Plants (Credits: X)

Newdelhi, Apr 5: మొక్కలకు (Plants) కూడా ప్రాణం ఉంటుందని తెలిసిందే. అయితే, తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు మొక్కలు కూడా ‘ఆక్రందనలు’ (Plants Scream) చేస్తాయని పరిశోధకులు తాజాగా గుర్తించారు. కూకటి వేళ్లతో సహా పెకలించినప్పుడు, లేదా కాండాన్ని మధ్యలో నరికినప్పుడు మొక్కలు ఈ ‘ఆక్రందనలు’ చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు వేసినట్టుగా ఉంటాయని, మనుషులకు వినబడవని పేర్కొన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌ లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Himachal Pradesh Earthquake: హిమాచల్ ప్రదేశ్‌ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం.. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారుల ప్రకటన

ఏ మొక్కలపై ప్రయోగాలు?

ఈ ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు టమాటా, పొగాకు మొక్కలను ఎంచుకున్నారు. అయితే, మొక్కలు ఈ శబ్దాల్ని ఎలా చేస్తాయనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

Is Prakash Raj Joining BJP?: ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారా ? సోషల్ మీడియాలో వైరల్ రూమర్‌పై స్పందించిన ప్రముఖ నటుడు