Congo Floods (Photo-Twitter)

ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో వరదలు (floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి. వరదలకు తోడు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దక్షిణ కివు ప్రావిన్స్ భారీ వరదలకు అల్లాడుతోంది. ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్‌ (South Kivu province) తియో గ్వాబిజే కాసీ (Theo Ngwabidje Kasi) వెల్లడించారు.

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌, అవినీతి అరోపణలపై కోర్టులో అదుపులోకి తీసుకున్న పాక్ పారామిలటరీ బలగాలు

వందలమంది గల్లంతయ్యారని తెలిపారు. కివు లోయలో బురదలో మృతదేహాలు కూరుకుపోయినట్లు చెప్పారు. మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Here's Videos

ఈ వరదల్లో సుమారు 1200 ఇళ్లు పూర్తిగా శిథిలమైనట్లు అధికారులు వెల్లడించారు. 2014లో ఇలాంటి ప్రకృతి విపత్తే సంభవించినట్లు తెలిపారు.