New York, FEB 09: దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో (Whats app new feature) మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానున్నది. యూజర్లు వాట్సాప్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను షెడ్యూల్ (schedule calls) చేసుకోవచ్చు. అంటే వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులకు ఎప్పుడు ఆడియో లేదా వీడియో కాల్ వెళ్లాలో ముందుగానే సెట్ చేసుకోవచ్చు. వీడియో/ఆడియో కాల్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీటింగ్ పేరు, తేదీ, సమయం వంటి వివరాలను ఎంటర్ చేసి క్రియేట్‌పై క్లిక్ చేస్తే కాల్ (Video call) షెడ్యూల్ అవుతుంది. కాల్ ప్రారంభమైన వెంటనే గ్రూపు సభ్యులందరికీ అలర్ట్ నోటిఫికేషన్ వెళుతుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ముందుగా బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాలం మారుతున్న కొద్ది వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాట్సాప్ ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
అయితే ఇటివలే వాట్సాప్ సేవలు కొంత సమయం ఆగిపోయిన తర్వాత నుంచి వినియోగదారుల్లో దానిపై నమ్మం పోయింది. దీంతో వాట్సాప్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అదిరిపోయే ఫీచర్లను వినియోగదారులకు తీసుకోస్తోంది. రాబోయే సంవత్సరంలో కాల్ రికార్డింగ్, మెసేజ్ ఎడిట్ వంటి అనేక ఫీచర్లు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. వీటితో పాటూ మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్. వాటన్నింటినీ ఇప్పుడు టెస్టింగ్ దశలో పెట్టింది. కొందరు బీటా వర్షన్ యూజర్లు ఈ ఫీచర్లను యూజ్ చేయవచ్చు.
వాట్సాప్ కాల్ రికార్డింగ్ ను (whats app call recording) కూడా తీసుకువచ్చే అవకాశముంది. ఇది ప్రమాదకరమైనది అని తెలిసినప్పటికీ... వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కాల్ రికార్డ్ ఆప్షన్‌ను వినియోగదారులకు పరిచయం చేయబోతోందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అతి తర్వలోనే వాట్సాప్ కాల్ రికార్డింగ్ సంబంధించిన మరింత సమాచారాన్ని రానుంది.
దీంతో పాటూ ఇక నుంచి వాట్సాప్ మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఇలా చేయనక్కర్లేదు. సందేశం ఏదైనా తప్పుగా ఉంటే ఎడిట్ మెసేజ్ ఫీచర్ ద్వారా సవరించుకునే అవకాశాన్ని తీసుకురాబోతోంది. దీంతో వినియోగదారులు ఆటో-డిలీట్, డిలీట్ మెసేజ్ అలాగే ఎడిట్ మెసేజ్ సౌకర్యాన్ని పొందుతారు.
ఇక యూజర్లు ఏదైనా తప్పుడు సందేశాన్ని పంపిచి.. దానిని ఎడిట్ చేసుకోలేకపోతే అన్‌సెండ్ మెసేజ్ ఆప్షన్ ద్వారా తొలగించవచ్చు. ఇప్పటికే ఇలాంటి ఫీచర్ చాలా సోషల్ మీడియాల్లో అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో అన్‌సెండ్ ఆప్షన్ నొక్కగానే మీతో చాట్ చేస్తున్న వినియోగదారికి సందేశం డిలీట్ అవుతుంది.