Mumbai, May 04: ప్రపంచ ఐటీ సంస్థలపై ఆర్ధిక మాంధ్యం ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది.ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగాలకు కోత పెట్టాయి. రానున్న రెండు, మూడేళ్ల పాటూ ఇదే తంతు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆర్ధికభారం తగ్గించుకునేందుకు ఉద్యోగుల్లో కోత పెట్టేందుకు వెనుకాడటం లేదు ముఖ్యమైన కంపెనీలు. ఇప్పటికే ఉద్యోగులను తొలగించిన పలు సంస్థలు...మరోసారి అదేబాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా కాగ్నిజెంట్ సీఈవో చేసిన వ్యాఖ్యలు ఐటీరంగంలో కలకలం రేపుతున్నాయి. నెక్ట్స్ జెనరేషన్ (NextGen program) ప్రోగ్రాంలో భాగంగా భారీగా కోతలు ఉండే అవకాశముందని కాగ్నిజెంట్ (Cognizant) సీఈవో ఎస్. రవికుమార్ తెలిపారు.
Cognizant says revenue will decline in 2023, to lay off 3500 employees #news #dailyhunt https://t.co/xjn5lIiAQq
— Dailyhunt (@DailyhuntApp) May 4, 2023
ఆపరేటింగ్ మోడల్ ను సులభతరం చేసుకునేందుకు కార్పొరేట్ విధులను సక్రమంగా నిర్వహించుకునేందుకు పలుచర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా దాదాపు 3500 మంది ఉద్యోగులను తొలగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 2023 సంవత్సరంలో తమ కంపెనీ రెవిన్యూ భారీగా తగ్గే అవకాశముందని రవికుమార్ అంచనా వేశారు.
దానికి అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. దీంతో పాటూ పెద్ద ఎత్తున కాగ్నిజెంట్ (Cognizant) ఆఫీస్ స్పెస్ ను అద్దెకు ఇచ్చే యోచనలో ఉంది. కంపెనీ ఉద్యోగుల్లో ఒకశాతం మందిపై లే ఆఫ్స్ ఎఫెక్ట్ పడనుంది. కాగ్నిజెంట్ లో ప్రస్తుతం దాదాపు 3లక్షల 51వేలమందికి పైగా ఉద్యోగులున్నారు.