Pennsylvania, April 27: హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే దీపావళి (Diwali) పండుగకు అంతర్జాతీయంగా కూడా ఆదరణ లభిస్తోంది. పలు దేశాల్లో లక్షలాదిగా సెటిలైన భారతీయుల కోసం అక్కడి ప్రభుత్వాలు సెలవులు (Diwali Declared As National Holiday) కూడా ప్రకటిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లో లక్షలాదిగా ఉన్న భారతీయులు దీపావళిని ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించుకుంటారు. వైట్ హౌజ్‌లోనూ (White house) ఈ వేడుకలను నిర్వహిస్తారు. అయితే దీపావళి పండుగ రోజు సెలవు ప్రకటించింది అమెరికాలోని పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రం. దీపావళి రోజున సెలవు ఇవ్వాలనే బిల్లును సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని సెనేటర్ నికిల్ సవాల్ ట్వీట్ చేశారు. దీపావళిని జరుపుకునే పెన్సిల్వేనియా ప్రజల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీపావళి ప్రభుత్వ సెలవు దీపావళిని సెలవుగా ప్రకటించినందుకు సెనేటర్ నికిల్ సవాల్ కు సెనేటర్ రోత్‌మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లును ఆమోదించడంలో సెనేటర్ రోత్‌మన్‌తో కలిసి పనిచేయడం తాను గౌరవంగా భావిస్తున్నాను అని ఆయన అన్నారు.
Diwali Declared As National Holiday in US State Pennsylvania #Diwali #Pennsylvania https://t.co/fJ7Mqr1upq
— LatestLY (@latestly) April 27, 2023
పెన్సిల్వేనియాలో (Pennsylvania) దాదాపు రెండు లక్షల మంది దక్షిణాసియా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది దీపావళి పండుగను వైభవంగా జరుపుకుంటారు. అదే సమయంలో, పెన్సిల్వేనియాలో దీపావళిని రాష్ట్ర సెలవుదినాన్ని గుర్తించే బిల్లును సెనేట్ 50-0 ఓట్ల తేడాతో ఆమోదించిందని రోత్‌మన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి సందర్భంగా పెన్సిల్వేనియాలోనూ సెలవు ప్రకటించనున్నారు.
ఇప్పటికే న్యూయార్క్ కూడా దీపావళి రోజున సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెన్సిల్వేనియా కూడా అదే బాటలో నిర్ణయం తీసుకోవడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏటా దీపావళి రోజున వైట్ హౌజ్‌లో వేడుకలు నిర్వహిస్తారు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరిస్ కూడా భారత సంతతి వ్యక్తి కావడం విశేషం.