World

Egypt Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, 22 మంది దుర్మరణం, మరో 33 మందికి గాయాలు, ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు

Hazarath Reddy

ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంగళవారం తెల్లవారు జామున ఢీకొట్టింది.

European Heat Wave: తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్న యూరప్, బ్రిటన్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు, ప‌శ్చిమ యూరోప్ దేశాల్లో హీటెక్కిస్తున్న టెంప‌రేచ‌ర్లు

Hazarath Reddy

యూరోప్ తీవ్రమైన వేడిగాలులతో మండిపోతోంది. అధిక ఉష్ణోగ్ర‌త‌లతో జ‌నం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అడవుల్లో చెల‌రేగుతున్న దావాన‌లం కొన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు క‌లిగిస్తోంది. ప‌శ్చిమ యూరోప్ దేశాల్లో టెంప‌రేచ‌ర్లు హీటెక్కిస్తున్నాయి. ఉత్త‌రం దిశ‌గా ఆ బ‌ల‌మైన‌ హీట్‌వేవ్ కొన‌సాగుతున్న‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Pakistan: పట్టపగలే బరితెగించిన కామాంధుడు, నడిరోడ్డుపై బాలికను వెనకనుంచి పట్టుకుని లైంగిక దాడి, పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఘటన

Hazarath Reddy

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ షాకింగ్‌ ఘటన సీసీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. బుర్ఖా ధరించి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై ఓ దుండగుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెను పట్టుకుని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Giant African Land Snails: నత్తల భయంతో అమెరికాలో లాక్‌డౌన్, ఎలుక సైజులో పెరిగే నత్తలు, ఒక్కొక్కటి 1200 గుడ్లు పెడతాయి, నత్తల కట్టడికి కఠిన నిబంధనలు అమలు, వాటివల్ల నష్టం ఏంటంటే?

Naresh. VNS

నత్త అంటే చిన్నగా ఉంటుంది అవి అగ్రరాజ్యం అయిన అమెరికాను వణికించటం ఏంటా?అనుకోవచ్చు. కానీ చిన్నపాటి మిడత కూడా దేశాలకు దేశాలనే వణికించిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు అమెరికాలో(America) ఏకంగా నత్తలు జనాలను నానా తిప్పలు పెడుతున్నాయి. ఏకంగా ఎలుకల సైజు అంత ఉన్న నత్తలు ఏకంగా ఒక రకమైన కొత్త తరహా లాక్ డౌన్ (lockdown) ఆంక్షలు పెట్టడానికి కారణమయ్యాయి.

Advertisement

Sri Lanka Crisis: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు, మహీంద, బాసిల్‌లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

Sri Lanka Crisis: మాజీ ప్రధాని రాజపక్స కుటుంబానికి సుప్రీంకోర్టు షాక్, ఈ నెల 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు, వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని తెలిపిన ధర్మాసనం

Hazarath Reddy

former Prime Minister Mahinda Rajapaksa, Sri Lanka, Supreme Court, interim order preventing, Sri Lanka Crisis, శ్రీలంక, మాజీ ప్రధాని రాజపక్స, దేశ అత్యున్నత న్యాయస్థానం

Mario Draghi Resigns: ఇటలీ ప్రధాని రాజీనామా, పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో విజయం, అనంతరం రాజీనామా ప్రకటించిన మారియో ద్రాగి

Hazarath Reddy

విశ్వాస ఓటింగ్‌లో గెలిచిన తర్వాత ఇటలీ ప్రధాని మారియో డ్రాగి రాజీనామా చేశారు. ఆయనకు విశ్వాస పరీక్షలో అనుకూలంగా 172 ఓట్లు రాగా వ్యతిరేకంగా 39 ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మద్దతునిచ్చిన జాతీయ ఐక్యత యొక్క మెజారిటీ ఇప్పుడు లేదని రాజీనామా సందర్భంగా వెల్లడించారు

Karachi Horror: వీడు భర్తేనా.. పిల్లల ముందే భార్య గొంతు కోసి బాయిల్ చేశాడు, ఇతరులతో అక్రమ సంబంధాలు వద్దన్నందుకే ఈ కిరాతకం, పాకిస్తాన్ లో దారుణ ఘటన

Hazarath Reddy

పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. దాయాది దేశంలో ఓ భర్త తన పిల్లల ముందే భార్య ను గొంతు కోసి, బాయిల్‌ (Pakistan Man Boils Wife) చేశాడు.

Advertisement

Sri Lanka Crisis: ఓ పక్క నిరసనలు, అయినా ముద్దుల్లో మునిగిన తేలిన జంట, శ్రీలంక దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కిస్సింగ్ ఫోటో వైరల్

Hazarath Reddy

గత బుధవారం ప్రధానమంత్రి రణీల్‌ విక్రమసింఘే కార్యాలయం ముందు నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ ఫోటో తీసినట్లు రాసుకొచ్చింది న్యూస్‌వైర్‌.

Monkeypox in India: దేశంలో మంకీపాక్స్‌ తొలి కేసు, ఈ లక్షణాలు ఉంటే మీకు Monkeypox వైరస్ సోకినట్లే, మంకీపాక్స్‌ను మహమ్మారిగా ప్రకటించింన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

దేశంలో కేరళలో తొలి మంకీపాక్స్ (Monkeypox) కేసు నమోదైంది. ఇటీవల యూఏఈ (UAE) నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతడిని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు నమూనాలు సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు.

Sri Lanka Crisis: శ్రీలంక తాత్కాలిక అద్యక్షుడిగా ప్ర‌ధాని ర‌ణిల్ విక్ర‌మసింఘే, రాజ్యాంగంలోని 37(1) నిబంధ‌న కింద నియమించామని తెలిపిన స్పీకర్

Hazarath Reddy

శ్రీలంక ప్ర‌ధాని ర‌ణిల్ విక్ర‌మసింఘేను తాత్కాలిక అధ్య‌క్షుడిగా లంక స్పీక‌ర్ మ‌హింద య‌ప అబెవ‌ర్ధ‌న బుధ‌వారం నియమించారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స దేశం వీడి వెళ్ల‌డంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగిన సంగతి విదితమే. అయితే రాజ‌ప‌క్స ఇంత‌వ‌ర‌కూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు.

Sri Lanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం, ప్రధాని నివాసాన్ని చుట్టిముట్టిన ఆందోళనకారులు, రాజీనామా చేయాలని డిమాండ్

Hazarath Reddy

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దారుణస్థాయికి పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ (Sri Lanka Declares State of Emergency) విధించింది. అధ్యక్షుడు గొటబాయ బుధవారం వేకువజామునే కుటుంబంతో సహా మిలిటరీ విమానంలో దేశం విడిచి మాల్దీవులకు (President Gotabaya Rajapaksa Flees to Maldives)పారిపోయారు

Advertisement

Thailand: రేపిస్టులు జీవితాంతం సెక్స్‌కు పనికి రాకుండా కెమికల్‌ కాస్ట్రేషన్‌, కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన థాయ్‌లాండ్‌ పార్లమెంట్, అసలు కెమికల్‌ కాస్ట్రేషన్‌ అంటే ఏమిటి..ఓ సారి చూద్దాం

Hazarath Reddy

థాయ్‌లాండ్‌ దేశం రేపిస్టులపై కొరడా ఝులిపించింది. అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినమైన కెమికల్‌ కాస్ట్రేషన్‌కు గురి చేసే చట్టానికి ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదం (Thailand passes bill) తెలిపింది.

Sri Lanka Economic Crisis: శ్రీలంక అధ్యక్షుడు పరారీలో భారత్ ప్రమేయం.. వార్తలను కొట్టిపారేసిన భారత హైకమిషన్‌ కార్యాలయం, శ్రీలంక ప్రజలకు భారత్‌ సాయం కొనసాగుతుందని స్పష్టం

Hazarath Reddy

ఆయన పారిపోయేందుకు భారత్ సహకరించిందనే వదంతులు శరవేగంగా వ్యాపించాయి. దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్‌ కార్యాలయం స్పందించింది. ఈ వార్తలు నిరాధారం, కల్పితమైనవని కొట్టి పారేసేంది

Sri Lanka Economic Crisis: శ్రీలంక కొత్త అధ్యక్షుడు ఎవరు? రాజీనామాకు ముందే దేశం విడిచి మాల్దీవులకు పరారైన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, జులై 20న కొత్త అధ్యక్షుడి ఎన్నిక

Hazarath Reddy

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు. అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గొటబాయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజూమునే మాల్దీవులకు పారిపోయారు.

China: 30 ఏళ్ళ తర్వాత తాను అతడు కాదు ఆమె అని తెలుసుకున్నాడు, చైనాలో 33 ఏళ్ల వ్యక్తిని ఇంటర్‌సెక్స్‌‌గా గుర్తించిన వైద్యులు

Hazarath Reddy

పదేపదే మూత్ర విసర్జన సమస్యతో చికిత్స పొందుతున్న చైనాలోని 33 ఏళ్ల వ్యక్తి (Chinese man) జీవశాస్త్రపరంగా అతను స్త్రీ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. 33 ఏండ్ల ఓ యువకునికి తరచూ కడుపునొప్పి, మూత్రంలో రక్తం వంటి సమస్యలు వేధించేవి.

Advertisement

India to Surpass China: వచ్చే ఏడాది చైనా రికార్డును తిరగరాయబోతున్న భారత్, ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభాగ‌ల దేశంగా ఆవిర్భావం, ప్ర‌స్తుతం భార‌త్ జ‌నాభా 141.2 కోట్లు

Hazarath Reddy

వచ్చే ఏడాది చైనా రికార్డును భారత్ తిరగరాయబోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభాగ‌ల దేశంగా నిలిచిన చైనా 2023 నాటికి రెండో ప్లేసులోకి రానుంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభాగ‌ల దేశంగా భార‌త్ నిల‌వ‌బోతున్న‌ది.

Texas: సరదాగా తలపై టపాసులు పేల్చుకున్న ఓ వ్యక్తి, అవి పుర్రెను చీల్చుకుంటూ తల లోపలకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

అమెరికాలోని టెక్సాస్ లో తలపై టపాసులు పేల్చుకున్నవ్యక్తి... తల పగిలిపోయి దుర్మరణం పాలయ్యాడు. పాబ్లో రూయిజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు.

Man Lights Firework on his Head: ఫుల్లుగా తాగి తలపై బాంబు పేల్చుకున్నాడు, పుర్రెను చీల్చేసిన టపాసులు, అమెరికాలోని టెక్సాస్ లో ఘటన

Naresh. VNS

పాబ్లో రూయిజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి స్నేహితులతో పార్టీ (Party)చేసుకున్నాడు. బాగా తాగిన తర్వాత సరదాగా ఫ్రెండ్స్ తో ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు. దీంతో తలపై పేలిన బాణాసంచా అతని పుర్రెను చీల్చుకుంటూ లోపలకు వెళ్లాయని అధికారులు భావిస్తున్నారు.

Srilanka Crisis: శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో సీక్రెట్ బంకర్, దాని నుంచే పారిపోయి ఉంటారని అనుమానం, లంక అధ్యక్షుడి ఇంట్లో తాగి, వండుకొని తిన్న ఆందోళనకారులు

Naresh. VNS

అధ్యక్షుడి భవనంలోని అన్ని గదులను నిరసనకారులు పరిశీలిస్తున్నారు. దీంతో ఒక గదిలోని రహస్య బంకర్‌ను ఆదివారం గుర్తించారు. ఆ బంకర్‌లోకి వెళ్లే డోర్‌ (Door) గుర్తించని విధంగా ఉంది. అలాగే కేవలం లిఫ్ట్‌ ద్వారానే ఆ బంకర్‌లోకి (Secret Bunker) ప్రవేశించే వీలుంది. అయితే బంకర్‌ చివరన బలమైన స్టీల్‌ డోర్‌ ఉంది. దీంతో నిరసనకారులు దానిని తెరిచేందుకు ప్రయత్నించలేదు.

Advertisement
Advertisement