World

Delhi Lockdown 4 Guidelines: 20 మంది ప్రయాణీకులతో బస్‌లకు అనుమతి, సెలూన్‌, బార్బర్‌ షాపుల మూసివేత, భారీ సడలింపులు ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను (Lockdown 4) మే 31 వరకు పొడిగించిన సంగతి విదితమే. కాగా లాక్ డౌన్ 4లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0 అమలులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) భారీ సడలింపులు (Delhi Lockdown 4 Guidelines) ప్రకటించారు. 20 మంది ప్రయాణీకులతో బస్‌లను అనుమతిస్తామని, ఇద్దరు ప్రయాణీకులతో కార్లను, ఒక ప్రయాణీకుడితో ఆటోలు, ఈ రిక్షాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. సరి-బేసి పద్ధతిలో అన్ని షాపులు తెరుచుకుంటాయని, అన్ని కార్యాలయాలను అనుమతిస్తామని వెల్లడించారు.

US Deportation India: అమెరికాలోకి అక్రమంగా భారతీయుల చొరబాటు, 161 మందిని వెనక్కి తిప్పి పంపిస్తున్న యుఎస్ఏ, అమెరికాలోని 95 జైళ్ల‌లో బందీలుగా 1739 మంది ఇండియన్లు

Hazarath Reddy

అమెరికాలోకి అక్ర‌మంగా చొర‌బ‌డిన 161 మంది భార‌తీయుల‌ను (US Deportations India) వెన‌క్కి పంపిస్తున్నారు. మెక్సికో (Mexico) స‌రిహ‌ద్దు నుంచి వారంతా అమెరికాలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన‌ట్లు తెలుస్తోంది. తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా వారిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారిని ప్రత్యేకమైన విమానం ద్వారా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి (Punjab's Amritsar) పంపించనున్నారు.

COVID19: కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో చైనాను వెనక్కి నెట్టిన భారత్, దేశవ్యాప్తంగా 85,940కు పెరిగిన కోవిడ్-19 బాధితులు, వైరస్ తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రపంచ దేశాలలో 11వ స్థానానికి ఎగబాకిన ఇండియా

Team Latestly

ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ 1,442,819 కేసులు మరియు 87,530 మరణాలతో మొదటి స్థానంలో ఉంది. 262,843 పాజిటివ్ కేసులతో రష్యా 2వ స్థానంలో, ఆ తరువాత స్థానాలలో వరుసగా యునైటెడ్ కింగ్డమ్ (238,004), స్పెయిన్ (230,183)....

Social Protection Package: ఇండియాకు వంద కోట్ల డాల‌ర్ల సాయం ప్రకటించిన ప్రపంచ బ్యాంకు, సోష‌ల్ ప్రొటెక్ష‌న్ ప‌థ‌కం కింద ఆయా దేశాలకు నిధులు, పేదల సంక్షేమానికి నిధుల కేటాయింపు

Hazarath Reddy

ప్ర‌పంచ బ్యాంకు కోవిడ్ 19తో పోరాడుతున్న ఇండియాకు భారీ సాయం ప్రకటన చేసింది. సోష‌ల్ ప్రొటెక్ష‌న్ ప్యాకేజీ కింద భార‌త్‌కు (India) సుమారు వంద కోట్ల డాల‌ర్లు ప్ర‌క‌టించింది. భార‌త ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఈ ప్యాకేజీ లింకై ఉంటుంద‌ని ప్ర‌పంచ బ్యాంకు (World Bank) పేర్కొన్న‌ది. సోష‌ల్ ప్రొటెక్ష‌న్ ప‌థ‌కం (Social Protection Package) కింద ఆయా దేశాల‌కు వ‌ర‌ల్డ్ బ్యాంకు నిధుల‌ను స‌మాకూరుస్తున్న‌ది. దేశంలోని పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

COVID-19 in India: గత 24 గంటల్లో 3,967 కోవిడ్-19 కేసులు, దేశంలో 81 వేలు దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, ఇప్పటివరకు 2,649 మంది మృతి

Hazarath Reddy

దేశంలో కరోనా వైరకోవిడ్ 19 కట్టడికి (COVID-19 in India) కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్‌ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,967 పాజిటివ్ కేసులతో (New COVID-19 Patients) పాటు, వైరస్‌ సోకి 100 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus in India) 81,970కి చేరుకోగా, ఇప్పటి వరకు 2,649 మంది మృత్యువాత పడ్డారు. ఇక వైరస్‌ నుంచి కోలుకుని ఇప్పటివరకు 27,920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 51,401 యాక్టివ్ కేసులు కేసులు ఉన్నాయి.

WHO on COVID-19: హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్ 19 మనతో ఉంటుంది, కలిసి జీవించడం నేర్చుకోవాలి, దేశాల‌న్నీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి, హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) సంచలన వ్యాఖ్యలు చేసింది. నోవల్ క‌రోనా వైర‌స్ (Novel Coronavirus) ఎక్క‌డికీ వెళ్ల‌దని, దాంతో క‌లిసి జీవించ‌డం మ‌నుషులు నేర్చుకోవాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు స్వ‌ల్పంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తున్న నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వో ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. బ‌హుశా క‌రోనా వైర‌స్ శాశ్వ‌తంగా అంతం కాదు అన్న సంకేతాన్ని డ‌బ్ల్యూహెచ్‌వో వినిపించింది. . లాక్‌డౌన్ (Lockdown) ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న దేశాల‌న్నీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ తెలిపారు.

COVID-19: తొమ్మిది రాష్ట్రాల్లో జీరో కేసులు, దేశ వ్యాప్తంగా 78 వేలు దాటిన కరోనా కేసులు, ప్రపంచవ్యాప్తంగా 45 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మృతుల సంఖ్య 3 లక్షలకు చేరువలో..

Hazarath Reddy

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) పెరుగుతూ ఉన్న‌ది. ప్ర‌తిరోజూ వేల‌ల్లో కొత్త కేసులు (coronavirus cases), వంద‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి గురువారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం 24 గంట‌ల వ్య‌ధిలో కొత్త‌గా 3,722 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 78,003కు చేరింది.

Rs 20 Lakh Crore Package: ఎంఎస్‌ఎంఈలకు కొత్త అర్థం,ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు, రూ. 20 కోట్ల ఆర్థిక ప్యాకేజీ పూర్తి వివరాలు ఇవే

Hazarath Reddy

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) నిర్వచనం (New Definition of MSMEs) మారింది.నూతన నిర్వచనం ప్రకారం రూ. కోటి పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 5 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మైక్రో ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదే రూ. 10 కోట్ల పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 50 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది స్మాల్‌ ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదేవిధంగా రూ. 20 కోట్ల పెట్టుబడితో ఉన్న సంస్థ రూ. 100 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మీడియం ఎంటర్‌ప్రైస్‌గా కేంద్ర ఆర్థికమంత్రి (FM Nirmala Sitharaman) పేర్కొన్నారు.

Advertisement

FM Nirmala Sitharaman PC: చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల కేటాయింపు, నగదు లభ్యత పెంచడమే ప్యాకేజీ లక్ష్యం, ఉద్దీపన చర్యల్లో భాగంగా 15 సహాయక చర్యలు

Hazarath Reddy

ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై (Rs. 20 Lakh Crore) పూర్తి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman on Economic Package) ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Coronavirus Count in India: కొంపముంచిన కోయంబేడు, తమిళనాడులో 8 వేలు దాటిన కేసులు, దేశంలో 74 వేలు దాటిన కోవిడ్ 19 కేసులు

Hazarath Reddy

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ (Coronavirus Count in India) కొన‌సాగుతూనే ఉన్న‌ది. రోజురోజుకు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్‌ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) నానాటికీ పెరిగిపోతోంది. కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 3,525 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 122 మంది మృతి చెందారని పేర్కొంది. దేశంలో మొత్తం కేసులు 74281కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 24,386 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, 2415 మంది మృతి చెందారని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 47,480 యాక్టివ్‌ కేసులున్నాయని వెల్లడించింది.

Lockdown 4.0: లాక్‌డౌన్‌ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Hazarath Reddy

కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి (PM Narendra Modi to address the nation) మాట్లాడారు. లాక్‌డౌన్‌ 4వ దశ (Lockdown 4.0) ఉంటుందని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు 18వ తేదీకి ముందే ప్రకటిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా (Coronavirus Pandemic) సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

India COVID-19: దేశంలో 70 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, గత 24 గంటల్లో 3604 కొత్త కేసులు, దేశ వ్యాప్తంగా 2293 మంది కరోనాతో మృతి

Hazarath Reddy

దేశంలో కరోనా తీవ్రత (India COVID-19) రోజురోజుకు పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య (Coronavirus Count in India) 70,756కి పెరిగింది. గత 24 గంటల్లో 3604 కరోనా కేసులు నమోదవగా, కొత్తగా 87 మంది బాధితులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య (Coronavirus Deaths) 2293కి చేరింది. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 22,455 మంది బాధితులు కోలుకోగా, మరో 46,008 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ సగటున రోజుకు 1073 కేసులు నమోదవగా, మే తొలి 11 రోజుల్లో 3409 కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలో రికవరీ రేటు31.15 శాతానికి పెరిగింది.

Advertisement

India Coronavirus: ఇండియాను వణికిస్తున్న 4 రాష్ట్రాలు, తమిళనాడులో 8 వేలు దాటిన కరోనా కేసులు, ముంబైలో 1000 మందికి పైగా పోలీసులకు కోవిడ్-19, గుజరాత్,ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా కల్లోలం

Hazarath Reddy

ప్రస్తుత పరిస్థితి చూస్తే 22,171 కరోనా కేసులతో దేశంలో మహారాష్ట్ర నెం.1స్థానంలో నిలవగా, గుజరాత్‌లో 8,194, తమిళనాడు 7,204 , ఢిల్లీ 6,923 కేసులతో ముందు వరుసలో ఉన్నాయి . అయితే,ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే మరో 7రోజుల్లో దేశంలో కేసుల సంఖ్య లక్షకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మే నెలాఖరులోగా కేసుల పెరుగుదల 2 లక్షలకు చేరుతుందని ఒక అంచనా వేస్తున్నారు.

COVID-19 in India: కరోనాతో 2206 మంది మృతి, దేశ వ్యాప్తంగా 67,152కి చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 44,029 కేసులు, నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

Hazarath Reddy

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (COVID-19 in India) విపరీతంగా పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. నియంత్రణ మాత్రం సాధ్యం కావడంలేదు. దేశంలో కరోనా (2020 Coronavirus Pandemic in India) పాజిటివ్‌ కేసుల సంఖ్య 67,152కి పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 4,200 కరోనా కేసులు నమోదవగా, 97 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2206 మంది మృతిచెందారు. ఈ వైరస్‌ బారిన పడిన 20,916 మంది కోలుకోగా, 44,029 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

UK PM Boris Johnson: బ్రిటన్ ప్రధానికి విడాకులు, మరీనా వీలర్ నుంచి విడాకులు తీసుకున్న బోరిస్ జాన్సన్, సెటిల్మెంట్‌ రూపంలో వీరిద్దరికీ చెరో నాలుగు మిలియన్ పౌండ్లు

Hazarath Reddy

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (British Prime Minister) తన బార్య, భారత సంతతికి చెందిన న్యాయవాది మరీనా వీలర్ నుంచి విడాకులు తీసుకున్నారు. పదవిలో ఉండగానే ఓ ప్రధాని విడాకులు పొందడం గత 250 ఏళ్లలో ఇదే తొలిసారి కావడంతో బోరిస్ (UK PM Johnson) చరిత్రకెక్కారు. ఫిబ్రవరిలోనే మరీనా వీలర్ (Marina Wheeler) విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. స్థానిక ఫ్యామిలీ కోర్టు ఇటీవల వారికి విడాకులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి.. సెటిల్మెంట్‌ రూపంలో వీరిద్దరికీ చెరో నాలుగు మిలియన్ పౌండ్లు లభించనున్నట్టు తెలుస్తోంది.

India Coronavirus: ముంబై సెంట్రల్ జైలులో కరోనా కల్లోలం, 77మంది ఖైదీలకు,26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, దేశ వ్యాప్తంగా 56 వేలు దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

హారాష్ట్రలో (Maharashtra) 18వేలకు చేరువలో కేసులు ఉండగా కేవలం ముంబైలోనే ఈ సంఖ్య 11,300 దాటిపోయింది. అక్కడ ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ముంబైలోని ఆర్డర్ రోడ్ సెంట్రల్ జైలును (Arthur Road Jail) కూడా కరోనా తాకింది. ఈ సెంట్రల్ జైలులో 2800 మంది ఖైదీలు ఉన్నారు. ఒక్కో బారక్ లో 500 మంది వరకు ఖైదీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఓ బ్యారక్ లో ఉండే ఖైదీలలో 77 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, ఆ జైలులో పనిచేస్తున్న సిబ్బందిలో 26 మందికి (Mumbai police personnel) కూడా కరోనా పాజిటివ్ రావ‌డంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

Advertisement

Vande Bharat Mission: వందే భారత్‌ మిషన్ ప్రారంభం, 177 మందితో దేశానికి చేరుకున్న తొలి విమానం, మొత్తం 12 దేశాలకు భారత విమానాలు, రెండు దశల్లో స్వదేశానికి తరలింపు

Hazarath Reddy

లాక్‌డౌన్‌ ( coronavirus Lockdown) కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందే భారత్‌ మిషన్' (Vande Bharat Mission) పేరిట కేంద్రం అతిపెద్ద మిషన్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా మే 7 నుంచి 13 వరకు 64 విమానాల్లో, మూడు యుద్ధ నౌకల్లో 14,800 మందిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. మొత్తం 12 దేశాల నుంచి వారిని తరలించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. కాగా గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న తమను ఇండియాకు (India) తీసుకుపోవాలని 3 లక్షల మంది భారతీయ వలస కార్మికులు (Indian Nationals Abroad) ప్రభుత్వానికి వినతులు చేస్తున్నారు.

China Coronavirus: చైనాలో కరోనా పోలేదు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, సవాళ్లను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి, కీలక వ్యాఖ్యలు చేసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

Hazarath Reddy

కరోనా వైరస్‌ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా (China Coronavirus) అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (China’s President Xi Jinping) దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా‌వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తూనే ఉందని.. కాబట్టి నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.

Global Coronavirus: 2 లక్షల అరవై వేలకు చేరువలో మృతులు, ప్రపంచవ్యాప్తంగా ముఫ్పై ఏడు లక్షలకు పైగా కరోనా కేసులు, యుకెలో 12 లక్షల దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Global Coronavirus) భారీన పడి మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 2,58,974 కు చేరుకున్నాయి. కరోనావైరస్ భారీన పడిన వారి సంఖ్య (Coronavirus Global Roundup) బుధవారం నాటికి 3,667,165 గా ఉంది. రికవరి అయిన వారి సంఖ్య 1,251,032గా ఉంది. యాక్టివ్ గా ఉన్న కేసులు సంఖ్య బుధవారం సాయంత్రానికి 2,237,498గా ఉంది. ఇదిలా ఉంటే ఇటలీకు (Italy) చెందిన వైద్య సంస్థ మానవ కణాలలో కరోనావైరస్ నవలని తటస్తం చేసే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.

'Aggressive Chicken': ఏటీఎం వద్ద మనుషులపై కోడి దాడి, దర్యాప్తు చర్యలు చేపట్టిన వాల్కర్‌ పోలీసులు, అమెరికాలోని లూసియానాలో ఘటన

Hazarath Reddy

అమెరికాలోని ఓ ఏటీఎం వద్దకు వెళ్లిన వారిపై కోడి (Aggressive Chicken) దాడి చేసింది. ఏటీఎం సెంటర్ కు వెళ్లాలనుకునే వారిపై ఈ కోడి దాడి (terrorizing bank customers) చేస్తుండటంతో స్థానికులు భయపడిపోయి వాల్కర్‌ పోలీసులకు‌ (Walker Police) ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోడి కోసం పోలీసులు శోధింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కోడి ఆచూకి తెలపాలంటూ వాల్కర్‌ పోలీసులు శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోం‍ది.

Advertisement
Advertisement