Bank Holidays in July (PIC@ File)

Mumbai, June 24: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జులై నెలకు సంబంధించి దేశంలో బ్యాంకుల సెలవుల తేదీలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా బ్యాంకులకు ఉండే సాధారణ సెలవులతో పాటు ఏయే రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో బ్యాంకులకు ప్రత్యేక సెలవులు ఉన్నాయో చూద్దాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న సెలవులతో కలిపి మొత్తం 15 సెలవులు ఉన్నాయి. జులై 2న ఆదివారం కావడంతో ఆ రోజు దేశంలోని అన్ని బ్యాంకుల సెలవు. జులై 5న గురు హర్‌ గోవింద్ సింగ్ జయంతి ఉంది. దీంతో జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జులై 6న మిజో మెయిచ్ఛె ఇన్సుయిహ్ఖామ్ పావ్ల్ డే కారణంగా మిజోరంలో బ్యాంకులకు సెలవు.

Bank Holidays in April 2023: ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, కస్టమర్‌లు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించిన ఆర్బీఐ 

జులై 8న రెండో శనివారం. జులై 9 ఆదివారం సెలవు. జులై 11న కెర్ పూజ కారణంగా త్రిపురలో సెలవు ఉంటుంది. జులై 13న భాను జయంతి కారణంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు. జులై 16న ఆదివారం సెలవు. జులై 17 న యూ తిరోట్ సింగ్ డే ఉండడంతో మేఘాలయాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Bank holidays in May 2022: బ్యాంక్ కస్టమర్లు అలర్ట్, మే నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్, పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకుని ముందే ప్రిపేర్ అవ్వండి 

జులై 22న నాలుగో శనివారం కారణంగా సెలవు. జులై 23న ఆదివారం. జులై 29న మొహర్రం కారణంగా సెలవు ఉంటుంది. జులై 30న ఆదివారం సెలవు. జులై 31న మార్టిర్డం డే కారణంగా హరియాణాతో పాటు పంజాబ్‌లో బ్యాంకులకు సెలవు.