Hyderabad, Dec 07: రాష్ట్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో (LB Stadium) నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వారితో ప్రమాణం చేయించనున్నారు. కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిసి సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నట్టు 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం దృష్ట్యా.. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీసు (ట్రాఫిక్) కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు.
Commuters are urged to note the #TrafficAdvisory in view of #SwearinginCeremony of Sri Anumula Revanth Reddy as Chief Minister of #TelanganaState at #LBStadium on 07.12.2023 b/w 1000 hrs to 1700 hrs.#TrafficAlert #TrafficRestrictions #TrafficDiversions @AddlCPTrfHyd pic.twitter.com/kLzD4uXFNj
— Hyderabad Traffic Police (@HYDTP) December 6, 2023
ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ (పబ్లిక్ గార్డెన్) నుంచి వచ్చే ట్రాఫిక్ బషీర్‌బాగ్ బాబు జగ్జీవన్‌రాం(బీజేఆర్) విగ్రహం కూడలి వైపు అనుమతించరు. ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద నాంపల్లి, చాపెల్ రోడ్డు వైపు పంపిస్తారు.
గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ నుంచి బీజేఆర్ కూడలి వైపు ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
#WATCH | Congress leader Revanth Reddy set to take oath as Telangana CM in Hyderabad today pic.twitter.com/yihRflnk8v
— ANI (@ANI) December 7, 2023
బషీర్‌బాగ్ కూడలి నుంచి బీజేఆర్ కూడలి వైపు వచ్చే ట్రాఫిక్‌కు నో ఎంట్రీ. బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ కూడలి నుంచి కింగ్‌కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రహదారులపై పంపిస్తారు.
సుజాత పబ్లిక్ స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వైపు వచ్చే ట్రాఫిక్‌ను స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్ వైపు పంపిస్తారు.
ముఖ్యంగా పంజాగుట్ట, వి.వి.విగ్రహం కూడలి, రాజీవ్‌గాంధీ విగ్రహం, నిరంకారి, పాత సైఫాబాద్ ఠాణా, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ట్రాఫిక్ పోలీసు కాంప్లెక్స్, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం కూడలి, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, ఏఆర్ పెట్రోల్ బంక్, లిబర్టీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్‌గూడ కూడళ్ల వైపు వెళ్లకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
రవీంద్రభారతి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎల్బీ స్టేడియం ప్రధాన గేటు (ఖాన్ లతీఫ్ ఖాన్ భనం ముందు) ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద డైవర్షన్ తీసుకోవాలి. నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వెళ్లాలి.