Technology

Chandrayaan-3 Mission: జయహో భారత్, చంద్రునిపై విక్రమ్ అడుగు పెట్టేది ఆ రోజు తెల్లవారుజామునే, అద్భుత ఘట్టం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రపంచం

Hazarath Reddy

జాబిల్లి (Moon)పై అడుగుపెట్టడమే లక్ష్యంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రోపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయినట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది.

Chandrayaan-3 Update: ఇక చంద్రుని మీద దిగడమే తరువాయి, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌, ప్రకటించిన ఇస్రో

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ మాడ్యూల్ ఈరోజు ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విజయవంతంగా వేరు చేయబడిందని తెలిపింది. చంద్రయాన్-3 యొక్క చంద్రుని-బౌండ్ విన్యాసాలను ఇస్రో పూర్తి చేసిన తర్వాత రోజు ఈ పని కూడా సక్సెస్ అయినట్లు ప్రకటించింది.

New York City Bans Tiktok: టిక్‌టాక్‌పై అగ్రరాజ్యంలో ఆంక్షలు, మా డేటాను చైనాతో పంచుకోలేమంటూ న్యూయార్క్‌ ప్రభుత్వం వెల్లడి, వినియోగదారుల గోప్యను రక్షించేందుకు చర్యలని ప్రకటన

VNS

న్యూయార్క్ సిటీలో వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ను నిషేధించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్‌టాక్‌ను (Tiktok) నిషేధించారు. చైనీస్ టెక్ దిగ్గజం బైట్‌డాన్స్ యాజమాన్యంలో ఉన్న టిక్‌టాక్ ను 150 మిలియన్లకు పైగా అమెరికన్లు ఉపయోగిస్తున్నారు.

Chandrayaan 3 Mission Update: చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలు, ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చందమామపై దిగే అవకాశం

Hazarath Reddy

ఇస్రో చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ సక్సెస్ తో లక్ష్యానికి దగ్గరైంది. చంద్రుడి ఆవరణంలో చివరిది, ఐదవది అయిన కక్ష్య తగ్గింపు ప్రక్రియను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు.

Advertisement

'Made in India' AirPods: హైదరాబాద్ యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ, ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఉత్పత్తి

Hazarath Reddy

హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఫాక్సాకాన్ కంపెనీ ప్లాంట్లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఐఫోన్ ఎయిర్ పాడ్స్ తయారీ చేయనుంది. డిసెంబరు 2024 నుంచి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

24 Lakh Twitter Handles Blocked: గత రెండు నెలల్లో పెద్ద ఎత్తున ట్విట్టర్ ఖాతాలు బ్లాక్‌, ఏకంగా 25 లక్షలకు పైగా అకౌంట్లు బ్లాక్ చేసిన ఎక్స్‌

VNS

నిబంధనలను ఉల్లంఘించిన వినియోగదారులపై ఎక్స్ (Twitter) కఠిన చర్యలు తీసుకుంటోంది. గత జూన్‌, జూలై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 మంది ఖాతాలను బ్లాక్‌ చేసినట్లు తాజాగా వెల్లడించింది. బ్లాక్‌ చేసిన వాటిలో చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించినవి, అశ్లీలతను ప్రోత్సహించే ఖాతాలే ఎక్కువగా ఉన్నాయి.

Center Alert for Google Chrome Users: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక, వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని లేకుంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని అలర్ట్

Hazarath Reddy

మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తున్న ఏజెన్సీ అయిన భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఇటీవల Google Chrome వినియోగదారులకు హెచ్చరికను జారీ చేసింది. గూగుల్‌ క్రోమ్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం యూజర్లను హెచ్చరించింది

Luna-25 Mission Launched: చంద్రయాన్‌-3కి పోటీగా రష్యా ప్రయోగం, భారత్ కంటే ముందుగానే చంద్రుడి దక్షిణదృవానికి చేరుకోనున్న రష్యా లునార్

VNS

రాజధాని మాస్కోకు తూర్పున 5500 కిలో మీటర్ల దూరంలో ఉన్న అముర్ ఒబ్లాస్ట్‌లోని వోస్టోనీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా 25ను ప్రయోగించారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కంటే ఆలస్యంగా దీన్ని ప్రయోగించినప్పటికీ.. చంద్రయాన్ (Chandrayaan) కంటే ముందే చంద్రుడిపై అడుగు పెట్టనుందని చెబుతున్నారు.

Advertisement

Wipro Walk In Interview: విప్రో వాకిన్ ఇంటర్వూలకు పోటెత్తిన నిరుద్యోగులు, ఇంటర్వూ సెంటర్ ముందు బారులుతీరిన 10వేల మంది, కిటకిటలాడిన కోల్‌కతా విప్రో క్యాంపస్‌

VNS

ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత.. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ద్రవ్యోల్బణం ప్రభావంతో పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పుతో దాదాపు ఏడాది కాలంగా ఐటీ సంస్థలు మొదలు అన్ని కార్పొరేట్ సంస్థలు భారీగా లే-ఆఫ్స్ (Lay offs) ప్రకటించాయి.

Jio Independence Offer: ఇండిపెండెన్స్ డే సందర్భంగా జియో యూజర్లకు బంపరాఫర్, కొత్త ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడితో లభించే బెనిఫిట్లు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో తన యూజర్లకు సరికొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.2,999 చెల్లిస్తే రోజువారీగా 2.5 జీబీ డేటాతోపాటు అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్లు పొందొచ్చు.

SBI Card Enables RuPay Credit Cards On UPI: రూపే క్రెడిట్ కార్డు ఉన్నవారు నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు, యూపీఐతో ఎస్బీఐ క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయడం ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

ప్రభుత్వ రంగ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అనుబంధ ఎస్బీఐ కార్డ్స్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డులను రూపే ప్లాట్‌ఫామ్ మీద యూపీఐతో అనుసంధానిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

UPI Lite: యూపీఐ లైట్‌ లిమిట్‌ రూ. 500 పెంపు, పాస్‌వర్డ్‌ అవసరం లేకుంగా మీరు ఇకపై 500 వరకు పేమెంట్ చేసుకోవచ్చు

Hazarath Reddy

డిజిటల్‌ పేమెంట్స్‌కు సంబంధించిన యూపీఐ లైట్‌లో (UPI lite) పేమెంట్‌ కోసం ఉన్న పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సంద్భంగా ఈ విషయాన్ని తెలిపారు.

Advertisement

Chandrayaan 3: భూమి, చంద్రుని ఫోటోలను తీసిన చంద్రయాన్ 3, ఆగస్టు 23న చంద్రునిపై అడుగుపెట్టనున్న భారతదేశం మూడవ చంద్రయాన్ మిషన్

Hazarath Reddy

చంద్రయాన్-3, భారతదేశం మూడవ చంద్ర మిషన్. తాజాగా భూమి, చంద్రుని యొక్క ఆకర్షణీయమైన చిత్రాలను ఆవిష్కరించింది, ఇది ప్రయోగ రోజున లాండర్ ఇమేజర్ (LI) కెమెరా చంద్ర కక్ష్యలోకి పంపిన ఒక రోజు తర్వాత లియాండర్ క్షితిజసమాంతర వెలాసిటీ కెమెరా (LHVC) ద్వారా ఈ ఫోటోలను తీసింది.

Dell Layoffs: డెల్ కంపెనీలో లేఆప్స్, సేల్స్ టీంను ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం

Hazarath Reddy

డెల్ కంపెనీ ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు రెడీ అయింది. సేల్స్ టీం ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు సంసిద్ధమైంది. లేఆఫ్స్‌ను డెల్ ప్ర‌తినిధి నిర్ధారిస్తూ బాధిత ఉద్యోగుల‌కు సాయం అందించేందుకు కంపెనీ క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని తెలిపారు.

Wilko: భారీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రముఖ రీటైలర్‌ సంస్థ విల్కో, ఆందోళనలో 12 వేల మంది ఉద్యోగులు

Hazarath Reddy

బ్రిటన్ లోని ప్రముఖ రీటైలర్‌ సంస్థ విల్కో భారీ న‌ష్టాల్లో కూరుకుపోయింది. కార్యకలాపాలకు నిధుల లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో అందులో ప‌నిచేస్తున్న 12 వేల మంది ఉద్యోగాలు ప్ర‌మాదం పడ్డాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, విల్కో యూకే దాదాపు 400 స్టోర్లతో పాటు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

Chandrayaan-3: జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్-3.. మరోసారి కక్ష్య కుదింపు.. చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటో ఇదిగో..

Rudra

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తన లక్ష్యానికి మరింత చేరువైంది. ఆదివారం రాత్రి ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌక‌లోని ఇంజిన్‌ను మండించి కక్ష్యను కుదించారు. దీంతో, చంద్రయాన్-3 చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటోను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఆ ఫోటో ఇదిగో..

Advertisement

Chandrayaan 3 Mission Update: కీలకమైలురాయి దాటిన చంద్రయాన్-3, భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన చంద్రయాన్-3, ఆగస్ట్ 24 న ల్యాండింగ్ అయ్యే అవకాశం

VNS

ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లో జాబిల్లివైపు దూసుకెళ్లిన ఈ వ్యౌమనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. ఈ మేరకు ‘చంద్రయాన్‌-3’ని చందమామ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ (Lunar Orbit Insertion)ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది.

Laptop Imports Ban: కేంద్రం నిర్ణయంతో బడా టెక్‌ కంపెనీలకు షాక్, నిలిచిపోనున్న ఆపిల్, శాంసంగ్, హెచ్‌పీ ల్యాప్‌టాప్స్‌ దిగుమతులు, భారీగా ధరలు పెరిగే అవకాశం, భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

VNS

దేశీయంగా లాప్‌టాప్ లు (Laptop), టాబ్లెట్లు (Tabs), పర్సనల్ కంప్యూటర్ల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం తలపెట్టింది. ఇప్పటికే ‘మేడ్ ఇన్ ఇండియా’ పాలసీ అమలు చేస్తోంది. అయినా, గ్యాడ్జెట్ల (Gadgets) తయారీ కోసం దిగుమతులపైనే టెక్ పరిశ్రమ ఆధార పడటంతో కేంద్రం తాజాగా విదేశాల నుంచి లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై (Laptop Imports) నిషేధం అమల్లోకి తెచ్చింది.

Whatsapp Email Verification: వాట్సాప్‌ హ్యకింగ్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్త ఫీచర్‌ తీసుకువస్తున్న సంస్థ, అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఈ మెయిల్‌ అడ్రస్ ఉపయోగించేలా ప్లాన్ చేస్తున్న వాట్సాప్‌

VNS

కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది. (Wabetainfo) నివేదికల ప్రకారం.. వాట్సాప్ ఈ ఇమెయిల్ వెరిఫికేసన్ ఫీచర్ అందించనుంది. ఈ ఫీచర్ ఆన్ చేసినట్లయితే.. మీ అకౌంట్ ప్రొటెక్ట్ చేయడానికి వెరిఫై చేయడానికి వాట్సాప్ ఇమెయిల్ అడ్రస్ వినియోగించాల్సి ఉంటుంది.

Samudrayaan Mission: సముద్ర గర్భంలో దాగున్న రహస్యాలను వెలికి తీసేందుకు రెడీ అయిన భారత్, ముగ్గురు మనుషులు 6,000 మీటర్ల లోతుకు వెళ్లేలా సముద్రయాన్ ప్రాజెక్టుకు ప్లాన్

Hazarath Reddy

సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న వనరులను గుర్తించేందుకు భారత్ సముద్రయాన్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. సుముద్రంలో 6,000 మీటర్ల లోతు వరకు వెళ్లి వచ్చేలా సబ్ మెర్సిబుల్ వాహనాన్ని సిద్ధం చేస్తోంది.

Advertisement
Advertisement