Bjp national president jp nadda (Photo-Video Grab)

Hyderabad, June 25: బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP National President) జేపీ నడ్డా (JP Nadda) నేడు తెలంగాణ పర్యటన(Telangana Visit)కు రానున్నారు. మహాజన సంపర్క్‌ అభియాన్ (Mahajana Sampark Abhiyan)లో భాగంగా నాగర్‌కర్నూల్‌లో ఆదివారం నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు నవ సంకల్ప సభగా నామకరణం చేశారు. కాగా, బీఆర్‌ఎస్ తో పోరుపై బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందంటూ ప్రచారం జరుగుతున్న వేళ నడ్డా రాష్ట్ర పర్యటనకు రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leopard Attack: చిరుతతో బామ్మ పోరాటం.. మనవరాండ్ల కోసం ప్రాణాలకు తెగించిన వీరత్వం.. ఉత్తరాఖండ్ లో ఘటన

పర్యటన డీటెయిల్స్ ఇవే..

  • ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నడ్డా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
  • సంపర్క్‌ సే సమర్థనలో భాగంగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనందశంకర్‌ జయంతితో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
  • మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను వివరించడంతోపాటు ప్రగతి పుస్తకాలను వారికి అందజేయనున్నారు.
  • అనంతరం, సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి నాగర్‌కర్నూల్‌ చేరుకుంటారు.

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో రాత్రి భారీ వర్షం... నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. రోడ్లపై నీరు నిలిచి ఇబ్బందిపడిన వాహనదారులు.. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం.. నేడు కూడా భారీ వర్షసూచన