Newdelhi, June 25: తన మనవరాండ్ల కోసం ఒక బామ్మ (Grand Mother) ఏకంగా చిరుతపులితోనే (Leopard) పోరాడి వారిని రక్షించుకుంది. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని తెహ్రీ జిల్లా అబకి గ్రామంలోని 58 ఏండ్ల చంద్రమ్మ దేవి (Chandramma Devi) నాలుగేండ్ల తన ఇద్దరు మనవరాండ్లతో ఇంటి వరండాలో ఉండగా, చిరుతపులి వారిపై దాడి చేసింది. అప్రమత్తమైన చంద్రమ్మ దేవి చిరుతకు ఎదురుగా నిలిచి పోరాడింది. చిరుత ఆమెపై దాడి చేసి లాక్కుపోవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ వెరువకుండా బామ్మ ఎదిరించింది.
Uttarakhand: Grandmother fights off leopard in Tehri, saves 4-year-old granddaughters https://t.co/3VNjQus2DX https://t.co/3VNjQus2DX
— Realtimeindia (@Realtime_india) June 24, 2023
కుటుంబ సభ్యులు రావడంతో..
బలాన్నంతా కూడదీసుకొని చిరుతతో పోరాడింది. అదే సమయానికి కుటుంబ సభ్యులు అక్కడికి రావడంతో భయపడి అక్కడి నుంచి చిరుత పారిపోయింది. ప్రాణాలకు తెగించి మనవరాండ్లను రక్షించిన చంద్రమ్మ దేవిని పలువురు అభినందించారు.