ప్రపంచం

Bangladesh Election 2024 Result: బంగ్లాదేశ్ ప్రధాని పీఠంపై 5వ సారి షేక్‌ హసీనా, సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన అవామీ లీగ్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 300 స్థానాలకు గాను ఇప్పటికే 200 చోట్ల నెగ్గి అధికార అవామీ లీగ్‌ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది.ప్రధానిగా షేక్‌ హసీనా వరుసగా నాలుగోసారి పగ్గాలు చేపట్టనున్నారు. మొత్తంగా 5వ సారి అధికార పీఠం ఎక్కనున్నారు.

Shakib Slaps Fan Video: వీడియో ఇదిగో, అభిమాని చెంప పగలగొట్టిన బంగ్లా క్రికెట్ జట్టు కెప్టెన్, లక్షా యాభై వేల మెజారిటీతో మగుర-1 నియోజకవర్గం నుంచి గెలిచిన షకిబ్‌ అల్‌ హసన్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ సాధారణ ఎన్నికలలో పోటీచేసి అధికార అవామీ లీగ్‌ పార్టీ తరఫున గెలిచిన ఆ దేశ క్రికెట్‌ జట్టు సారథి షకిబ్‌ అల్‌ హసన్‌ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తలలో నిలిచాడు. ఎన్నికల సందర్భంగా ఓ పోలింగ్‌ బూత్‌ పరిశీలనకు వెళ్లిన షకిబ్‌.. అభిమాని చెంప చెల్లుమనిపించాడు

PM Modi Lakshadweep Island Visit: ప్రధాని మోదీ విజిట్ తర్వాత ట్రెండింగ్‌లోకి వచ్చిన లక్షద్వీప్, ఆ కీ వర్డ్‌ని గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సందర్శించి, సుందరమైన ద్వీపసమూహంలోని కొన్ని ఫోటోలను షేర్ చేసిన తర్వాత వరుసగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో లక్షద్వీప్ కీవర్డ్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా, లక్షద్వీప్ కోసం గూగుల్ సెర్చ్‌లు గత 20 ఏళ్లలో అత్యధికంగా ఉన్నాయి, అయితే ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఈ కీవర్డ్ పీక్ స్టేజీకి వెళ్లిపోయింది.

Maldives vs India: భారత్‌కు క్షమాపణలు, మాల్దీవులను మీరు బహిష్కరిస్తే మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, ఆందోళన వ్యక్తం చేసిన మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్

Hazarath Reddy

ఈ వివాదంపై మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్ (Ex-Maldives minister Ahmed Mahloof) స్పందించారు. మాల్దీవులను పర్యాటక కేంద్రంగా భారతీయులు బహిష్కరిస్తే (Indians boycotting Maldives), అది ద్వీప దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహలూఫ్ ఆదివారం అన్నారు

Advertisement

Maldives vs India: ప్రధాని మోదీ జోకర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు, మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు, వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

#ChaloLakshadweep: ముగ్గురు మంత్రుల వ్యాఖ్యల ఎఫెక్ట్, మాల్దీవులకు ఫ్లైట్‌ బుకింగ్స్‌ నిలిపివేసిన ఈజ్‌మైట్రిప్‌, చలో లక్షద్వీప్ అంటూ హ్యాష్ ట్యాగ్

Hazarath Reddy

దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్‌(EaseMyTrip) ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్‌ నిలిపివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు పెట్టారు.దానికి చలో లక్షద్వీప్‌(Chalo Lakshadweep) హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. నిషాంత్‌ పిట్టి, రికాంత్‌ పిట్టి, ప్రశాంత్‌ పిట్టి దీనిని 2008లో స్థాపించారు.

Maldives vs India: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై దుమారం, ముగ్గురుని మంత్రి పదవుల నుండి సస్పెండ్ చేసిన అక్కడి ప్రభుత్వం

Hazarath Reddy

ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా లక్షద్వీప్ ను పర్యాటకధామంగా మారుద్దామని ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు.

Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిగా ఐదోసారి ఎన్నికైన షేక్ హసీనా.. ఎన్నికల సంఘం వెల్లడి

Rudra

బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా మరోసారి ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో ఐదవసారి, వరుసగా నాలుగవసారి ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది.

Advertisement

Fake News: లక్ష్యద్వీప్ వర్సెస్ మాల్దీవులు అంటూ ట్విట్టర్ లో వార్, మాల్దీవ్స్ ముగ్గురు మంత్రులపై వేటు అంటూ వార్తలు, అదంతా పుకార్లేనని కొట్టిపారేసిన డిప్యూటీ మినిస్టర్

VNS

ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ముగ్గురు మంత్రులను తొలగించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే మంత్రుల తొలగింపు ఫేక్ న్యూస్ అంటూ మాల్దీవ్స్ డిప్యూటీ మినిస్టర్ స్పష్టం చేశారు. ఆ వార్తలను కొట్టిపారేశారు.

New Beaches in Japan: భూకంపంతో జపాన్‌ లో కొత్త బీచ్‌లు.. 820 అడుగుల మేర విస్తరించిన తీరం

Rudra

జపాన్‌ లో గతవారం ఏర్పడిన భారీ భూకంపం నోటో ద్వీపకల్పంలో కొత్త బీచ్‌ లను ఏర్పాటు చేసింది. భూకంపం తీరం వెంబడి భూమిని పెంచింది.

Power Generation from Volcano: అగ్ని పర్వతాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి.. అమెరికన్‌ కంపెనీ కొత్త ప్రయోగం

Rudra

అగ్ని పర్వతంలోని లావా నుంచి జనించిన నీటి ఆవిరి అధిక పీడన శక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని క్వాయిన్‌ ఎనర్జీ అనే అమెరికన్‌ స్టార్టప్‌ కంపెనీ చెప్తున్నది.

Japan Earthquake: జపాన్ భూకంపంలో 100కు పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా చిక్కని గల్లంతైన 211 మంది ఆచూకీ, కొనసాగుతున్న సహాయక చర్యలు

Hazarath Reddy

జపాన్‌ దేశాన్ని గంటల వ్యవధిలో 155 కంటే ఎక్కువ సార్లు రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతో భూప్రకంపనలు వణికించిన సంగతి విదితమే. నోటో ద్వీప‌క‌ల్పంలో 7.6 తీవ్రత‌తో వచ్చిన భూకంపం వ‌ల్ల పెను న‌ష్టమే వాటిల్లింది. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 100కి పెరిగింది.

Advertisement

‘Bharat Mata ki Jai’: హైజాక్ అయిన ఓడలో చిక్కుకుపోయిన 15 మంది భారతీయులను రక్షించిన ఇండియన్ నేవీ కమాండోలు, భారత్ మాతా కీ జై అంటూ ఆనందంతో వారు నినాదాలు చేసిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారతీయ సిబ్బందితో కూడిన ఓడ సోమాలియా తీరంలో హైజాక్ కు గురైన సంగతి విదితమే.హైజాక్ చేయబడిన ఓడ 'MV LILA NORFOLK' షిప్‌లో 15 మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఇండియన్ నేవీ మెరైన్ కమాండోలు పదిహేను మంది భారతీయులతో సహా హైజాక్ చేయబడిన ఓడ MV లీలా నార్ఫోక్‌లోని సిబ్బందిలోని ప్రతి సభ్యుడిని రక్షించారు.

Anti-Piracy Operation: భారతీయులు ప్రపంచంలో ఏ మూల ఆపదలో చిక్కుకున్నా కాపాడటం మా కర్తవ్యం, యాంటీ పైరసీ ఆపరేషన్‌పై ఇండియన్ నేవీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

వారు ఎక్కడ ఉన్నా మన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడం మా కర్తవ్యం. ఇది భారతీయ జెండాతో కూడిన ఓడ కాదు, అయినా సిబ్బంది భారతీయులే వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం మా జాతీయ విధానం. సుడాన్, ఉక్రెయిన్‌లలో కూడా మేము అదే చేసాము.

Alaska Airlines: విమానం డోర్ ఊడిన ఘటన, బోయింగ్‌ విమానాల సేవల్ని నిలిపివేసిన అలస్కా ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్టులకే పరిమితమైన 65 విమానాలు

Hazarath Reddy

ఘటన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్(Alaska Airlines) కీలక నిర్ణయం తీసుకుంది. బోయింగ్‌ 737-9 విమానాల సేవల్ని నిలిపివేసింది. దీంతో సంస్థలోని ఈ మోడల్‌కు చెందిన 65 విమానాలు(Boeing 737-9 Fleet) ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ఈ మేరకు అలస్కా ఎయిర్‌లైన్స్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

Alaska Airlines Emergency Landing: వీడియో ఇదిగో, ఆకాశంలో ఉండగా ఊడిపడిన విమానం అత్యవసర కిటికీ డోర్, అత్యవసరంగా ల్యాండ్ అయిన బోయింగ్ విమానం

Hazarath Reddy

అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని డోర్ ఊడిపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిటికీ డోర్ ఊడిపోవడంతో టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా దిగింది. 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Advertisement

Alaska Airlines Incident: అన్ని బోయింగ్ 737–8 మాక్స్ విమానాల డోర్లు వెంటనే తనిఖీ చేయండి, విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ

Hazarath Reddy

ఈ ఘటన నేపథ్యంలో తమ ఫ్లీట్‌లోని బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాల అత్యవసర నిష్క్రమణ ద్వారాల డోర్లు తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ విమానయాన సంస్థలను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ శనివారం ఆదేశించింది.

Christian Oliver No more: సముద్రంలో కూలిన విమానం.. ఇద్దరు కూతుళ్లతో సహా హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ దుర్మరణం

Rudra

హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ గురువారం విమాన ప్రమాదంలో మృతి చెందారు. తన ఇద్దరు కూతుళ్లతో (10, 12 ఏళ్ల వయసున్న బాలికలు) కలిసి ఆయన ప్రయాణిస్తున్న విమానం కరీబియన్ సముద్రంలో కూలడంతో అందరూ మరణించారు.

Bangla Train Accident: బంగ్లాదేశ్‌ లో విషాదం.. ప్యాసింజర్ రైలులో మంటలు.. ఐదుగురి సజీవదహనం (వీడియోతో)

Rudra

పొరుగు దేశం బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోరం జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

JN.1 Scare: JN.1 వేరియంట్ భవిష్యత్‌లో చాలా డేంజర్‌గా మారబోతుందని ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు, దీని నుంచి అనేక ఉపవేరియంట్లు పుట్టుకొస్తాయంటూ..

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న ఓమిక్రాన్ వంశం నుండి పుట్టుకొచ్చిన సరికొత్త కోవిడ్-19 వేరియంట్ JN.1పై నిపుణులు మరింత ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించారు.ఈ కోవిడ్ కొత్త వేరియంట్ 'చాలా తీవ్రమైన పరిణామాన్ని' సూచిస్తుందని ప్రపంచ నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement