ప్రపంచం

Amazon Layoffs: అమెజాన్ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విచ్ కంపెనీ లే ఆఫ్ ప్రకటన... సుమారు 500 మంది ఉద్యోగులు ఇంటిముఖం..

sajaya

అమెజాన్ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విచ్ ఉద్యోగులను తొలగించనుంది. దీని కారణంగా, సుమారు 500 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవచ్చు, ఇది ట్విచ్ మొత్తం శ్రమ శక్తిలో 35 శాతంతో సమానం. కంపెనీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఇప్పటికే రాజీనామా చేశారు.

Mark Zuckerberg: గొడ్డు మాంసం వ్యాపారంలోకి అడుగుపెట్టిన మార్క్ జుకర్‌బర్గ్, ప్రపంచంలోనే అత్యుత్తమ గొడ్డు మాంసం ఉత్పత్తి చేస్తానని వెల్లడి

Hazarath Reddy

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా యొక్క CEO అయిన మార్క్ జుకర్‌బర్గ్ తన తాజా ప్రాజెక్ట్‌ను ప్రకటించారు, దీనిలో అతను ప్రపంచంలోనే అత్యుత్తమ గొడ్డు మాంసం సిద్ధం చేయాలనుకుంటున్నాడు. జుకర్‌బర్గ్ మంగళవారం తన తాజా ప్రాజెక్ట్ గురించి వివరాలను పంచుకున్నారు.

Nepal Rape Case: అత్యాచారం కేసులో స్టార్ క్రికెటర్‌కి 8 ఏళ్లు జైలు శిక్ష, యువతిపై రేప్ కేసులో సందీప్ లామిచానేను దోషిగా నిర్థారించిన నేపాల్ కోర్టు

Hazarath Reddy

యువతిపై అత్యాచారం కేసులో స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానేకు నేపాల్ కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. శిశిర్ రాజ్ ధాకల్ ధర్మాసనం ఈరోజు విచారణ అనంతరం 8 ఏళ్ల జైలు శిక్షతో పాటు పరిహారం, జరిమానాలతో కూడిన తీర్పును వెలువరించినట్లు కోర్టు అధికారి రాము శర్మ ధృవీకరించారు.

Andaman Islands Earthquake: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు

Hazarath Reddy

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ అధికారులు గుర్తించారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Advertisement

Hafiz Saeed: పాక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్, 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ప్రకటించిన ఐక్యరాజ్యసమితి

VNS

ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ (Hafiz Saeed) పాకిస్థాన్‌లో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడా అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి (UNO). హఫీజ్ సయీద్ ఏడు తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడని యూఎన్ తెలిపింది. 2008వ సంవత్సరంలో హఫీజ్ ను (Hafiz Saeed) అంతర్జాతీయ ఉగ్రవాదిగా యూఎన్ భద్రతా మండలి ప్రకటించింది

Ecuador: వార్తలు చదువుతుండగా లైవ్‌ లోకి గన్స్ తో వచ్చిన దుండగులు, న్యూస్ రీడర్ తలకు గన్ గురిపెట్టి బెదిరింపులు, 15 నిమిషాల పాటూ లైవ్‌ ఇచ్చిన ఛానెల్ (వీడియో ఇదుగోండి)

VNS

టీసీ టీవీ ఛానెల్‌ లైవ్‌ స్టూడియోలోకి (Ecuadorean television station TC) ప్రవేశించి తీవ్ర కలకలం సృష్టించారు. మాస్క్‌లు ధరించి తుపాకులు (Guns), డైనమైట్‌లతో వచ్చిన వీరు.. వార్తలు చదువుతున్న వ్యక్తి సహా అక్కడ ఉన్న ఇతర ఉద్యోగులను బెదిరించారు. వారిని నేలపై కూర్చోబెట్టి తలపై తుపాకీ (Guns) ఎక్కుపెట్టారు.

Imran Khan Floundered: అజయ్ బిసారియా పుస్తకంలో సర్జికల్ స్ట్రయిక్స్ గురించి షాకింగ్ నిజాలు, అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ పంపకుండా ఉండి ఉంటే..

Hazarath Reddy

పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్, ఆ తర్వాత చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Ayodhya Ram Mandir: వీడియోలు ఇవిగో, జై శ్రీరామ్ అంటూ 250 కార్లతో అమెరికాలో ర్యాలీ, 11 దేవాలయాల మీదుగా సాగిన శోభాయాత్ర

Hazarath Reddy

హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హ్యూస్టన్‌లో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ 250 కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 100 మైళ్ల మేర సాగింది. ఈ ర్యాలీని శ్రీ మీనాక్షి ఆలయం దగ్గర ప్రారంభించి, రిచ్‌మండ్‌లోని శ్రీ శారదాంబ ఆలయం వద్ద ముగించారు

Advertisement

India-Maldives Row: భారత్‌తో వివాదం తర్వాత చైనా సాయం కోరిన మాల్దీవుల అధ్యక్షుడు, మీ దేశం నుండి ఎక్కువ మంది పర్యాటకులను పంపాలని విజ్ఞప్తి

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అవమానకరమైన వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం చెలరేగిన నేపథ్యంలో (India-Maldives Diplomatic Row) భారత పర్యాటకులు భారీ సంఖ్యలో తమ రిజర్వేషన్‌లను రద్దు చేసుకున్న సంగతి విదితమే

Japan Earthquake: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం, బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతగా నమోదు

Hazarath Reddy

జపాన్‌ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్‌ జపాన్‌లో 6.0 తీవ్రతతో మంగళవారం భూమి కంపించింది. హోన్షు కోస్ట్‌ (Coast of Honshu) తీరంలో మధ్యాహ్నం 2.29 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

First Gay PM in France: ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా 34 ఏండ్ల గే, ఫ్రాన్స్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం, స్వలింగ సంపర్కుడైన గ్యాబ్రియెల్ అటల్‌ని పీఎంగా నియమించిన ఎమ్మాన్యుయెల్ మాక్రాన్

Hazarath Reddy

ఫ్రాన్స్ ప్రధానిగా 34 ఏండ్ల కుర్రాడు గ్యాబ్రియెల్ అటల్‌ (Gabriel Attal to be Youngest) నియమితుడయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. కాగా కొత్తగా ప్రధానిగా నియమితులైన గ్యాబ్రియెల్ అటల్ ఒక ‘గే’ కావడం (First Gay PM in France) మరో ఆసక్తి కర పరిణామం.

India Plans New Airport in Minicoy: మాల్దీవులకు భారత్ మరో షాక్, లక్షద్వీప్‌ మినీకాయ్ దీవుల్లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు రంగం సిద్ధం

Hazarath Reddy

పర్యాటకం కోసం లక్షద్వీప్ దీవులను ప్రోత్సహించాలని భారత్ చూస్తున్నప్పటికీ, మినీకాయ్ దీవుల్లో వాణిజ్య విమానాలతో పాటు యుద్ధ విమానాలతో సహా మిలిటరీ విమానాలను నడపగలిగేలా కొత్త విమానాశ్రయంను (India Plans New Airport in Minicoy) అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోంది.

Advertisement

‘India Has Been Our 911 Call’: ఎప్పుడూ కాల్ చేసినా మాల్దీవులను రక్షించేది భారత్ మాత్రమే, ఇండియాను 911 కాల్‌తో పోల్చిన మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ

Hazarath Reddy

మాల్దీవుల మంత్రులు భారత ప్రధానిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు మాల్దీవుల ప్రభుత్వానికే చిన్నచూపు అని ఆమె అన్నారు. రక్షణతో సహా వివిధ రంగాలలో సహాయం చేస్తూ భారతదేశం నమ్మకమైన మిత్రదేశంగా ఉందని చెప్పారు.

Earthquake in Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదు

Hazarath Reddy

ఇండోనేషియాలోని (Indonesia) మంగళవారం తెల్లవారుజామున 2.18 గంటలకు తలాడ్‌ దీవుల్లో (Talaud Islands) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది

India-Maldives Row: భారత్ ఎల్లప్పుడూ మాకు మిత్ర దేశమే, ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన MATI

Hazarath Reddy

మాల్దీవుల పర్యాటక పరిశ్రమల సంఘం (MATI) జనవరి 9, మంగళవారం నాడు మాల్దీవుల మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

Alaska Flight Viral News: 16 వేల అడుగుల ఎత్తు నుంచి పడినా.. బాగానే పనిచేస్తున్న ఐఫోన్‌

Rudra

అమెరికాలోని పోర్ట్‌ ల్యాండ్‌ నుంచి ఒంటారియో వెళ్తున్న క్రమంలో దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో అలస్కా ఎయిర్‌ లైన్స్‌ విమానం డోర్‌ ఊడిపోయిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.

Advertisement

TS Youth Dies in US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత.. మృతుడిని ఖమ్మం జిల్లా వాసి సాయిరాజీవ్‌ రెడ్డిగా గుర్తింపు

Rudra

అమెరికాలోని టెక్సాస్‌ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో సాయి తీవ్ర గాయాలపాలయ్యాడు.

Pakistan Internet Shutdown: పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్ సర్వీసులకు తీవ్ర అంతరాయం .. సమస్య పరిష్కారానికి అధికారుల తీవ్ర యత్నాలు

Rudra

పాకిస్తాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమస్య ఏమిటి? ఎలా పరిష్కరించాలి? అనే దానిపై అధికారులు తీవ్ర యత్నాలు చేస్తున్నారు.

Bangladesh Elections: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన హసీనా

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రధాన మంత్రి షేక్ హసీనాతో మాట్లాడాను. పార్లమెంటరీ ఎన్నికల్లో చారిత్రాత్మకంగా వరుసగా నాలుగోసారి విజయం సాధించినందుకు ఆమెను అభినందించానని అన్నారు.

India-Maldives Row: ప్రధాని మోదీపై ఆ ముగ్గురు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని భారత్‌కు స్పష్టం చేసిన మాల్దీవుల సర్కారు

Hazarath Reddy

మాల్దీవులు ప్రభుత్వ కేబినెట్‌లోని కొంతమంది సభ్యులు ఇటీవల ప్రధాని మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు (India-Maldives Row) ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని (Does not represent govt’s view) మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం భారత రాయబారికి స్పష్టం చేసింది.

Advertisement
Advertisement