World
Execution In Ramadan Holy Month: పవిత్ర రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా.. మానవ హక్కుల సంఘాల ఆగ్రహం.. ఓ వ్యక్తిని కత్తితో పొడిచి దహనం చేసిన కేసులో దోషికి మరణశిక్ష.. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 మందికి మరణశిక్ష అమలు
Rudraముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఓ వ్యక్తికి మరణశిక్షను అమలు చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన ఈ ఘటనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఎప్పుడూ జరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Italy Govt Wants to Ban English: ఇంగ్లీష్ బ్యాన్ చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన ఇటలీ, దీని ప్రకారం ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే రూ. 82 లక్షల వరకు జరిమానా
Hazarath Reddyఇటాలీ ప్రధాన మంత్రి, బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఆంగ్ల భాషను పూర్తిగా బ్యాన్‌ చేసే ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొచ్చారు.ఆ చట్టం ప్రకారం ఏ ఇటాలియన్‌ అయినా కమ్యూనికేట్‌ చేసేటప్పుడూ .. విదేశీ పదాలను ఉపయోగిస్తే దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది.
PIB Fact Check: 2025 నాటికి బంగ్లాదేశ్ కన్నా ఘోరమైన స్థితిలోకి భారత్, నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్, ఇది ఫేక్ అని తెలిపిన PIB
Hazarath Reddy2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదరికంలో ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న దేశం కాదని సోషల్ మీడియాలో ఒక వాదన వైరల్ అవుతోంది. అయితే, IMF యొక్క తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో ప్రచురించబడిన నివేదిక నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పేర్కొంది.
Hijab Row: వీడియో ఇదిగో, హిజాబ్ ధరించలేదని మహిళల తలపై పెరుగు పోసిన యువకుడు, నిందితుడుతో పాటు మహిళలిద్దర్నీ అరెస్ట్ చేసిన ఇరాన్ పోలీసులు
Hazarath Reddyఇరాన్‌ మహిళలు (Iranian Women ) తప్పనిసరిగా హిజాబ్‌ (Hijab) ధరించాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది.దీనిని పాటించని వారిపై కఠిన చర్యలు చేపడుతున్నది.తాజాగా ఇద్దరు మహిళలు హిజాబ్‌ ధరించకుండా ఒక షాప్‌ వద్దకు వెళ్లగా.. అక్కడ ఉన్న యువకుడు ఆగ్రహంతో ఆ షాప్‌లోని ర్యాక్‌లో ఉన్న పెద్ద పెరుగు కప్‌ను తీసుకుని ఆ మహిళల తలపై పోశాడు.
Puffer Fish: ఈ చేపల కూర తినకండి, విషపూరితమైన పఫర్‌ చేప కూర తిని మహిళ మృతి, కోమాలో ఆమె భర్త, మలేషియాలో విషాదకర ఘటన
Hazarath Reddyమలేషియాలో విషపూరితమైన చేప కూరను తిని ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్త ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
McDonald’s Layoffs: అమెరికాలోని తమ కార్పొరేట్ కార్యాలయాలను ఈ వారం మూసేస్తున్నట్టు మెక్ డొనాల్డ్స్ ప్రకటన.. ఉద్యోగులను తీసివేయడంలో ఇది ముందస్తు వ్యూహమని అనుమానాలు
Rudraటెక్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత.. ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీలకు కూడా పాకింది. అమెరికాలోని తమ కార్పొరేట్ కార్యాలయాలను ఈ వారం మూసేస్తున్నట్టు మెక్ డొనాల్డ్స్ ప్రకటించింది. ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది.
COVID in India: భారత్‌ని వణికిస్తున్న XBB.1.16 వేరియంట్, మరణాలకు, కేసుల పెరుగుదలకే కారణం ఇదేనని నిర్థారించిన WHO, దేశంలో కొత్తగా 3,823 కేసులు
Hazarath Reddyదేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు వందల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4వేలకు చొరవైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,823 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.
USA Tornadoes: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 21 మంది మృతి.. టోర్నడో ప్రభావానికి గురైన 50 మిలియన్ల మంది.. బొమ్మల్లా ఎగిరిపోయిన కార్లు, కుప్పకూలిన భవనాలు
Rudraదక్షిణ మధ్య, తూర్పు అమెరికాలో టోర్నడో బీభత్సానికి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. టోర్నడో కారణంగా బలమైన సుడి గాలులు వీస్తూ, భారీ వర్షాలు కురుస్తూ పట్టణాలు, నగరాలను ముంచెత్తుతున్నాయి.
Salim Durani Passes Away: మాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూత.. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి
Rudraమాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూశారు. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మరణించారు. ఆయన మృతితో క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Pope Francis: ‘మీకు తెలుసా?.. నేనింకా బతికే ఉన్నాను’.. బ్రాంకైటిస్ సమస్యతో ఆసుపత్రిలో చేరి.. కోలుకున్న తర్వాత పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్య
Rudraసనాళాల (బ్రాంకైటిస్) సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ చికిత్స అనంతరం నిన్న వాటికన్ సిటీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీకు తెలుసా?.. నేనింకా బతికే ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు.
Italy Bans ChatGPT: చాట్ జీపీటీని నిషేధించిన ఇటలీ.. డేటా నియమాల ఉల్లంఘన కేసు నేపథ్యంలో నిర్ణయం.. ఇప్పటికే నిషేధించిన రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్
Rudraకృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ఆధారంగా తయారుచేసిన చాట్ జీపీటీ ప్రపంచ టెక్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. అయితే, అనేక దేశాలు ఆ చాట్ బాట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చాట్ జీపీటీని రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ నిషేధించగా... ఇప్పుడా దేశాల బాటలో ఇటలీ కూడా నడిచింది.
Kentucky Helicopter Crash: ఘోర ప్రమాదం, అమెరికాలో రెండు హెలికాప్టర్లు ఢీ, 9 మంది మృతి చెందినట్లుగా వార్తలు, ప్ర‌మాదం ప‌ట్ల ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ అధికారులు
Hazarath Reddyఅమెరికాలోని కెంట‌కీ(kentuky)లోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ మిలిట‌రీ బేస్‌లో రెండు ఆర్మీ హెలికాప్ట‌ర్లు(army helicopters) ఢీకొని కూలిన‌ ఘ‌ట‌న‌లో ప‌లువురు మృతిచెందారు. రెండు బ్లాక్‌హాక్(blackhawk) హెలికాప్ట‌ర్లు కూలిన‌ ఘ‌ట‌న‌లో క‌నీసం 9 మంది మృతిచెంది ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.
Pope Francis Health Update: శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరి పోప్ ఫ్రాన్సిస్, ప్రస్తుతం నిలకడగా ఆయన ఆరోగ్యం, కరోనా లేదని తెలిపిన వైద్యులు
Hazarath Reddyపోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గతకొంతకాలంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆయన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో (respiratory infection) ఆస్పత్రిలో చేరారు. దీంతో రోమ్‌లోని వైద్యాలయంలో (Rome hospital) ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Philippines Ferry Fire: పసిఫిక్‌ మహాసముద్రంలో ఘోర అగ్ని ప్రమాదం, నౌకలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, 10 మంది మృతి, 230 మందికి తీవ్రగాయాలు
Hazarath Reddyఫిలిప్పీన్స్‌ దేశంలోని పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 31 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌ సముద్రంలో సహాయక చర్యలు చేపట్టింది.
Modi Surname Remark: దొంగలందరికీ మోదీ ఇంటిపేరు దుమారం, రాహుల్ గాంధీపై బ్రిటన్ కోర్టులో దావా వేస్తానని లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyదొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎలా వచ్చిందంటూ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఐపీఎల్ వ్యవస్థాపకుడు, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు.
Bird Flu in Human: ప్రపంచంలో మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు, చిలీలో గుర్తించిన అధికారులు, తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలతో ఆస్పత్రికి..
Hazarath Reddyప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగు చూసింది. చిలీ దేశంలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ తొలి కేసును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 53 ఏళ్ల వ్యక్తిలో తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలు కనిపించాయని, పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలిందని చిలీ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
Pakistan: తినడానికి తిండి లేక అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రజలు, గోధుమ పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో మహిళ సహా 11 మంది మృత్యువాత
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్‌‌‌లో తినడానికి తిండి లేక పాకిస్తాన్‌ ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ సహా 11 మంది మృత్యువాతపడ్డారు.
Pak Govt. Twitter Account Blocked: పాకిస్థాన్‌కు షాక్‌ ఇచ్చిన ట్విట్టర్, పాక్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేస్తూ నిర్ణయం, కేవలం భారత్‌లో మాత్రమే నిషేదం
VNSపాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా (Twitter Account) ను భారత‌దేశంలో చూసేందుకు వీలుండదు. ఆ ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనంగా పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా భారతదేశంలో నిషేధించబడినట్లు తెలుస్తోంది.
Pakistan Crisis: పిండి ఫ్రీగా ఇస్తున్నారంటూ ఎగబడ్డ జనం, తొక్కిసలాటలో 11 మంది మృతి, పాకిస్థాన్‌లో దయనీయంగా మారిన పరిస్థితులు
VNSపంజాబ్‌ ప్రావిన్స్‌లో (Punjab province) ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని (Free Flour) తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. అదికాస్తా తొక్కిసలాటకు దారితీయడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.