Technology
RRR: రూ.1కే RRR మూవీ టికెట్, సంచలన ఆఫర్ ప్రకటించిన పేటీఎమ్, పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్
Hazarath Reddyపేటీఎమ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రూ.1కే ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు అని పేటీఎమ్ తన ట్విటర్ వేదికగా తెలిపింది. ఇందుకోసం ప్రేక్షకులు, అభిమానులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ పొందవచ్చు.
Google's Android App: గూగుల్ యూజర్లకు బంఫర్ న్యూస్, చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి
Hazarath Reddyయూజర్ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ కొత్తగా ఒక గోప్యత ఫీచర్ ను చేర్చింది. యూజర్లు గూగుల్ యాప్ ( Google's Android App)పై చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చు.
Netflix: నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాక్, యూజర్లు అకౌంట్‌ డీటెయిల్స్‌ ఎవరికైనా ఫార‍్వడ్‌ చేస్తే అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే
Hazarath Reddyప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రీమియం యూజర్లు అకౌంట్‌ డీటెయిల్స్‌ వారి కుటుంబ సభ్యులకు,లేదంటే స్నేహితులకు ఫార‍్వడ్‌ చేస్తే (Sharing your Netflix password ) అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి (charge you extra for sharing your password) ఉంటుందని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.
Elon Musk: అమ్మాయిగా పేరు మార్చుకున్న ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్‌లో ఎలోనా మస్క్ పేరుతో ట్వీట్లు సంధిస్తున్న టెస్లా అధినేత, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో నేరుగా పుతిన్‌తోనే ఢీకొట్టిన ఎలోన్ మస్క్
Hazarath Reddyఈ యుద్ధంపై ఫేస్‌ టూ ఫేస్‌ తేల్చుకుందాం రమ్మంటూ ఎలోన్ మస్క్ (Elon Musk) వేసిన ట్వీట్‌.. చాప కింద నీరులా రష్యాలో కాక రేపుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా స్పందించకపోయినా అతని కింద పని చేస్తున్న అధికారులు ఈ ట్వీట్ మీద మండి పడుతున్నారు. మా బాస్‌కే ఛాంలెజ్‌ విసురుతావా అంటూ ఎటాక్‌ స్టార్‌చేశారు.
Jet Fuel Prices Hiked: చమురు సంస్థల షాక్, భారీగా పెరిగిన జెట్‌ ఇంధనం ధరలు, సామాన్యులకు విమాన ప్రయాణం ఇక భారమే
Hazarath Reddyకరోనావైరస్ రాకతో ఏవియేషన్ రంగం పూర్తిగా కుదేలైన సంగతి విదితమే. కోవిడ్ లాక్ డౌన్ లో భాగంగా పలుదేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్జాలు విధించడంతో విమానయాన రంగం భారీగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గడంతో విమానయాన రంగం వేగం పుంజుకుంది.
Dirty Pipe Bug: ఆండ్రాయిడ్‌ యూజర్లు అలర్ట్‌ అవ్వండి, స్మార్ట్‌ఫోన్స్‌పై దాడి చేస్తున్న డర్టీ పైప్ అనే బగ్‌
Hazarath Reddyఆండ్రాయిడ్‌ యూజర్లు అలర్ట్‌ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. కొత్తగా వెలుగులోకి వచ్చిన బగ్‌తో పలు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ పెను ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదం ఎక్కువగా ఆండ్రాయిడ్‌ 12తో నడుస్తోన్న స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండనుంది.
123PAY: ఇంటర్నెట్ లేకుండా డబ్బులు పంపవచ్చు, ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఆర్‌బీఐ నుంచి 123పే, యూపీఐ 123 పే ఎలా వాడాలో గైడ్ మీ కోసం
Hazarath Reddyకేవలం మూడంచెల్లో నెట్ అవసరం లేకుండానే 123పే (123PAY Use) ద్వారా ఫీచర్ ఫోన్ యూజర్లు బ్యాంకు లావాదేవీలను జరిపేందుకు వీలుంటుంది. ఫీచర్ ఫోన్లతో నాలుగు రకాలుగా ఈ ట్రాన్సాక్షన్లను చేయవచ్చు. ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్), యాప్, ఫీచర్ఫోన్స్, ప్రాక్సిమిటీ సౌండ్ ఆధారంగా లావాదేవీలను జరపవచ్చు.
BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా ప్లాన్, రూ.329కే 20 ఎంబీపీస్ స్పీడ్‌తో 1000జీబీ డేటా
Hazarath Reddyప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తన ఫైబర్ వినియోగదారుల కోసం అదిరిపోయే ప్లాన్ ప్రకటించింది. ఈ బంపర్ బొనాంజా ప్లాన్ ప్రకారం... కేవలం రూ.329కే 1000జీబీ డేటా పొందవచ్చు. అదికూడా 20 ఎంబీపీస్ స్పీడ్ తో డేటా వాడుకోవచ్చు.
China Rocket Moon Crash: చైనా చేసిన తప్పిదానికి ప్రమాదంలో చందమామ ఉపరితలం, రాకెట్ ఫెయిల్ అవడంతో చంద్రుడిపై కూల్చేందుకు చైనా శాస్త్రవేత్తల ప్రయత్నం...
Krishnaరాకెట్ శకలం వల్ల జరిగిన ప్రమాదమని వారికి అర్థమయ్యింది. ఇప్పటికే చంద్రుడి చుట్టూ 3 టన్నుల వ్యర్థాలు గోడలాగా ఉన్నాయి. ఆ రాకెట్ శకలం వెళ్లిన వేగానికి ఈ వ్యర్థాల గోడకు బీటలు వచ్చి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2014 చైనా నుండి వెళ్లిన రాకెట్ శకలం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అంచనా వేస్తున్నారు.
Fitbit Recalls: ఆ స్మార్ట్ వాచ్‌ పెట్టుకుంటే చేతులు కాలిపోతున్నాయ్! 17 లక్షల స్మార్ట్ వాచ్‌లను వెనక్కురప్పిస్తున్న గూగుల్ కంపెనీ, స్టార్ట్ వాచ్ కంపెనీ ఫిట్ బిట్‌ కు భారీ నష్టం
Naresh. VNSగూగుల్ కు చెందిన స్మార్ట్ వాచ్‌ల తయారీ కంపెనీ ఫిట్ బిట్ కు (Fitbit) ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ తయారు చేసిన వాచ్‌ల్లో లోపం వల్ల బ్యాటరీ వేడెక్కి చేతులు కాలిపోతున్నాయి. దీంతో పది లక్షల వాచ్‌ లను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది(Fitbit Recalls ). దీంతో ఆ కంపెనీకి భారీగా నష్టం జరిగింది.
Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన ఆపిల్, అన్నీ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyప్రముఖ టెక్ దిగ్గజం, ప్రీమియం మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ కంపెనీ రష్యాకు భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో ఆపిల్ కంపెనీకి చెందిన అన్నీ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ ప్రకటించింది.
BharatPe: అష్నీర్ గ్రోవర్‌ను అన్ని పదవుల నుంచి తప్పించిన భారత్ పే, బోర్డు సమావేశం తర్వాత కీలక ప్రకటన
Hazarath ReddyBharatPe సహ వ్యవస్థాపకుడు, MD అష్నీర్ గ్రోవర్‌ను కంపెనీలోని అన్ని పదవుల నుండి తొలగించింది. ఈ మేరకు బోర్డు సమావేశం తర్వాత ప్రకటన వెలువడింది. కాగా భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.
Ashneer Grover Resign: భారత్‌పేకు రాజీనామా చేసిన ఎండీ అష్నీర్ గ్రోవర్, లేఖలో సంచలన ఆరోపణలు చేసిన అష్నీర్‌
Hazarath Reddyఫిన్‌టెక్ యూనికార్న్ భారత్‌పే (Unicorn Bharatpe) వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్.. తన మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ బోర్డు మెంబర్లు, కీలక పెట్టుదారులతో ఆయనకు నెలకొన్న విభేదాల కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సదరు సంస్థ వర్గాలు తెలిపాయి.
Apple iPhone 13: యాపిల్ ఐఫోన్ 13 ల‌వ‌ర్స్‌కు శుభ‌వార్త‌, స్మార్ట్‌ఫోన్‌పై రూ.11,000 వరకు డిస్కౌంట్‌, అమెజాన్ లో బంపర్ ఆఫర్
Krishnaఅమెజాన్ యాపిల్ ఐఫోన్ 13 (iPhone 13) కొనుగోలు దారుల‌కు భారీ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్13 గరిష్ట రిటైల్ ధర రూ.79,900నుండి తగ్గించి రూ.74,900కు విక్రయిస్తోంది.
iPhone 12 Mini: ఐఫోన్ 12 మినీని కేవలం రూ. 25,000కి కొనుగోలు చేసే అవకాశం, పూర్తి డీల్ ఏమిటో తెలుసుకోండి..
Krishnaమీరు రూ.59,900 విలువైన Apple iPhone 12 miniని ఫ్లిప్‌కార్ట్ నుండి రూ.25,799కి డిస్కౌంట్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. Flipkartలో అందుబాటులో ఉన్న ఈ డీల్ గురించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇక్కడ అందిస్తున్నారు.
Mukesh Ambani: భారత్ త్వరలో జపాన్‌ను అధిగమిస్తుంది, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అంచనా, గ్రీన్ ఎనర్జీలో ఇండియా లీడర్ అయ్యే అవకాశం..
Krishnaభారత్‌తో సహా ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ, భారత్ త్వరలో జపాన్‌ను అధిగమిస్తుందని బుధవారం పేర్కొన్నారు. 2030 నాటికి జీడీపీలో జపాన్‌ను భారత్‌ అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Jio Cable System: జియో మరో సంచలనం, సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌, ముంబై, చెన్నై కేంద్రంగా పదహారు వేల కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ వేస్తున్న దిగ్గజం
Hazarath Reddyదేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మ‌రో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోని ఇత‌ర ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ చేస్తూ జియో సముద్ర మార్గాన ఇంట‌ర్నెట్ కేబుల్ (Reliance Jio Cable System) నిర్మాణాల్ని చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.
Reliance Jio: జియోకి ఏమయింది, భారీగా షాక్ ఇస్తున్న యూజర్లు, డిసెంబర్ నెలలో 1.29 కోట్ల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిన జియో, 4.75 లక్షల మంది కొత్త యూజర్లను యాడ్ చేసుకున్న ఎయిర్‌టెల్
Hazarath Reddyరిలయన్స్ జియో సంస్థకు యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో మొబైల్ యూజర్లు జియోను (Reliance Jio) వదిలి వెళ్లారు. గత నెలతో పోలిస్తే డిసెంబర్ 2021లో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య 1.28 కోట్లు తగ్గిందని ట్రాయ్ డేటా గురువారం వెల్లడించింది.
WhatsApp: వాట్సాప్‌ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపితే జైలుకే! రూ. 20 లక్షలు ఫైన్, ఐదేళ్లు శిక్ష, కొత్త చట్టం ఎక్కడ తెచ్చారో తెలుసా?
Naresh. VNSరెడ్ హార్ట్ ఎమోజీ (red heart emoji) విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే జైలులో వేస్తారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీని (red heart emoji)పంపిస్తే వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తారు.