ఇదిగో, పోలీసుల పర్మిషన్ ఇస్తే నాకు క్షణంలో ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లాలని ఉంది, భావేద్వేగానికి గురైన అల్లు అర్జున్, మా నాన్న కూడా పోలీసుల దగ్గర గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వచ్చిందంటూ..
Hazarath Reddyపోలీసుల పర్మిషన్ ఇస్తే నాకు క్షణంలో ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లాలని ఉంది.మా నాన్న కూడా పోలీసుల దగ్గర గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. అంటే ఇన్ని రోజులు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళకుండా చేసి రివర్స్ లో వెళ్లట్లేదు వెళ్లట్లేదు అని ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు.
Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ, ఓ మహిళ చనిపోతే అలా చేశారంటూ ఆగ్రహం
VNSపుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహార శైలిని ప్రస్తావించారు.
Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వెళ్లలేదు, నేను ఆ రోజు అస్సలు రోడ్ షో చేయలేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్
VNSసంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై అల్లు అర్జున్ (Allu arjun) స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అల్లు అర్జున్‌పై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు.
Sangareddy: కరెంట్ పోల్‌పై కూర్చోని వ్యక్తి హల్చల్, కుటుంబ కలహాల నేపథ్యంలో పోల్ ఎక్కిన యువకుడు..జగ్గారెడ్డి రావడంతో కిందకు దిగిన వినోద్..వీడియో
Arun Charagondaసంగారెడ్డిలో కరెంట్ పోల్‌పై కూర్చోని వ్యక్తి హల్చల్ చేశాడు. తనని ఇంట్లో ఉండనివ్వడం లేదని పోల్ ఎక్కాడు రాజంపేటకు చెందిన వినోద్. జగ్గారెడ్డి వస్తే దిగుతానని పైన నుండి చిటీలు రాసి కింద పడేశాడు వినోద్. జగ్గారెడ్డి రావడంతో కిందకు దిగి తన సమస్యను చెప్పాడు.
CM Revanth Reddy On Pushpa 2 Stampede: ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదు, అల్లు అర్జున్ అసలు మనిషేనా?..అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Arun Charagondaతాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పుష్ప 2 విషాదంపై మాట్లాడిన సీఎం రేవంత్...అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా?...దేనికి మీ పరామర్శలు.. సినీ ప్రముఖులను ప్రశ్నించారు.
CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ
Arun Charagondaసంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్...ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం దీనికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములే కారణం అని మండిపడ్డారు. రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా చెప్పాలన్నారు.
Telangana: మీడియా ఎస్‌ఐ చిందులు, ఏం చేసుకుంటారో చేసుకోమని జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిన ఎస్‌ఐ గీత...ఎస్‌ఐపై జర్నలిస్టుల ఫైర్
Arun Charagondaజగిత్యాల జిల్లాలో మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు జగిత్యాల టౌన్ ఎస్ఐ గీత. పోలీస్ స్టేషన్ వద్ద ఓ సమస్య పై బాధితులు మాట్లాడుతుండగా పలు ఛానల్ మైక్ లు తీసివేశారు ఎస్సై. ఏం చేసుకుంటారో చేసుకోమని జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం 100శాతం రుణమాఫీ అంటాడు.. ఎమ్మెల్యేలు 70శాతం రుణమాఫీ అంటున్నారు...మీ ఎమ్మెల్యేలకు కనీసం ట్రైనింగ్ అయినా ఇవ్వండని చురకలు అంటించారు కేటీఆర్. ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ...కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా చెప్పాలన్నారు.
Telangana: దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ ని ఢీ కొట్టిన డీసీఎం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి, చనిపోయిన వారిలో ఒక మహిళ...వీడియో
Arun Charagondaనల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మల్లేపల్లి రోడ్డులో గల దర్గా దగ్గర బైక్ ని ఢీ కోట్టింది డీసీఎం.. బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మరణించారు. మృతులు దేవరకొండ మండలం తాటికొల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.. దర్గా నుండి దేవరకొండ పట్టణం వైపు వస్తున్నా బైక్ ని వెనుకనుండి వచ్చి డీసీఎం గుద్దడంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు.మృతులలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.
Tremors in Prakasam: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు.. భయంతో స్కూల్ నుంచి బయటకు పరుగులుతీసిన విద్యార్థులు
Rudraఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో శనివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు.
Hyderabad Traffic Restrictions: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడకలను నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.