Reliance Jio (Photo Credits: Twitter)

ప్రేమికుల రోజు సందర్భంగా దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్లను (Jio New Recharge Offer) అమల్లోకి తీసుకువచ్చింది. ‘జియో వాలెంటైన్ ఆఫర్’ కింద, వాలెంటైన్స్ డే ప్రీ పెయిడ్‌ ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్లలో అదనపు డేటాతో మరికొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. ముఖ్యంగా డిస్కౌంట్ కూపన్‌లు ,ఫెర్న్ & పెటల్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్‌ల నుండి ఆఫర్ ఉన్నాయి.ఈ ఆఫర్‌ను (Jio New Recharge Offer with Free Data) పొందడానికి, “కూపన్ కోడ్‌ల వివరాల కోసం మై జియో యాప్లో కూపన్‌లు & విన్నింగ్‌లు” ట్యాబ్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి.

నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మేసేజ్‌ చేయొచ్చు! చాలా ఈజీగా ఈ ట్రిక్స్ ఫాలో అయితే చాలు, ఆండ్రాయిడ్-ఐఓఎస్ యూజర్లకు పనికొచ్చే సింపుల్ ట్రిక్స్‌

రూ. 349, రూ.899 రూ. 2999 రీఛార్జ్‌పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ ప్రకారం, ఫిబ్రవరి 10న లేదా తర్వాత పైన పేర్కొన్న రీఛార్జ్‌ని చేస్తే అదనపు 12జీబీ 4జీ డేటా కూపన్‌కు అర్హులు. అలాగే రూ. 2999 ప్లాన్‌తో, అయితే, పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో పాటు, కస్టమర్‌లు 75జీబీ అదనపు డేటాతో పాటు 23 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా పొందుతారు. అంటే రూ. 2399 ప్లాన్‌తో అందించే మొత్తం అదనపు డేటా 87జీబీ వస్తుంది.

WhatsApp New Features: ఇకపై వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్, దాంతో పాటూ వాట్సాప్‌లో కాల్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు, సరికొత్త ఫీచర్లను పరిశీలిస్తున్న వాట్సాప్  

జియో వాలెంటైన్‌ ఆఫర్‌

♦ రూ. 121 విలువైన అదనపు డేటా యాడ్-ఆన్ (12 జీబీ డేటా).

♦ రూ. 1,000 విలువైన ప్రత్యేక తగ్గింపు వోచర్లు.

♦ ఫెర్న్ & పెటల్స్ రూ. 799 కొనుగోలుపై రూ. 150 తగ్గింపు.

♦ మెక్‌డొనాల్డ్స్ - రూ. 199 కొనుగోలుపై రూ. 105 తగ్గింపు (సౌత్ & వెస్ట్ రీజియన్ మాత్రమే).

♦ ఇక్సిగో - రూ. 4,500 విమాన బుకింగ్‌పై రూ. 750 తగ్గింపు.

.