Hyderabad, DEC 09: తెలంగాణ అసెంబ్లీ (Telangana Legislative Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy), తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు.
#WATCH | Newly elected leaders take oath as members of the Telangana Legislative Assembly before Pro-term Speaker Akbaruddin Owaisi
BJP MLAs are boycotting oath-taking with Pro-term Speaker Akbaruddin Owaisi presiding over the proceedings pic.twitter.com/kXTCnfg6TC
— ANI (@ANI) December 9, 2023
ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని ఆయన కోరారు.
ఎనుముల రేవంత్ రెడ్డి అను నేను#TelanganaCM #RevanthReddy #Assembly #TelanganaAssembly #NTVNews #NTVTelugu pic.twitter.com/Jm9jMimzMc
— NTV Telugu (@NtvTeluguLive) December 9, 2023
మరోవైపు, శాసనసభ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) గైర్హాజరు అయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
#WATCH | Telangana BJP chief G Kishan Reddy says, "BJP is against the appointment of Akbaruddin Owaisi as Pro-tem Speaker (of Telangana Assembly). This is against the tradition of appointing senior MLAs to the post. BJP MLAs will boycott taking oath before this Pro-tem Speaker.… pic.twitter.com/QSbLWmE6Nf
— ANI (@ANI) December 9, 2023
ప్రొటెం స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణం చేయరని తేల్చిచెప్పారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు.