Half-day schools (PIC @ PTI)

Hyderabad, March 15: తెలంగాణలోని పాఠశాలలకు ఇవాల్టి నుంచి  ఒంటిపూట బడి (Half-day schools) విధానాన్ని అమలుచేస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్రమేపి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేంందుకు ఒంటిపూట బడులను (Half-day schools) ప్రారంభించాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 23 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులను (Summur Holidays) ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు.

అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ సూచించింది. అలాగే రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 12 వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మిగిలిన తరగతులకు ఏప్రిల్‌ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉండడంతో వారికి ఏప్రిల్‌ 17తో పరీక్షలు ముగియనున్నాయి.