తెలంగాణ

Telangana: తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. 20 రోజుల పాటు సర్వే చేపట్టనున్న అధికారులు...తప్పులు చెప్పిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్న అధికారులు

Arun Charagonda

తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్​ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. తప్పులు చెప్పినవారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు.

Cockroach Found in Dosa: దోశ తింటుండగా ప్రత్యక్షమైన బొద్దింక.. కంగుతిన్న కస్టమర్.. హైదరాబాద్ స్వాతి టిఫిన్స్‌ లో ఘటన

Rudra

హోటల్స్ లో సర్వ్ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా రెస్టారెంట్ల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. హైదరాబాద్ లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్‌ లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

CM Revanth Reddy: యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిందే, వర్సిటీల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని వీసీలను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి...తప్పు చేస్తే వీసీలపై చర్యలు తప్పవని హెచ్చరిక

Arun Charagonda

యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని వైస్ చాన్సలర్లకు సూచించారు.

Auto Rickshaw Risky Stunts: రెండు చక్రాలపై ఆటోను నడుపుతూ హైదరాబాద్ రోడ్లపై ఆటో వాలా ప్రమాదకర స్టంట్లు (వీడియో)

Rudra

హైదరాబాద్ రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్న యువత తమ ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అసౌకార్యాన్ని కలిగిస్తున్నారు.

Advertisement

AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు.. ఈ నెల 11 నుంచి సభ ప్రారంభం.. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు

Rudra

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. నవంబరు 11 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనుంది.

Fire Accident at Lord Balaji Temple: వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన స్వామి వారి పల్లకి, ఉత్సవ పీటలు.. పూర్తిగా కాలిపోయిన అద్దాల మండపం.. అరిష్టం అంటున్న వేద పండితులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఆలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Bomb Threat For Three Flights: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. ఆలస్యంగా విమానాలు

Rudra

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.

TGSRTC Special Buses: ప్ర‌యాణికుల‌కు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్, వాటిలో చార్జీల త‌గ్గింపు, కార్తీక మాసం సంద‌ర్భంగా ప్ర‌త్యేక స‌ర్వీసులు

VNS

కార్తీక మాసం శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్తీక మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ శైవక్షేత్రాలకు (Karthika Masam 2024) వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర కార్తీ మాసం సందర్భంగా టీజీఆర్టీసీ (TGSRTC) ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను (TGSRTC Special Buses) ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

Advertisement

Telangana: ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం, తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

చంద్రబాబు తర్వాత ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాపూ ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చనుంది ప్రభుత్వం. గాంధీ సరోవర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

Ponguleti Srinivas Reddy: డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు, సంక్రాంతిలోపు స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు.. సంక్రాంతి కల్లా ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాం అని తెలిపారు.

Telangana: తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు కింద పడి మహిళ మృతి, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Arun Charagonda

హైదరాబాద్ తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తార్నాక నుండి హబ్సిగూడ వెళ్లే దారిలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న మహిళను డీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి చెందగా బస్సు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Hyderabad: ఇకపై ఓఆర్ఆర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

Arun Charagonda

ఇకపై ORRపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించనున్నారు పోలీసులు. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఓఆర్ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్‌ల దగ్గర డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే యాక్సిడెంట్‌ అనాలసిస్‌ ప్రివెన్షన్‌ టీమ్‌ల ఏర్పాటు చేశారు.

Advertisement

Asaduddin Owaisi: బీఆర్ఎస్‌పై ఓవైసీ సంచలన కామెంట్..మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు..బీఆర్ఎస్ నేతల జాతకాలు మా దగ్గర ఉన్నాయన్న ఓవైసీ

Arun Charagonda

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్ చేశారు. బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి.. అవి చెబితే వాళ్లు తట్టుకోలేరు అన్నారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు అని తెలిపారు.

Bandi Sanjay: బండి సంజయ్ కీలక కామెంట్స్... ఎన్నికల వరకే రాజకీయాలు...కాంట్రాక్టర్లను బెదిరించడం సరికాదన్న కేంద్రమంత్రి

Arun Charagonda

కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. పేరు, ప్రఖ్యాతల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కమిషన్లు దండుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వంటి పనులు జరిగాయని అన్నారు.

Telangana: గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై 5గురు గ్యాంగ్ రేప్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కాగా పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. వికారాబాద్ - దోమ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి తల్లిదండ్రులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana Tourism: నాగార్జున సాగర్‌ నుండి శ్రీశైలంకు క్రూయిజ్ సేవలు, తెలంగాణ టూరిజం శాఖ వెబ్‌సైట్‌లో టికెట్ల బుకింగ్, ప్రయాణీకుల కోసం ప్రత్యేక ప్యాకేజీ

Arun Charagonda

సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి కృష్ణానదిలో లాంచీకి ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు శివకృష్ణ తెలిపారు. శనివారం సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లేందుకు 60 మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఉదయం 8:30 గంటలకు సోమశిల ఘాట్‌ నుంచి పర్యాటకులను ఎక్కించే బోటు సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటుందని తెలిపారు. లాంచీలో పర్యాటకులకు ఉదయం మరియు సాయంత్రం టీ, స్నాక్స్ మరియు లంచ్ అందిస్తారు.

Advertisement

Telangana: సూర్యాపేటలోని కోదాడలో రోడ్డు ప్రమాదం,ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..నలుగురు పరిస్థితి విషమం..వీడియో

Arun Charagonda

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో నేషనల్ హైవే 65పై, రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుండి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలుకాగా నలుగురు పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Road Accident in Kodada: కోదాడ వద్ద ప్రైవేటు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

Rudra

కోదాడ సమీపంలోని కట్టకొమ్ముగుడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ATM Thief: ఏటీఎం చోరీకి చోరుడి విఫలయత్నం.. అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్.. ఎట్టకేలకు దొరికిన దొంగ.. నిర్మల్ లో ఘటన

Rudra

నిర్మల్ పట్టణంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతతో ఏటీఎంలో చోరీకి యత్నించిన ఓ చోరుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడు. పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానిక కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించాడు.

Road Accident in Kagaznagar: కాగజ్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీ కొట్టిన గూడ్స్ వెహికల్.. యువకుడు మృతి (వీడియో)

Rudra

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోడ్డు మీద ప్రయాణించడమే మృత్యుకేళిగా మారుతున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

Advertisement
Advertisement