తెలంగాణ

Telangana: రంగారెడ్డి జిల్లా ఆలయంలో చోరీ...ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలను చోరీ చేసిన దొంగలు...పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఆలయ పూజారి

Arun Charagonda

ఆలయంలో పంచ లోహ విగ్రహాలు మాయం అయ్యాయి. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వినాయకుడు, అయ్యప్పస్వామి పంచ లోహ విగ్రహాలను చోరీ చేసిన దొంగలు ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

Telangana: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కలిసిన అఘోరి, ఓ ప్రైవేట్ ఆస్పత్రి కార్యక్రమంలో ప్రత్యక్షం..వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కలిశారు అఘోరి. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరి...ఖమ్మం జిల్లా మధిరలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా అఘోరి ఆశీర్వాదం తీసుకున్నారు మల్లు నందిని.

Lagacharla Victims: లగచర్ల ఘటనపై ప్రజాసంఘాలు సీరియస్, జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

Arun Charagonda

లగచర్ల ఘటనపై ప్రజాసంఘాలు సీరియస్ అయ్యాయి. ఢిల్లీలో లగచర్ల బాధితులకు బాసటగా ప్రజాసంఘాల నేతలు నిలిచారు. జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి ప్రజా సంఘాలు.

Mid Manair Project: మిడ్‌ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

sajaya

రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మిడ్‌ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఈ మేరకు 4,696 ఇళ్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 గ్రామాలకు చెందిన నాలుగు వేలకు పైగా కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Hyderabad Shocker: అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కనే వదిలి వెళ్లిన షాకింగ్ ఘటన..సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

sajaya

ఆడపిల్ల ఇంటికి బరువైపోయింది. అప్పుడే పుట్టిన పసికందును కన్న పేగు నుంచి దూరం చేసి రోడ్డు పక్కన పారేసిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన చూసిన స్థానికులంతా మానవత్వం మంట కలిసిపోయిందని షాక్ తింటున్నారు.

Khammam Shocker: ఖమ్మంలో షాకింగ్ ఘటన...విద్యార్థికి గుండు చేయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం..

sajaya

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది కటింగ్ సరిగ్గా చేయించుకోలేదని ఓ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు చేయించిన ఘటన జిల్లాలో కలకలం లేపింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫస్టియర్ విద్యార్థికి గుండు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Telugu States Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీకి నేడు, రేపు వర్ష సూచన.. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే

Rudra

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

High Security To Prateek Jain: లగచర్ల ఘటన నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అదనపు భద్రత.. 2+2 గన్ మెన్ కేటాయింపు.. పరారీలో ప్రధాన నిందితుడు

Rudra

వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటన నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు భద్రత పెంచింది. ప్రతీక్ జైన్ కు 2+2 గన్ మెన్ ను ప్రభుత్వం కేటాయించింది.

Advertisement

TGPSC Group-3 Exams: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రూప్‌-3 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తెలిపింది.

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

Arun Charagonda

బఫర్ జోన్ లో ఇల్లు ఉందని సామాన్యుల ఇండ్లు కూలగొడతా అంటున్నావ్.. మరి పెద్ద కంపెనీలకు అదే భూమి ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టుకోమని అంటున్నావు ఇదెక్కడి న్యాయమో చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...ఇంట్లకెళ్ళి ఏమో మురికి నీళ్లు ఒస్తది… మాల్ లో కెళ్ళి ఏమన్నా సుగంధం వస్తదా? చెప్పాలన్నారు కేటీఆర్.

Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ భయం, రాంగ్‌ రూట్‌లో వెళ్లి ప్రాణాలు పొగోట్టుకున్న యువకుడు..శంషాబాద్‌లో విషాదం

Arun Charagonda

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌కు భయపడి రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. శంషాబాద్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో పోలీసులను చూసి భయపడి రాంగ్ రూట్‌లో వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకోగా అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. హయత్‌నగర్‌లో అమ్మాయికి బెదిరింపులు,బలవంతంగా అత్యాచారం చేశాడని బాధితురాలి ఆవేదన..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ - హయత్ నగర్లో యువతిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. చెరుకుపల్లి విజయ్ అనే వ్యక్తి తనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఫ్రెండుగా ఉంటు తరువాత తనను ప్రేమ పేరుతో వేదిస్తున్నాడని తెలిపింది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని.

Advertisement

Hyderabad: కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్, కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేలో వెల్లడి

Arun Charagonda

ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఫుడ్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది. దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.

Telangana: సంగారెడ్డి గురుకుల పాఠశాలలో దారుణం, ఉరేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Arun Charagonda

తెలంగాణలోని సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల 9వ తరగతి విద్యార్థిని స్వాతి ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. కాని అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Telangana Police: తెలంగాణ పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, TSSP స్థానంలో TGSPగా మార్చాలని ఆదేశాలు..

Arun Charagonda

తెలంగాణ పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. బ్యాడ్జిల్లో TSP స్థానంలో TGP, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, TSSP స్థానంలో TGSPని చేర్చారు. TSPS స్థానంలో TGPS ఉండే విధంగా బ్యాడ్జిలను మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Arun Charagonda

శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్తీక పూర్ణిమ శుభవేళ సతీసమేతంగా ఎన్ టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...ఒక్క దీపాన్ని వెలిగించినా, ఒక్క దీపాన్ని సంరక్షించినా అది మనకు ముక్తిని కలిగిస్తుంది అన్నారు. సమాజానికి మేలు జరుగుతుందని వేదపండితులు బోధిస్తున్నారు... అలాంటిది కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు.

Advertisement

Bomb Threat to Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడి హల్ చల్

Rudra

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు దగ్గరికి రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు హల్ చల్ సృష్టించాడు.

Hyderabad Fire Accident: హైదరాబాద్‌ లోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం.. అపార్ట్ మెంట్ లో మంటలు.. బయటకు పరుగులు తీసిన జనం (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఘోర ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్‌ మెంట్‌ లోని మూడో అంతస్తులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి.

Telugu CM's At Maharashtra Poll Campaign: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం

VNS

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు. దీంతో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

Ragging Incident: మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం..10 మంది సీనియర్ల సస్పెండ్, ర్యాగింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న డైరెక్టర్ రమేష్

Arun Charagonda

మ‌హబూబ్‌న‌గ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఈనెల 10న కొంద‌రు ఫ్రెష‌ర్స్‌ను ర్యాగింగ్ చేశౄరు సీనియ‌ర్లు. 13న వారికి కౌన్సిలింగ్ చేసిన డైరెక్ట‌ర్‌...బాధిత విద్యార్థుల ఫిర్యాదుతో 10 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ చేసినా, మిస్‌బిహేవ్ చేసినా త‌నకు నేరుగా ఫిర్యాదు చేయాల‌ని డైరెక్ట‌ర్ ర‌మేష్‌ తెలిపారు.

Advertisement
Advertisement