Hyderabad, AUG 10: మొన్న కోకాపేట.. ఇప్పుడు బుద్వేల్.. కోట్లు.. కోట్లు.. కురిపించాయి. సిటీకి నలువైపులా రియల్ బూమ్ కనిపిస్తోంది. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ భూములకు రేట్లు పలుకుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి కాసుల పంట పండుతోంది. కోకాపేటలో 100 కోట్ల 75లక్షలకు అమ్ముడుపోవడంతో.. దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన భూమిగా నిలిచింది. HMDA చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే అది ఆల్‌టైమ్ రికార్డ్. ఇప్పుడు బుద్వేల్‌లోనూ ఇంచుమించు అంతే రేట్లు పలుకుతున్నాయి. కోకాపేట అంతకాకపోయినా బుద్వేల్ భూములు కూడా వేలకోట్ల వర్షం కురిపించాయి. ఎకరం భూమి కనీస ధర 20కోట్లుగా నిర్ణయిస్తే.. మొదటి సెషన్‌లో 40కోట్ల వరకు అమ్ముడుపోయాయ్. బుద్వేల్ భూ వేలంలో.. తొలి సెషన్ వేలంలో ప్లాట్ నెం.1, 2, 4, 5, 8, 9, 10లకు బిడ్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్‌లను సమర్పించారు. అయితే మొదటి సెషల్‌లో ప్లాట్ నెంబర్ 4కి అత్యధిక రేటు పలికింది. మొత్తంగా 100 ఎకరాల భూమిని 10 లేఅవుట్లుగా విభజించింది HMDA. ఈ వేలంలో అతి చిన్న లే అవుట్ 3.47 ఎకరాలు కాగా.. అతి పెద్ద లే అవుట్‌లో 14.3 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు రియల్టర్లు. బుద్వేల్ లేఅవుట్‌లో మొత్తం 14 ప్లాట్స్ ఉంటే, మార్నింగ్ సెషన్‌లో 7 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్-1లో 5.10 ఎకరాలకు వేలం జరిగితే… ఒక్కో ఎకరం 34.50కోట్లకు అమ్ముడుపోయింది. ప్లాట్ నెంబర్-2లో 8.15 ఎకరాలు ఉండగా… ఒక్కో ఎకరం 33.25కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్-4లో 14.33 ఎకరాలు ఉంటే… ఒక్కో ఎకరం 39.25కోట్లకు ఎగరేసుకొనిపోయాయి కంపెనీలు.
#Budvel auctions @HMDA_Gov e-auctioned 100 acres realising ₹3625crs at an average of ₹36.25 crs/acre
The highest rate was ₹ 41.25 crs / acre
We will have the state of art infrastructure with 36 & 45 Mtrs road & all other facilities
This is the NEW address@KTRBRS pic.twitter.com/rrDOlHfQTZ
— Arvind Kumar (@arvindkumar_ias) August 10, 2023
ఇక, ప్లాట్ నెంబర్-5లో 10.59 ఎకరాలు ఉండగా… ఒక్కో ఎకరం 33.25కోట్లకు అమ్ముడుపోయింది. ప్లాట్ నెంబర్-8లో 6.31 ఎకరాలు ఉంటే… ఎకరం ధర 35.50కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్-9లో 6.69 ఎకరాలు ఉండగా… ఇక్కడ ఎకరం ధర 33.75కోట్లకు వెళ్లింది. ఇక, మొదటి సెషన్‌లో చివరిగా ప్లాట్ నెంబర్-10లోని 6.94 ఎకరాలకు వేలంగా జరిగింది. ఇక్కడ ఎకర 35.50కోట్లు పలికింది. మార్నింగ్ సెషన్ మొత్తంలో ప్లాట్ నెంబర్-4కి అత్యధిక ధర వచ్చింది. ఎకరం కనీస ధర 20కోట్లు అయితే.. దాదాపు డబుల్ రేట్‌కి అమ్ముడుపోయింది. ఎకరం ధర సుమారు 40కోట్లు పలికింది.
సమీపంలో ORR, 15 నిమిషాల్లోనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రాయదుర్గం – శంషాబాద్ మెట్రో, ఆఫీస్ బిల్డింగ్స్‌కి అనువైన ప్రాంతం కావడంతో రియల్టర్లు పోటీ పడ్డారు. భూములకు రికార్డ్ స్థాయి అమ్మకాలు రావడంతో.. అదే జోష్‌తో ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. మరికొన్ని భూములే అమ్మకం ద్వారా ఖజానా నింపుకోవడానికి నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో లే అవుట్లు అమ్మకానికి పెట్టింది. రంగారెడ్డిలో 8 లే అవుట్లు, మేడ్చల్‌లో 8 లే అవుట్లు, సంగారెడ్డిలో 10 లే అవుట్లు అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్ అనుకుని ఉన్న ఈ మూడు జిల్లాల్లో చిన్న చిన్న బిట్లుగా ఉన్న ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా మరొక వెయ్యి కోట్ల వరకు వస్తాయనేది అంచనా.. అసలే ఎన్నికల కాలం.. మరోవైపు కేంద్ర నుంచి రావాల్సిన గ్రాంట్లు నిధులు ఖజానాకు చేరడం లేదు. దీంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అందించేందుకు సుమారు 25 వేల కోట్ల వరకూ అవసరం అవుతాయి. భూములు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ అవసరాలను తీర్చుకోవాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్.