Technology
Goldman Sachs Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 1300 మంది ఉద్యోగులను తీసేస్తున్న అంతర్జాతీయ బ్యాంకు గోల్డ్‌మాన్ శాక్స్
Vikas Mఅంతర్జాతీయ బ్యాంకు గోల్డ్‌మాన్ శాక్స్ తన కంపెనీ తన వార్షిక సమీక్ష ప్రక్రియలో భాగంగా 1300-1800 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 3-4 శాతానికి సమానం. బ్యాంకులోని వివిధ విభాగాలపై లేఆఫ్‌ల ప్రభావం పడొచ్చని అంచనా.
Dunzo Layoffs: ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Vikas Mరిలయన్స్ రిటైల్ మద్దతు గల ఆన్‌లైన్ డెలివరీ సంస్థ అయిన డంజో తన కొత్త రౌండ్ లేఆఫ్‌లలో 150 మందిని తొలగించింది. Dunzo తొలగింపులు ఆర్థిక కష్టాల మధ్య మొత్తం శ్రామిక శక్తిని 50కి తగ్గించాయి. బెంగళూరుకు చెందిన డెలివరీ కంపెనీ శుక్రవారం తన ఉద్యోగులకు ఇమెయిల్‌లు పంపింది.
New Credit Card Rules: క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే సెప్టెంబర్ 1 నుంచి అమలయ్యే ఈ కొత్త రూల్స్ తెలుసుకోకపోతే నష్టపోతారు
VNSసెప్టెంబర్ 1నుంచి వివిధ బ్యాంకులు కొన్ని గణనీయమైన అడ్జెస్ట్మెంట్స్ చేయనున్నాయి. ఈ ప్రభావం క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లు (Credit Card New Rules), చెల్లింపు గడువులు, మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance) వంటి వాటిని ప్రభావితం చేస్తాయి
Viacom18 And Star India Merger Deal: దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్, వయాకాం-వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా విలీనానికి NCLT ఆమోదం
VNSరెండు సంస్థల విలీనంతో ఏర్పాటయ్యే సంస్థ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కానున్నది. ‘కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెస్ట్రన్ రీజియన్ రీజనల్ డైరెక్టర్‌తోపాటు అన్ని పక్షాల న్యాయవాదులు, ప్రతినిధుల సమక్షంలో వయాకాం-స్టార్ ఇండియా (Star India) విలీనంపై అభ్యంతరాలు వెల్లడి కాలేదు.
SpiceJet Financial Crisis: ఆర్థిక సంక్షోభంలో స్పైస్ జెట్, 150 మంది క్రూ సిబ్బందికి మూడు నెలల పాటు వేతనం లేని సెలవులు మంజూరు
Vikas Mదేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ (Spice Jet) ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో మూడు నెలల పాటు 150 మంది క్రూ సిబ్బందికి వేతనం లేని సెలవులు మంజూరు చేసింది. సెలవు ప్రకటించిన క్రూ సిబ్బంది స్పైస్ జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, వారి హెల్త్ బెనిఫిట్లు, ఎర్న్డ్ లీవ్స్ యధాతథంగా కొనసాగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది.
New Rules From September: ఆధార్ ఉచిత అప్‌డేట్ నుండి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ వరకు, సెప్టెంబరులో రానున్న అయిదు కీలక మార్పులివే..
Vikas Mసెప్టెంబర్ సమీపిస్తున్న కొద్దీ, వ్యక్తిగత ఫైనాన్స్‌లో అనేక ముఖ్యమైన మార్పులు హోరిజోన్‌లో ఉన్నాయి. ఎల్‌పిజి సిలిండర్ ధరలలో సర్దుబాట్లు, కొత్త క్రెడిట్ కార్డ్ నిబంధనల నుండి ఆధార్ కార్డ్‌లకు సంబంధించిన అప్‌డేట్‌ల వరకు, సమర్థవంతమైన మీ నెలవారి బడ్జెట్ నిర్వహణ కోసం ఈ మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం
Reliance AGM 2024: జియో యూజర్లకు 100 జీబీ ఉచిత స్టోరేజీ, కీలక ప్రకటన చేసిన ముఖేష్ అంబానీ, తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులు అందిస్తామని వెల్లడి
Hazarath Reddyరిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మెన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani ) రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్‌ను ఆయన వెల్లడించారు. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు.
Gautam Adani Richest Indian: హిండెన్ బర్గ్ వివాదం వెంటాడినా తగ్గేదేలే, దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన గౌతమ్ అదానీ, రెండో స్థానానికి పడిపోయిన ముకేష్ అంబానీ,
Hazarath Reddyబిలియనీర్ గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ వివాదం వెంటాడినా తగ్గేదేలే అని నిరూపించారు అదానీ. తాజాగా వెలువడిన 2024 హురున్ ఇండియా ధనవంతుల జాబితాలో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు
X Down Globally: ట్విట్టర్ డౌన్, సామాజిక మాధ్యమం ఎక్స్ లో సాంకేతిక సమస్య, డౌన్ డిటెక్టర్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
VNSప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (X) యూజర్లకు చుక్కలు చూపిస్తోంది. చాలా మంది యూజర్లకు న్యూస్ ఫీడ్ కనిపించడం లేదు. దీంతో ఎక్స్ డౌన్ (X Down) అయిందంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
Wynk Music App: సంగీత ప్రియులకు షాకివ్వబోతున్న ఎయిర్‌టెల్, వింక్ మ్యూజిక్ సేవలకు గుడ్ బై.. ఇకపై యాపిల్ మ్యూజిక్ ద్వారా సంగీతం వినే అవకాశం
Vikas Mప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న వింక్ మ్యూజిక్ (Wynk) సేవల్ని త్వరలోనే నిలిపి వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాపిల్‌తో కొత్తగా కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
YouTube Premium Price Hike in India: రూ.129 నుంచి రూ. 149 కి యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ ధర పెంపు, అన్ని రకాల ధరలను సవరించిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం
Vikas Mప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం యూట్యూబ్ (YouTube) భారత్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరల్ని పెంచింది. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలంటే యూజర్లు డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఫ్యామిలీ, స్టూడెంట్, వ్యక్తిగత ప్లాన్ అన్నింటి ధరల్ని సవరించింది. కొత్త ధరలు కంపెనీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
Apple Jobs in India: ఆపిల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు, వచ్చే ఏడాది నాటికి ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లుగా వార్తలు
Vikas Mగ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే ఏడాది నాటికి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 మార్చి నాటికి ఏకంగా ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనుందని భావిస్తున్నారు.
Infosys CEO Salil Parekh: ఏఐతో ఉద్యోగాలు పోవు, గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, ఏఐ సాంకేతికతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వెల్లడి
Arun Charagondaఐఏ కారణంగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల తొలగింపు ఉండదని తెలిపారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సలీల్..తమ సంస్థలో కొత్త టెక్నాలజీ కారణంగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోవని స్పష్టం చేశారు.ఒకప్పుడు డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు ఆధరణ లభించినట్లుగానే ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఆదరణ వస్తోందన్నారు.
Tata Group to Hire 4,000 Women: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్, 4,000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకోనున్న టాటా గ్రూపు
Hazarath Reddyటాటా గ్రూప్ తమిళనాడు మరియు కర్నాటకలో విడిభాగాల తయారీ మరియు అసెంబ్లీ సౌకర్యాల కోసం ఉత్తరాఖండ్ నుండి 4,000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకోనుంది
Fact Check: ప్రతి పేద కుటుంబానికీ కేంద్రం రూ.46,715 ఆర్థికసాయం, ఈ లింక్ క్లిక్ చేశారో మీ ఫోన్ హ్యాకయినట్లే, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Hazarath Reddyదేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ అంటూ వాట్సాప్‌లో ఓ మెసేజ్ విస్తృతంగా వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చింది.
ISRO Chief on Aliens: ఏలియన్స్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు, వాటి పరిచయం చాలా ప్రమాదకరం అంటూ...
Vikas Mయూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియాతో ఇటీవలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, ఇస్రో ఛైర్మన్ డా. ఎస్. సోమనాథ్ గ్రహాంతరవాసుల ఉనికి, UFO వీక్షణల స్వభావంపై ఆసక్తికరమైన ఆలోచనలను పంచుకున్నారు. టీఆర్‌ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న ఈ చర్చలో గ్రహాంతర జీవితం, బ్లాక్ హోల్స్ సహా వివిధ అంశాలను కవర్ చేశారు.
Telegram CEO Pavel Durov’s Arrest: టెలిగ్రాంలో పిల్లల సెక్స్ వీడియోలు, ప్రాన్స్‌లో సీఈఓ పావెల్ దురోవ్ అరెస్ట్, అక్కడ నిషేధం విధిస్తారా..
Vikas Mటెలిగ్రామ్‌ను ప్రాన్స్ నిషేధిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సంస్థ సీఈఓ పావెల్ దురోవ్(39)ను పారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో ఇటీవల అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ సమాచారం నియంత్రణకు ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.
IBM Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ఐబిఎం, ఏ దేశంలో ఉద్యోగులు ప్రభావితమవుతారంటే..
Vikas Mబీజింగ్, ఆగస్టు 26: చైనాలో ఐటి హార్డ్‌వేర్‌కు డిమాండ్ మందగించడంతో పాటు చైనాలో వృద్ధి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐబిఎం చైనాలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని, దేశంలో దాదాపు 1,000 మందిని తొలగించాలని యోచిస్తోంది.
Dutch Watchdog Fines Uber: ఉబర్‌కు భారీ షాకిచ్చిన నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం, పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులో 32.4 కోట్ల డాలర్ల జరిమానా
Vikas Mఉబర్(Uber ) సంస్థకు నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం (Dutch watchdog) భారీ జరిమానా విధించింది . ఉబర్ రెయిడ్ సర్వీస్ సంస్థకు 32.4 కోట్ల డాలర్ల జరిమానా వేశారు. యురోపియన్ డ్రైవర్ల పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులో హేగ్‌లోని డేటా ప్రొటెక్షన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.
SEBI Bans Anil Ambani From Market: నిధుల మళ్లింపు ఆరోపణలు, అనిల్ అంబానీపై సెబీ ఐదేళ్ల నిషేధం, రూ.25 కోట్ల జరిమానా
Vikas Mప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్’ (RHFL)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.