World
Russian Vaccine: రష్యా వ్యాక్సిన్‌పై షాకింగ్ న్యూస్, ఆ టీకా వేసుకునేందుకు నిరాకరిస్తున్న రష్యన్ డాక్టర్లు, సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిన ఆర్‌బీసీ న్యూస్‌
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో దానికి విరుగుడును రష్యా (Coronavirus Russian Vaccine) కనిపెట్టి గ్లోబల్ వ్యాప్తంగా ఆశలు రేకెత్తించిన సంగతి విదితమే. అయితే దానికి సొంత దేశంలోనే ఎదురుదెబ్బ తగులుతోందని విషయాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ రూపొందించిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్ పై (Sputnik V) రష్యాలో సగం మంది డాక్టర్లు (Russian Doctors) నిరాసక్తత చూపిస్తున్నారట.
Citigroup ‘Clerical Error’: చిన్న తప్పుతో రూ. 6700 కోట్లు రుణదాతల ఖాతాల్లోకి, తిరిగి రాబట్టుకునేందుకు నానా కష్టాలు పడుతున్న సిటీ గ్రూపు, దివాళా దిశగా రెవ్లాన్ కంపెనీ
Hazarath Reddyబ్యాకింగ్ రంగ దిగ్గజం సిటీబ్యాంక్‌లో పని చేసే ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు (Citigroup Mistakenly Pays $900 Million) కారణంగా సిటీబ్యాంక్‌ భారీ వివాదంలో (Citigroup Clerical Error) చిక్కుకుంది. న్యూయార్క్‌ సిటీబ్యాంకు శాఖలో చోటుకున్న ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ సంక్షోభంతో సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్‌‌, సుమారు బిలియన్‌ డాలర్ల మేరకు రుణదాతలకు బకాయి పడింది. దీంతో ఈ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి దిగాయి. సంబంధిత రుణాలను 2023లోగా తిరిగి చెల్లించాలని డిమాండు చేస్తూ యూఎంబీ బ్యాంక్, రుణదాతల తరపున రెవ్లాన్‌పై (Revlon) దావా వేసింది.
D614G Virus in Malaysia: మలేషియాలో డేంజర్ వైరస్, కరోనా కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రమాదకరం‌తో D614G వైరస్, మొత్తం 45 కేసులు నమోదు, రూల్స్ బ్రేక్ చేసినందుకు పేషెంట్‌కి ఐదు నెలల జైలు శిక్ష
Hazarath Reddyమలేషియాలో ప్రమాదకరవైరస్ (D614G in Malaysia) వెలుగులోకి వచ్చింది. అయితే ఇది యూరప్, ఉత్తర అమెరికా ఖండంలో కనిపించింది. దానికి D614G అని పేరు కూడా పెట్టారు. తాజాగా మలేషియాలో కూడా ఈ వైరస్ బయటపడింది. అయితే ఇది కరోనా వైరస్ లాగానే ఉంది. అయితే లక్షణాలు కరోనా( Coronavirus) కన్నా 10 రెట్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇండియాకి వెళ్లి మలేసియా తిరిగొచ్చిన ఓ రెస్టారెంట్ ఓనర్‌కి కరోనా వచ్చింది. ఆయన ద్వారా మరికొంత మందికి ఈ వైరస్ వ్యాపించింది. ఇలా మొత్తం అక్కడ 45 కేసులు నమోదయ్యాయి.
Coronavirus in India: పెరుగుతున్న రికవరీ రేటు, దేశంలో 19 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు నమోదు, 26,47,664 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య (Coronavirus in India) 26 లక్షలు దాటింది. తాజాగా 941 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921 కి (Coronavirus Deaths) చేరింది. తాజాగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,47,664 కు చేరింది. ప్రస్తుతం 6,76,900 మంది వైరస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 30 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
MS Dhoni Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు ఎం.ఎస్ ధోనీ వీడ్కోలు, అభిమానుల ప్రేమకు ధన్యవాదాలంటూ సంక్షిప్త సందేశం, ఐపీఎల్‌లోనైనా ఆడతాడా, లేదా? అని అభిమానుల్లో ఉత్కంఠ
Team Latestlyభారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆగష్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం రోజున సంచలన ప్రకటన చేశారు. తాను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్....
India's Coronavirus Report: గాలి ద్వారానే కరోనా వ్యాప్తి అంటున్న పరిశోధనలు, దేశంలో తాజాగా 64,553 మందికి కోవిడ్-19, 24,61,191కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyభారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా (Coronavirus New Cases) 64,553 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య (India's Coronavirus Report) 24,61,191కు చేరింది. ఇక దేశంలో నమోదవుతున్న మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 1007 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మొత్తం 48,040 మంది ప్రాణాలు (Coronavirus Deaths) కోల్పోయారు. గురువారం తాజాగా 55,573 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 6,61,595 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 17,51,556 మంది కోలుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 8,48,728 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 2,76,94,416 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారు.
H1B Visa Update: అమెరికాలో ఉద్యోగం చేసే వారికి గుడ్ న్యూస్,హెచ్‌1బీ వీసా హోల్డర్స్ పాత ఉద్యోగ‌మే కొన‌సాగించేందుకు ట్రంప్ సర్కార్ అనుమతి
Hazarath Reddyఅమెరికాలో ఉద్యోగానికి అవసరమైన హెచ్‌1బీ వీసా (H1B Visa) విషయంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌1బీ వీసాదారులు (visa holders) తమ పాత ఉద్యోగాన్ని కొన‌సాగించేందుకు అనుమ‌తి ఇచ్చింది. హెచ్‌1బీతోపాటు వివిధ రకాల విదేశీ వర్క్‌ వీసాలను ఈ ఏడాది డిసెంబరు వరకూ రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రస్తుతం అమల్లో ఉంది. అయితే తాజాగా హెచ్‌1బీ వీసా ఉన్న‌వాళ్లు పాత ఉద్యోగ‌మే కొన‌సాగించేందుకు ట్రంప్ స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది.
Coronavirus Cases in India: దేశంలో 16 లక్షలకు పైగా కరోనా పేషెంట్లు డిశ్చార్జ్, యాక్టివ్ కేసులు కేవలం 6,43,948 మాత్రమే, దేశంలో తాజాగా 60,963 మందికి కరోనా, 23,29,639 కి చేరిన కేసుల సంఖ్య
Hazarath Reddyభారత్‌లో 24 గంటల్లో 60,963 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 834 మంది మృతి (Coronavirus Deaths) చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 23,29,639 కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 46,091 కి పెరిగింది. 6,43,948 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా (Coronavirus Cases in India) నుంచి ఇప్పటివరకు 16,39,600 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,60,15,297 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 7,33,449 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ (ICMR) వివరించింది.
Russia's Sputnik V: స్పుత్నిక్ వీ కోసం క్యూ కడుతున్న దేశాలు, రష్యా తొలి వ్యాక్సిన్ కోసం 20 దేశాల నుంచి బిలియన్ డోసుల కంటే ఎక్కువ ప్రీ ఆర్డర్లు, సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి
Hazarath Reddyకరోనా ప్రపంచాన్ని కల్లోల పరుస్తున్న వేళ రష్యా తీపి కబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటించారు. రష్యా తీసుకొస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు పేరును (Russia's Sputnik V) కూడా ఖరారు చేసింది. స్పుత్నిక్ వీ (Sputnik V) పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని రష్యా వెల్లడించింది. ఈ విషయాన్ని ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసిన్‌ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ (Kirill Dmitriyev) వెల్లడించారు.
Russia COVID-19 Vaccine: కరోనాకి రష్యా వ్యాక్సిన్ చెక్, పుతిన్ కూతురుకి తొలి వ్యాక్సిన్, ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వైరస్‌ వ్యాక్సిన్‌‌ను అభివృద్ధి చేశామని తెలిపిన రష్యా అధ్యక్షుడు
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రష్యా తీపి కబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను (World's First COVID-19 Vaccine) అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ (Vladimir Putin) ప్రకటించారు. ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగిఉందని వ్యాక్సిన్‌ను (Russia COVID-19 Vaccine) ప్రారంభిస్తూ ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్‌ మురష్కోను ఆయన కోరారు.
Bill Gates: కరోనాకు 2021లో అంతం తప్పదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిలియనీర్‌ బిల్‌ గేట్స్‌, ధనిక దేశాల్లో 2021 మే నాటికి..మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి కనుమరుగవుతుందని వెల్లడి
Hazarath Reddyకరోనావైరస్ అంతం అయ్యే రోజు దగ్గరలో ఉందని అన్నీ అనుకూలిస్తే ఇది 2021 మే నాటికి చాలా దేశాల్లో కరోనా కనుమరుగవుతుందని (COVID 19 may end in 2021) బిల్ గేట్స్ అన్నారు. అమెరికన్ మ్యాగజైన్ వైర్డ్ (American magazine Wired)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. ‘త్వరలోనే కోవిడ్-19 వ్యాక్సిన్‌ (COVID-19 vaccine) అందుబాటులోకి వస్తుంది. ధనిక దేశాల్లో 2021 మే నాటికి మహమ్మారి అంతం అవుతుంది. మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి వైరస్‌ తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు.
Russia Corona Vaccine: రష్యా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌, ఆగస్టు 12వ తేదీన రిజిస్టర్ చేయనున్నట్టు ప్రకటించిన రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి, మార్గదర్శకాలు పాటించాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ
Hazarath Reddyప్రపంచంలో కోవిడ్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ రేసులో రష్యా (Russia Corona Vaccine) ముందడుగు వేసింది. తాము డెవలప్ చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ( Covid-19 Vaccine) ఆగస్టు 12వ తేదీన రిజిస్టర్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయించుకున్న తొలి దేశంగా నిలిచేందుకు సర్వం సిద్ధం చేసింది. ఆ దేశ రక్షణశాఖ, గమలేయ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా అభివృద్ధిచేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను (COVID-19 Vaccine Update) ఈ నెల 12న రిజిస్టరు చేయనున్నారు. ఈవిషయం స్వయంగా రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి ఒలెగ్‌ గ్రిడ్నెవ్‌ ప్రకటించారు.
India's Coronavirus: దేశంలో తాజాగా 62,064 కేసులు నమోదు, 22 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, యాక్టివ్‌గా 6,34,945 కేసులు, మరణాల సంఖ్య 44,386
Hazarath Reddyదేశంలో వ‌రుస‌గా నాలుగో రోజు 62 వేల‌కు పైగా పాజిటివ్ కేసుల‌తోపాటు (Coronavirus Cases), ఎనిమిది వంద‌ల‌కు పైగా మ‌ర‌ణాలు (Coronavirus Deaths) న‌మోద‌య్యాయి. నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 62,064 మంది కొత్త‌గా క‌రోనా (New Coronavirus Cases) బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 22,15,075కు పెర‌గ‌గా, మ‌ర‌ణాలు 44,386కు చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్‌గా (Coronavirus Active Cases) ఉండ‌గా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో క‌రోనా బారి నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 15 ల‌క్ష‌లు దాటింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.
COVID-19 Vaccine Price: కరోనాకు చెక్ పెట్టినట్లే, కోవిడ్ వ్యాక్సిన్‌ను రూ.225కే విక్రయిస్తామని తెలిపిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో డీల్ కుదుర్చుకున్న గవి
Hazarath Reddyమహారాష్ట్రలో పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ (COVID-19 Vaccine) అందుబాటులోకి తెచ్చేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను (Coronavirus Vaccine) రూ.225కే అందించ‌నున్న‌ట్లు భార‌త్‌కు చెందిన ఫార్మా కంపెనీ సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ (Serum Institute of India) వెల్ల‌డించింది. ఈ మేరకు గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ తయారీ కోసం గేట్స్ ఫౌండేషన్ నుండి గవి ద్వారా 150 మిలియన్ డాలర్ల నిధులు సీరంకు అందుతాయి.
New Drug RLF-100: అంగస్తంభన ఔషధంతో కరోనాకు చెక్, ఆర్ఎల్‌ఎఫ్-100 కోవిడ్ కు విరుగుడుగా పనిచేస్తుందని తెలిపిన హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్, సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలు
Hazarath Reddyఅంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్‌ఎఫ్-100 (అవిప్టడిల్) (New Drug RLF-100) ఔషధం కరోనాకు విరుగుడుగా ఉపయోగపడుతోందని పరిశోధనల్లో తేలింది. సాధారణంగా ఈ ఓౌషధం ముక్కు ద్వారా పీల్చడం ద్వారా అంగస్తంభన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ ఔషదాన్ని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా బాధితులకు బహుళ క్లినికల్ సైట్లలో అత్యవసరంగా ఉపయోగించడం కోసం ఎఫ్‌డీఏ (FDA) చేత ఆమోదించబడింది.
Sri Lanka General Elections Results 2020: శ్రీలంకలో మళ్లీ రాజపక్స, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎస్‌ఎల్‌పీపీ, ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyశ్రీలంకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్స (Mahinda Rajapaksa) కుటుంబ ఆధ్వర్యంలో నడిచే శ్రీలంక పీపుల్స్‌ పార్టీ (ఎస్‌ఎల్‌పీపీ) బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఎస్ఎల్పీపీ మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకుంది. దీంతో శ్రీలంక ప్రధానిగా మహీంద్ రాజపక్సే కొనసాగనున్నారు. గత నవంబరు నుంచి రాజపక్సే ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ (Sri Lanka General Elections Results 2020) రాజపక్సే పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడు గోటాబయ రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్నారు.
COVID-19 Outbreak: దేశంలో 24 గంటల్లో 62,538 కరోనా కేసులు, కరోనావైరస్‌తో పాట్నా కోర్టు జడ్జి మృతి, 20 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు, 41,585కు పెరిగిన క‌రోనా మృతుల సంఖ్య
Hazarath Reddyదేశంలో గ‌త‌ తొమ్మిదోరోజులుగా 52 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు (Coronavirus Cases) న‌మోద‌య్యాయి. తాజాగా గత 24 గంటల్లో అత్య‌ధికంగా 62 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒకేరోజులో ఇంత భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,27,075కు (COVID-19 tally) చేరాయి. ఇందులో 6,07,384 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 13,78,106 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 886 మంది (COVID-19 Deaths) మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 41,585కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.
SFTS Virus in China: చైనాలో మరో ప్రమాదకర వైరస్, ఎస్ఎఫ్‌టీఎస్ దెబ్బకు ఏడు మంది మృతి, 60 మంది ఆస్పత్రిలో చేరిక, మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ
Hazarath Reddyకరోనావైరస్ కల్లోలం మరచిపోకముందే చైనాలో మరో భయంకరమైన వైరస్ ( Another Virus in China) వెలుగు చూసింది. ఈ ప్రమాదకర వైరస్ (SFTS Pandemic) ధాటికి అక్కడ ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మ‌రో 60 మంది దీని బారిన ప‌డ్డారు. ఎస్ఎఫ్‌టీఎస్ (సివియ‌ర్ ఫీవ‌ర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్) (Severe fever with thrombocytopenia syndrome) వైరస్‌గా పిలుస్తోన్న ఈ వైరస్ మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని చైనా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు చైనా అధికారిక మీడియా గ్లోబ‌ల్ టైమ్స్‌ బుధ‌వారం క‌థనాన్ని వెలువ‌రించింది.
Salmonella Outbreak: అమెరికాను వణికిస్తున్న ఎర్ర ఉల్లిపాయ, యుఎస్, కెనడాలో పెరుగుతున్న సాల్మొనెల్లా కేసులు, ఎరుపు రంగు ఆనియన్స్ ద్వారా వ్యాధి వస్తుందని తెలిపిన సీడీసీ
Hazarath Reddyఅగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు రెడ్ ఆనియన్స్ (Red Onions) చుక్కలు చూపిస్తోంది. కరోనాతో ఇప్పటికే వణికిపోతున్న అమెరికాకు (America) ఉల్లి రూపంలో మరో ప్రమాదం ఎదురవుతోంది. అమెరికాలో ఉల్లిపాయలు ఓ భయంకరమైన వ్యాధిని (Salmonella Outbreak) కలిగిస్తున్నాని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(CDC) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా అమెరికా, కెనడాలో (Canada) సాల్మొనెల్లా(ఫుడ్‌ పాయిజన్‌ కలిగించే బ్యాక్టీరియా) మహమ్మారి కేసులు ఎక్కువగా వెలుగు చేస్తున్నాయని సీడీసీ (Centers for Disease Control and Prevention) తెలిపింది.
Rahul Gandhi vs PM Modi: మోదీ అబద్దాలు ఎందుకు చెబుతున్నారు, చైనా-భారత్‌ సరిహద్దు వివాదంపై ప్రధానిపై మండిపడిన రాహుల్ గాంధీ
Hazarath Reddyచైనా-భారత్‌ సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న పరిస్థితుల గురించి (India-China Tensions) ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi vs PM Modi) మరోసారి మండిపడ్డారు. మే నెలలో తూర్పు ల‌డ‌ఖ్‌ ప్రాంతంలోకి చైనా ఆర్మీ (Chinese Army) ప్ర‌వేశించిన‌ట్లు తెలుపుతూ వచ్చిన ఓ వార్తను రాహుల్ గాంధీ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జూన్ 15వ తేదీ గల్వాన్ లోయ వద్ద చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘ‌ర్ష‌ణ కంటే నెల రోజుల ముందే చైనా ఆర్మీ భారత్‌లో ప్రవేశించిందని అబద్దాలు ఎందుకు చెబుతున్నారని రాహుల్ మండిపడ్డారు.