Hail Rain (Photo-Video Grab)

తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురిసింది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. మ‌ర్ప‌ల్లి మండ‌ల కేంద్రంలో వ‌డ‌గండ్ల వాన ప‌డింది. వికారాబాద్, ప‌రిగి, పూడూరు మండ‌లాల్లో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. గ‌త వారం ప‌ది రోజుల నుంచి ఎండ‌లు మండిపోతున్న క్ర‌మంలో ఇవాళ వ‌ర్షాలు కురియ‌డంతో ప్ర‌జ‌లు ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం పొందారు.

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, రానున్న 5 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాలు, వికారాబాద్‌ను ముంచెత్తిన వడగండ్ల వాన

రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మెస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ముసురుపట్టి ఉరుములు ఉరిమాయి. అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడ్డాయి. నగరాన్ని పూర్తిగా చీకటి కమ్మేసినట్లుగా మేఘాలు ఆవరించాయి.

Here's Videos

హైదరాబాద్‌లో గురువారం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని నాగోల్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇక, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లా జిల్లాలో వడగండ్ల వర్షం పడుతోంది. పశ్చిమ బెంగాల్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా అల్పపీడన ద్రోణి కారణంగా గంటకు 40 కిలోమీటర్ల బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో, వాతావరణ శాఖ నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Here's Hail Rain Videos

రానున్న 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు.ఈ కారణంగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.