Hyderabad, June 25: హైదరాబాద్ (Hyderabad) ను భారీ వర్షం (Heavy Rain) కుదిపేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం (Saturday) రాత్రి భారీ వర్షం (Rains) కురిసింది. జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, కొంపల్లి, దుండిగల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బాగ్ లింగంపల్లి, లోయర్ ట్యాంక్ బండ్, సరూర్ నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కోఠి, అబిడ్స్, బేగంబజార్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఓయూ, ఫలక్ నుమా, తార్నాక, లాలాపేట, రామంతాపూర్, ఉప్పల్, నిజాంపేట, ప్రగతి నగర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలాచోట్ల రహదారులపై నీరు నిలిచి, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
72.3 mm rainfall just in 2 hours..#HyderabadRains #hyderabad @HiHyderabad @balaji25_t @Hyderabadrains @serish pic.twitter.com/ud9rlo78m2
— ℙ𝕖𝕠𝕡𝕝𝕖 𝕠𝕗 ℍ𝕪𝕕𝕖𝕣𝕒𝕓𝕒𝕕 (@PeopleHyderabad) June 24, 2023
నేడు కూడా వర్షాలు
హైదరాబాద్‌కు మరో 24 గంటలపాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులుగా హైదరాబాద్ లో వర్షం పడుతుండడంతో ఎండ తీవ్రత, ఉక్కపోత నుండి నగర వాసులు ఉపశమనం పొందారు.