తెలంగాణ

Drunk And Drive Cases: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు, 27 మందికి పారిశుద్ధ్య పనులు చేయాలని ఆదేశం..

Arun Charagonda

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వాహన తనిఖీల్లో 27 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారంతా గురువారం నుంచి వారం రోజులపాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని మంచిర్యాల కోర్టు తీర్పునిచ్చింది. మంచిర్యాల కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Harish Rao: విద్యా హక్కు చట్టం దుర్వినియోగం, సమగ్ర కుటుంబ సర్వే నుండి టీచర్స్‌ను మినహాయించండి..సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు డిమాండ్

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ్టి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన “సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే” కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్య హక్కు చట్టం ఉల్లంఘననే. 36,559 ఎస్జీటీలను, 3414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేస్తూ 1.11.2024 నాడు విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధం. ఉదయం 9 గంటల నుండి మ. 1 గంటల వరకే (ఒంటి పూట) పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

Bhatti Vikramarka: పదేళ్లలో తెలంగాణను ధ్వంసం చేశారు, అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం..ప్రజలు స్వేచ్ఛగా బతకలేని స్థితికి తీసుకొచ్చారు, బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్

Arun Charagonda

పదేళ్లు పాలించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పి ఏం చేశారో మనకు తెలుసు అన్నారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు...రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను స్వేచ్చగా బతకలేని పరిస్థితిని తీసుకొచ్చారు అన్నారు.

Adilabad: తెలంగాణలో కులగణనను నిషేధించిన గ్రామస్థులు, ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం

Arun Charagonda

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కులగణన ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కులగణనను నిషేధించారు గ్రామస్థులు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

Advertisement

Telangana Caste Census: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం, హైదరాబాద్‌లో ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..ఎన్యుమరేటర్లకు సర్వే కిట్లు అందజేత

Arun Charagonda

తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం అయింది. ఆయా జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు మంత్రులు, ప్రజాప్రతినిధులు. హైదరాబాద్ లో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హాజరైన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్లు అందజేశారు మంత్రి పొన్నం.

KTR: గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు..ధాన్యం రాశుల వైపు చూడాలని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్, కాసుల కక్కుర్తి కాదు..రైతు బతుకు వైపు చూడాలని సవాల్

Arun Charagonda

గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ - గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్...గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు - కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు అన్నారు.

Nalgonda: కోదాడలో దారుణం, మహిళ గొంతు కోసిన ఆర్‌ఎంపీ డాక్టర్, అక్రమ సంబంధమే దాడికి కారణమని అనుమానం..బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం నయనగర్ లో రేణుక అనే మహిళ గొంతు కోశారు ఆర్‌ఎంపీ. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు మొదలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం బాధితురాలిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana: రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం, హైజీన్ కేర్‌ పరిశ్రమలో చెల‌రేగిన మంట‌లు..నేలమట్టం అయిన నూతనంగా నిర్మించిన షెడ్డూ

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజీన్ కేర్‌ పరిశ్రమలో అర్థరాత్రి మంట‌లు చెలరేగాయి. మంట‌లు చెల‌రేగ‌డంతో క్ష‌ణాల్లో నేల‌మ‌ట్టం అయింది నూతనంగా నిర్మించిన షెడ్డు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం తప్పింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమ‌ని అంచ‌నా వేస్తుండగా ఐదు ఫైర్ ఇంజ‌న్‌లతో మంట‌ల‌ను అదుపు చేసేందుకు శ్ర‌మిస్తోంది ఫైర్ సిబ్బంది.

Advertisement

Rahul Gandhi: దేశంలో ఇంకా కుల వివక్ష ఉంది, నిజం మాట్లాడితే దేశాన్ని విభజిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు...ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

Arun Charagonda

ఈ దేశంలో కులాలు ఉన్నాయి. అదేవిధంగా కుల వివక్షలు ఉన్నాయని కూడా అందరికీ తెలుసు అన్నారు కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తాను ఈ నిజాలు మాట్లాడితే దేశాన్ని విభజిస్తున్నానని పీఎం నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు అని మండిపడ్డారు.

Hyderabad Horror: మధురానగర్‌లో దారుణం, బట్టలు ఉతకాలంటూ మహిళను రూంకి తీసుకువెళ్లి కామాంధులు సామూహిక అత్యాచారం

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలోని మధురానగర్‌ పరిధిలో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు యువకులు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Bakka Judson on CM Revanth Reddy: నువ్వు సచ్చిపోతే నీ శవాన్ని కూడా కొడంగల్‌కు రానియ్యరు, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాల్లో ఎక్కడినుండి పోటీ చేసినా గెలవడు. ఛాలెంజ్ చేస్తున్నా సెక్యూరిటీ లేకుండా కొడంగల్ వచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డికి అంటూ సవాల్ విసిరారు.

Bikes Theft Caught on Camera: వీడియో ఇదిగో, స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి రెండు బైకులను ఎత్తుకెళ్లిన దొంగలు

Hazarath Reddy

గచ్చిబౌలిలో నడుచుకుంటూ వచ్చి రెండు బైకులు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్సీయూ బస్ డిపోకు ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ లో ఈరోజు తెల్లవారుజామున గుర్తుతెలియని ఇద్దరు దుండగులు హెల్మెట్లు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చారు.

Advertisement

Hyderabad: హెల్మెట్ ధరించకుండా రోడ్డు మీదకు బైకుతో వెళితే జేబులు గుల్లే, నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రాజధానిలో గత మూడు రోజుల్లో హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు రైడర్లు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ పి.విశ్వప్రసాద్‌ సోమవారం పేర్కొన్నారు.

Miscreants Vandalize Hanuman Temple in Hyderabad: హిందూ ఆలయాలపై కొనసాగుతున్న దాడులు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలోని నవగ్రహాల విగ్రహాల ధ్వంసం

Rudra

హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి దేవాలయంపై జరిగిన దాడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ ఘటనను మరిచిపోకముందే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

Devara On Netflix: జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవ్వనుందంటే?

Rudra

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. దసరా కానుకగా వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Nagula Chavithi 2024: నేడే నాగుల చవితి పండుగ. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ కార్డ్స్ తో మీ బంధు, మిత్రులకు విషెస్ తెలియజేయండి.

Rudra

దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభంలో జరుపుకునే పండుగ నాగుల చవితి ఒకటి. కార్తీక మాసంలో హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ నాగుల చవితి నేడే.

Advertisement

Auto Drivers Dharna: నేడు ఇందిరా పార్క్‌ లో ఆటో డ్రైవర్ల మహాధర్నా.. పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Rudra

మహాలక్షి పథకంలో భాగంగా తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు స్కీంతో తమకు గిరాకీలు రావట్లేదని, తమ కుటుంబాలు రోడ్డుమీదకు వచ్చాయని తెలంగాణలోని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Attack On Milk Boy: తన దగ్గర పనిచేసి స్వయంగా పాలు అమ్ముతున్నాడని బాలుడిపై వ్యక్తి దాడి.. మందమర్రిలో ఘటన (వీడియో వైరల్)

Rudra

మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామంలో పాల మాఫియా చెలరేగిపోతున్నది. శాంతినగర్ గ్యారెజ్ లైన్ కు చెందిన అభిలాష్ అనే బాలుడిపై పాల మల్లేశ్ దాడి చేశాడు.

RBI 2000 Notes: ఇంకా ప్రజల దగ్గరే రూ.6,970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా ప్రకటన

Rudra

ఏడాదిన్నర కిందట రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లు ఇంకా పెద్దయెత్తున జనబాహుళ్యంలో ఉన్నట్టు సమాచారం. రూ.6,970 కోట్ల విలువ కలిగిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఇంకా ఉన్నాయి.

Ex Minister Reddi Satyanarayana Passed Away: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత.. అనారోగ్య కారణలతో మృతి.. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా గుర్తింపు

Rudra

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) కన్నుమూశారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో ఆయన గత కొన్నిరోజులుగా బాధపడుతున్నారు.

Advertisement
Advertisement