Dedeepya Rao Attacked: బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ పై మహిళల దాడి, ఫ్లెక్సీ వివాదంలో దేదీప్యరావుపై దాడి చేసిన స్థానికులు, పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు

ఫ్లెక్సీల విషయంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌పై కొందరు మహిళలు దాడి చేశారు. ఆమె కారులో వెళ్తుండగా అడ్డుకున్న సదరు మహిళలు దేదీప్య రావుపై దాడికి దిగారు. దీంతో, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, తన భర్త విజయ ముదిరాజ్‌తో కలిసి దేదీప్య రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Dedeepya Rao Attacked: బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ పై మహిళల దాడి, ఫ్లెక్సీ వివాదంలో దేదీప్యరావుపై దాడి చేసిన స్థానికులు, పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు
Dedeepya Rao Attacked (PIC@ ANI X)

Hyderabad, March 13:   హైదరాబాద్ లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ పై (BRS Corporator Attacked) మహిళలు దాడి చేశారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ దేదీప్యరావుపై (Dedeepya Rao Attacked) కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై దేదీప్య రావు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఫ్లెక్సీల వివాదం కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఫ్లెక్సీల విషయంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌పై కొందరు మహిళలు దాడి చేశారు. ఆమె కారులో వెళ్తుండగా అడ్డుకున్న సదరు మహిళలు దేదీప్య రావుపై దాడికి దిగారు. దీంతో, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, తన భర్త విజయ ముదిరాజ్‌తో కలిసి దేదీప్య రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో మాగంటి గోపినాథ్‌ అరాచకాలు ఎక్కువయ్యాయంటూ స్థానిక మహిళలు ఆరోపలు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Mar 13, 2024 09:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).