Hyderabad, Aug 4: తెలుగు రాష్ట్రాల (Telugu States) రియల్ ఎస్టేట్ (Real Estate) చరిత్రలో ఇదో రికార్డ్ గా చెప్పొచ్చు. హైదరాబాద్ లోని (Hyderabad) కోకాపేటలో ఎకరా భూమి రూ.100 కోట్లకు పైగా పలికింది. ఇక్కడి నియోపోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6, 7 , 8 , 9లను హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ వేలంలో ప్లాట్ నెంబర్ 10లో ఎకరా భూమి ధర ఏకంగా రూ.100.25 కోట్లు పలికింది. ఈ భూమిని కొనుగోలు చేసింది సెల్వన్ కంపెనీగా తెలుస్తోంది. హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను నిర్ణయించింది. నియో పోలిస్ ఫేజ్ 2లోని  నాలుగు ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.1,532.20 కోట్ల ఆదాయం సమకూరింది. 45 ఎకరాలలో వున్న 7 ప్లాట్లకు ప్రభుత్వం రూ.2500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా.. ప్రస్తుత తీరు చూస్తే మరింత ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Budvel Land Sale Notification: కోకాపేట రికార్డు బుద్వేల్ బద్దలు కొడతుందా, ఎకరా కనీస ధర రూ. 20 కోట్లుగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ జారీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)