World
Terror Attack in Pakistan: పాకిస్తాన్‌ ఆర్మీ కార్యాలయంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి, 23 మంది సైనికులు మృతి, మరో 30 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్‌లో తాలిబన్‌ ఉగ్రమూకలు మరోసారి రెచ్చిపోయాయి. పాక్ ఆర్మీ పోస్టుపై వెంటవెంటనే జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 23 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటన ఖైబర్‌ పంక్తున్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ జిల్లాలో చోటుచేసుకుంది.
Monkeypox in Japan: మంకీపాక్స్ డేంజర్ బెల్స్, వైరస్‌తో 30 ఏళ్ల వ్యక్తి మృతి, ఇదే తొలి మరణం అని తెలిపిన జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ
Hazarath Reddyజపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం నాడు పాక్స్ నుండి దేశంలో మొదటి మరణాన్ని నివేదించింది. రోగి తన 30 ఏళ్లలో హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌తో ఉన్న వ్యక్తి అని అతనికి ప్రయాణ చరిత్ర లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. Mpox అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇది దగ్గరి పరిచయం ద్వారా వ్యాపిస్తుంది
Water Reservoir Found in Space: అంతరిక్షంలో భారీ వాటర్‌ రిజర్వాయర్‌‌, ప్రపంచంలోని మహాసముద్రాల కంటే అతి పెద్దదని తేల్చి చెప్పిన పరిశోధకులు
Hazarath Reddyఅంతరిక్షంలో నీటిజాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. పరిశోధకులు విశ్వంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్‌ను కనుగొన్నారు, కానీ అది మన గ్రహం మీద లేదు. ఇది అంతరిక్షంలో తేలియాడుతున్నట్లు సమాచారం
Best Cities in India 2023 List: ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా వియన్నా నగరం, 153వ స్థానంలో హైదరాబాద్‌, 154వ స్థానంలో పూణె, 156వ స్థానంలో బెంగళూరు
Hazarath Reddy2023 సంవత్సరానికిగానూ మెర్సెర్ యొక్క ప్రపంచవ్యాప్త జీవన నాణ్యత ర్యాంకింగ్‌లో భారతీయ నగరాల్లో 153వ ర్యాంక్‌తో హైదరాబాద్‌, 154వ స్థానంలో పూణె, 156వ స్థానంలో బెంగళూరు నిలిచాయి. ఈ జాబితాలో ఆస్ట్రియాలోని వియన్నా అగ్రస్థానంలో ఉంది.
Earthquake in Afghanistan: ఆఫ్ఘానిస్థాన్‌‌లో మళ్లీ భారీ భూకంపం, ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు
Hazarath Reddyఆప్ఘానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘానిస్థాన్‌ (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake)తో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటల సమయంలో బలమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.
Half-Eaten Human Body Found in Pak Zoo: పాక్ జూలోని పులి నోట్లో షూ.. తీరా ఏంటా అని చూస్తే, పక్కనే సగం ఆహారమైన మనిషి.. అసలేం జరిగింది??
Rudraపాకిస్థాన్‌ లోని బహవల్‌పూర్‌ జూలో ఘోరం జరిగింది. బోనులో ఉన్న పులి నోట్లో ఓ షూ కనిపించడం, పక్కనే సగం తిన్న మనిషి మృతదేహం కనిపించం కలకలం రేపింది.
Israel-Hamas War: వీడియో ఇదిగో, యుద్దంలో పట్టుబడిన పాలస్తీనీయుల బట్టలూడదీసి అర్థ నగ్నంగా ఊరేగించిన ఇజ్రాయెల్‌ బలగాలు
Hazarath Reddyహమాస్‌ మిలిటెంట్లకు ఇజ్రాయెల్‌ బలగాలకు మధ్య యుద్ధంతో పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ఈ యుద్ధంలో పట్టుబడ్డ పాలస్తీనీయుల పట్ల ఇజ్రాయెల్‌ బలగాలు దారుణంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి
100 Day Cough: యూకేను క‌ల‌వ‌ర‌పెడుతున్న కొత్త మ‌హ‌మ్మారి, ద‌గ్గుతో డేంజ‌ర్ లో ప‌డుతున్న ప్ర‌జ‌లు, 100 రోజుల ద‌గ్గుతో జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిస్తున్న ఆరోగ్య నిపుణులు
VNSయూకేని ‘100 రోజుల దగ్గు’ (100 Day Cough) వణికిస్తోంది. కోరింత దగ్గు రకానికి చెందిన ఈ దగ్గు మూడునెలల పాటు కొనసాగుతోంది. జలుబుతో మొదలయ్యే ఈ దగ్గుని తేలికగా తీసుకోవద్దని.. తప్పనిసరిగా మాస్కులు వాడమని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. యూకేని (UK) ఇప్పుడు కోరింత దగ్గు చాలా ఇబ్బంది పెడుతోంది.
PM Modi Most Popular World Leader: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీ కొత్త రికార్డు, రెండవ స్థానంలో మెక్సికో అధ్యక్షుడు
Hazarath Reddyమార్నింగ్ కన్సల్ట్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 76% ఆమోదం రేటింగ్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుడుగా గుర్తింపు పొందారు. ఈ జాబితాలో మెక్సికో అధ్యక్షుడు 66 శాతం రేటింగ్ తో రెండవ స్థానంలో ఉండగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు 58 శాతంతో మూడవ స్థానంలో ఉన్నాడు. నాలుగవ స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు, అయిదవ స్థానంలో ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఉన్నారు.
Russia Presidential Election 2024: మార్చి 17న రష్యా అధ్యక్ష ఎన్నికలు, వరుసగా ఐదోసారి పుతిన్ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు, ప్రత్యర్థులంతా జైళ్లో, విదేశాళ్లో ఉండటమే కారణం
Hazarath Reddyరష్యా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారైంది. 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువ సభ ఫెడరేషన్‌ కౌన్సిల్‌ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.దీంతో, అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమయినట్లేనని స్పీకర్‌ వలెంటినా మట్వియెంకో ప్రకటించారు
403 Indian Students Died in Foreign Countries: విదేశాలకు చదువుల కోసం వెళ్ళిన 403 మంది విద్యార్థులు మృతి, అత్యధికంగా కెనడాలో 91 మంది మృతి
Hazarath Reddyగత కొన్నేళ్లేగా విదేశాల్లో (foreign countries) చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది భారతీయ విద్యార్థులు (Indian students) అక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2018 నుంచి ఇప్పటివరకు 400 మందికి పైనే విద్యార్థులు విదేశాల్లో మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇందులో అత్యధిక మరణాలు కెనడా (Canada)లోనే చోటుచేసుకున్నట్లు తెలిపింది.
UK Shocker: పార్కులో బెర్రీ పండ్లు తిన్న 14 ఏళ్ల బాలుడు, వెంటనే అపస్మారక స్థితికి చేరుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Hazarath Reddyది ఇండిపెండెంట్ ప్రకారం, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్ ప్రాంతంలో తన తండ్రితో కలిసి పార్క్‌లో షికారు చేస్తున్నప్పుడు కనుగొన్న విషపూరిత బెర్రీలు తిని 14 ఏళ్ల బాలుడు మరణించాడు. సమీపంలోని పార్కులో తండ్రితో పాటు రోజూ వ్యాయామానికి వెళుతున్న బాలుడు రోజూ ఓ చెట్టు దగ్గర ఆడుకునే వాడు.
Japan: షాకింగ్ వీడియో ఇదిగో, ఒడ్డుకు కొట్టుకువచ్చిన వేలాది మృతి చెందిన చేపలు, మరో భూకంప సంకేతంగా భావిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyఉత్తర జపాన్ తీరంలో వేల సంఖ్యలో చనిపోయిన చేపలు తీరానికి కొట్టుకువచ్చాయి. ప్రాణం లేని చేపలు ఒడ్డుకు కొట్టుకుపోతున్నట్లు చూపించే వీడియో X, గతంలో ట్విట్టర్‌లో కనిపించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు స్పందించారు
Las Vegas Firing: అమెరికాలో మ‌ళ్లీ పేలిన తూటా, యూనివ‌ర్సిటీలోకి చొర‌బడి విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన దుండ‌గుడు, ముగ్గురు మృతి, నిందితుడు ఆత్మ‌హ‌త్య‌?
VNSకాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై స్పష్టత రాలేదు. కాల్పుల ఘటన అనంతరం యూనివర్శిటీని పోలీసులు ఖాళీ చేయించారు. బ్యాక్‌ప్యాక్‌లతో ఉన్న పలువురు విద్యార్థులను పోలీసులు క్యాంపస్ వెలుపలికి తీసుకెళ్లడం కనిపించింది.
Kim Jong Un Crying Video: జనాభా తగ్గిపోతోంది, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా నియంత కిమ్, వీడియో ఇదిగో...
Hazarath Reddyదేశంలో జననాల రేటు దారుణంగా పడిపోతోందని దయచేసి మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు.కాగా ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది.
Indonesia Volcano Eruption: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం, 22కు పెరిగిన మృతుల సంఖ్య
Hazarath Reddyఇండోనేషియా (Indonesia)లోని పశ్చిమ ప్రాంతంలో సుమత్రా (Sumatra) దీవిలో మౌంట్‌ మరపి (Mount Merapi)లో ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది
Thailand Bus Accident: అతివేగంతో అర్థరాత్రి చెట్టును ఢీకొట్టి రెండు ముక్కలైన బస్సు, 14 మంది అక్కడికక్కడే మృతి, మరో 24 మందికి గాయాలు
Hazarath Reddyథాయ్ లాండ్ లో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం రెండుగా చీలిపోయింది. కొంత భాగం నుజ్జునుజ్జుగా మారిపోయింది.
Govt To Ban 100 Chinese Websites: చైనాకు మరో షాకిచ్చిన భారత్, భారతీయులను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్న 100కి పైగా చైనా వెబ్‌సైట్‌లపై నిషేధం
Hazarath Reddyభారతీయులను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడులకు సంబంధించిన మోసాలకు పాల్పడుతున్న 100కి పైగా చైనా వెబ్‌సైట్‌లను నిషేధించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. చైనా నిర్వహించే ఆర్థిక మోసాలపై తాజా అణిచివేతగా ఈ చర్య వచ్చింది.
Tanzania Floods: భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చరియలు, 47 మంది మృతి, మరో 85 మందికి తీవ్ర గాయాలు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
Hazarath Reddyగత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తూర్పు ఆఫ్రికా ( East African) దేశమైన టాంజానియా (Tanzania) విలవిలలాడుతోంది. శనివారం ఉత్తర టాంజానియాలో కురిసిన వర్షానికి వరదలు (Flooding) సంభవించాయి. రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటేష్‌ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది.
Indonesia Volcano Eruption: వీడియో ఇదిగో, బద్దలైన అగ్నిపర్వతం, 11 మంది సజీవ దహనం, మరో 12 మంది ఆచూకి గల్లంతు
Hazarath Reddyఇండోనేషియా (Indonesia)లోని పశ్చిమ ప్రాంతంలో సుమత్రా (Sumatra) దీవిలో మౌంట్‌ మరపి (Mount Merapi)లో ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు.