తెలంగాణ
Harish Rao Challenge To Revanth Reddy: కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్, నిరూపించేందుకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరిన హరీష్ రావు
VNSముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్దాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్దమా..? నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా..?అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు.
Hydraa Police Station: లొటస్ పాండ్ లో ఎకరం కబ్జా చేసేందుకు యత్నం, త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్, రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
VNSచెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై ఎక్కువగా దృష్టిపెట్టామన్న రంగనాథ్.. లోటస్‌పాండ్‌లో (Lotus Pond) ఏకంగా ఓ వ్యక్తి ఎకరం స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే హైడ్రా అడ్డుకుందన్నారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు.
Cyclone Fengal Update: తీరం దాటిన ఫెంగల్ తుఫాన్, తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం
VNSతుఫాను ప్రభావంతో చెన్నైలో వర్షాలు కొనసాగుతున్నాయి. చెన్నై విమానాన్ని తాత్కాలికంగా మూసివేయగా.. పలు విమానాలు రద్దయ్యాయి. వర్షాలతో హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై మధ్య నడవాల్సిన విమానాలను ఎయిర్‌లైన్స్ సంస్థలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
Teegala Krishna Reddy: టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీటీడీపీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం!
Arun Charagondaతెలంగాణ టీడీపీపై ఫోకస్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే టీటీడీపీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు. డిసెంబర్ 3న టీడీపీలో చేరనున్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. చేరిక అనంతరం తీగలకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు చంద్రబాబు.
Hyderabad: కీచక టీచర్... విద్యార్థినితో తప్పుడు ప్రవర్తన, కాలేజీ ముందు విద్యార్థిని తల్లిదండ్రుల ఆందోళన
Arun Charagondaచదువు చెప్పాల్సిన టీచర్ కీచకుడిగా మారాడు. విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు. మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. తప్పుగా ప్రవర్తించిన కెమిస్ట్రీ లెక్చరర్‌ను కాలేజీ నుంచి తొలగించింది యాజమాన్యం.
Cyclone Fengal Updates: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు!
Arun Charagondaనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. నాగపట్నానికి 230 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 210 కిలో మీటర్లు, చెన్నైకి 210 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నంకు పుదుచ్చేరిలోని కార్తెకాల్, తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
RS Praveen Kumar: కొండా మురళిపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్..ఎంతోమంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేశాడు, దీనికి సాక్ష్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు అని వెల్లడి
Arun Charagondaబీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ గెస్ట్ హౌజుల్లో కొండా మురళి దారుణాలు చేశాడని ఆరోపించారు. వరంగల్‌లో ఎంతో మంది అమ్మాయిలు, విద్యార్థుల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడని...2002లో ఆయన ఘోరాలు భరించలేక నళిన్ ప్రభాకర్ అనే పోలీస్ ఆఫీసర్ హన్మకొండ చౌరస్తాలో బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చాడని గుర్తు చేశారు.
CM Revanth Reddy: పాలమూరుకు వస్తున్నా..రైతులతో కలిసి ఆనందం పంచుకోవడానికి, ఓటు అభయ హస్తమై రైతన్నల చరిత్ర తిరగరాసిందన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు…పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు...ఆ ఓటు అభయహస్తమై…రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి...ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…రూ.7,625 కోట్ల రైతు భరోసా…ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్…రూ.1433 కోట్ల రైతుబీమా…రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం…రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టామన్నారు.
Vishva Hindu Parishad: ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్‌ను విడుదల చేయాలి, బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని హైదరాబాద్‌లో మానవహారం
Arun Charagondaఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్‌ను విడుదల చేయాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ మతోన్మాదం నశించాలని.. బంగ్లాదేశ్‌లోని హిందువుల రక్షణకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Burra Venkatesham: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా బుర్రా వెంకటేశం, ఫైలుపై సంతకం చేసిన గవర్నర్..డిసెంబర్ 2న బాధ్యతలు చేపట్టనున్న వెంకటేశం
Arun Charagondaతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్ పర్సన్ గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియామకమయ్యారు. డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించనుండగా ఇందుకు సంబంధించిన ఫైల్ పై తెలంగాణ గవర్నర్ సంతకం చేశారు.
Medak: మెదక్‌లో ఫన్నీ సంఘటన.. అర్ధరాత్రి ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ.. యజమాని సడెన్ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Arun Charagondaమెదక్ జిల్లా నార్సింగిలో ఫన్నీ సంఘటన జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ.. యజమాని సడెన్ ఎంట్రీ ఇచ్చారు. చుట్టూ పక్కల రెక్కీ నిర్వహించి గేటు తాళం పగలగొట్టగా ఇంతలోనే సడెన్ ఎంట్రీ ఇచ్చారు ఇంటి యజమాని. వేరేవాళ్లు అనుకుని గేటు లోపలికి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేయగా యజమాని సంతోష్ అదే ఇంటికి రావడంతో అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత దొంగ అక్కడి నుండి పారిపోగా సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Telugu Student Dies in US: అమెరికాలోని చికాగోలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి
Rudraఅమెరికాలోని చికాగోలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాలోని రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26) మృతి చెందారు.
Harishrao: రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే కుట్ర..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో షేర్ చేసిన హరీశ్ రావు, రైతులను మోసం చేసి రైతు పండుగ నిర్వహిస్తారా అని ఫైర్
Arun Charagondaసాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన వీడియోను షేర్ చేసిన హరీశ్....రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ, రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయం అన్నారు.
KTR: జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్..చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం, లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయమన్న కేటీఆర్
Arun Charagondaలగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం.. తెలంగాణ ప్రజల విజయం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం... ఆత్మగౌరవం, అస్తిత్వం, అస్మిత.. ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లవుతం అన్నారు.
Complaint Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు.. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం ఏంటని ఫిర్యాదుదారు మండిపాటు
Rudraటాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
Fire Accident in Bus: నర్సింగ్ కళాశాల విద్యార్ధులకు తప్పిన పెను ప్రమాదం.. కళాశాల బస్సు దగ్ధం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ఘటన (వీడియో)
Rudraఏపీలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై బస్సులో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తృటిలో తప్పించుకున్నారు.
Cyclone Fengal Live Update: దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్
Rudraనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రం తుఫాన్ గా బలపడింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Protest in Nagarjuna University: సాంబార్ లో కప్ప.. భోజనం మానేసిన విద్యార్థినులు.. నాగార్జున యూనివర్సిటీలో ధర్నా.. స్పందించిన మంత్రి నారా లోకేష్ (వీడియో)
Rudraనాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినులు ధర్నాకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు.
Good News for PSU Employees: తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై 5 శాతం ఐఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మధ్యంతర భృతి
Rudraతెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు (పీఎస్ యూ ఉద్యోగులకు) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా ఐఆర్ పెంచుతూ సర్కారు జీవో జారీ చేసింది.
Rashmika Mandanna Video On SHE Teams: నిన్న అల్లు అర్జున్, ఇవాళ రష్మిక మందనా, సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్న పుష్ప టీం, అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
VNSషీ టీమ్స్ పై అవగాహన కల్పిస్తూ చేసిన వీడియోను ఆమె పోస్ట్ చేశారు. బయటకు వెళ్లే అమ్మాయిలెవరూ భయపడొద్దని, ఒకవేళ అన్యాయం జరిగితే షీ టీమ్‌ని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘