 
                                                                 Newdelhi, Mar 1: 2.5 కోట్ల సంవత్సరాల క్రితం వరకూ కోతులకు (Monkeys) ఉన్నట్టే మనుషులకు కూడా తోకలు (Tails) ఉండేవట. అయితే, కాలక్రమేణా మనుషులు, గొరిల్లాలలో (Apes) తోకలు క్రమంగా కనుమరుగైనట్టు చెప్తారు. దీనికి గల కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా వివరించారు. డీఎన్‌ఏలో కొత్తగా చేరిన ఏఎల్‌యూవై (జంపింగ్ జీన్స్) అనే ప్రత్యేక జన్యువుల కారణంగానే మనుషుల్లో తోకలు పెరుగడం నిలిచిపోయిందని వాళ్లు తెలిపారు. ఇదేసమయంలో జంపింగ్ జీన్స్ లేకపోవడంతో కోతులు, ఎలుకలు, పిల్లుల వంటి జీవుల్లో తోకలు పెరుగడం అలాగే కొనసాగుతున్నట్టు వెల్లడించారు.
Scientists uncover why humans lost their tails 25 million years ago. 😯🧐🤔 https://t.co/byn5h9qZ5r via @MailOnline
— Ms. 35Again !!! (@Handmade1D) February 28, 2024
పరిశోధనలో భాగంగా అప్పుడే పుట్టిన 63 ఎలుకలను తీసుకొన్న శాస్త్రవేత్తలు వాటిలోకి జంపింగ్ జీన్స్‌ను క్రమంగా ప్రవేశపెట్టారు. ఎలుకలు పెరుగుతున్న క్రమంలో వాటి తోకలు చిన్నగా మారిపోవడం అనంతరం శరీరంలో కలిసిపోవడం జరిగినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
