Japan earthquake LIVE Updates: జపాన్ పశ్చిమ భాగాన్ని నేడు తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. వరుసగా 21 భూకంపాలతో వణికిపోయింది. దీనికి తోడు స్వల్పశ్రేణి సునామీ అలలు తీరాన్ని తాకాయి.నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో సంభవించినట్టుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
వేల ఇళ్లకు విద్యుత్త సరఫరా నిలిచిపోయింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6గా నమోదైంది. భారీ భూకంపం నేపథ్యంలో జపాన్ లోని ఇషికావా, నిగాటా, టొయోమా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే వజిమా నగరాన్ని సునామీ అలలు బలంగా తాకాయి. భారీ భూకంపం నేపథ్యంలో ఉత్తర కొరియా (North Korea), రష్యాల (Russia)కు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆ రెండు దేశాలకూ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ (Pacific Tsunami Warning Centre) హెచ్చరికలు జారీ చేసింది.
భయంకర సునామి వీడియో ఇదిగో, ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఇళ్ల మీదకు దూసుకువస్తున్న రాకాసి అలలు
జపాన్‌లో వరుస భూకంపాలు, సునామీ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత పౌరుల సౌకర్యార్థం జపాన్‌లోని ఇండియన్ ఎంబసీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్‌ను ప్రకటించింది. అవసరమైన ఇండియన్ సిటిజన్స్ ఆయా నంబర్స్‌కు కాల్ చేసి తమకు కావాల్సిన వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. జపాన్ లో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్ ను 818039301715, 817014920049, 818032144734, 818062295382, 818032144722 నెంబర్లలో సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూకంప లేఖినిపై 4.0 తీవ్రత కంటే అధిక స్థాయిలో ఏకంగా 21 భూకంపాలు నమోదయ్యాయి. మొదట 4:06 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం ప్రకారం) 5.7 తీవ్రతతో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ తర్వాత 4:10 గంటలకు 7.6 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. 4:18 గంటల సమయంలో 6.1 తీవ్రతతో, 4:23 గంటలకు 4.5 తీవ్రతతో, 4:29 గంటలకు 4.6 తీవ్రతతో, 4:32 గంటలకు 4.8 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా 4 కంటే ఎక్కువ తీవ్రతతో భూమి కంపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Here's Videos
Video: A Japanese driver stopped their car during today's earthquake and observed river water swaying back and forth.#Tsunami #japan #earthquake #NewYear pic.twitter.com/U3c2g9I48o
— Mobin (@mobin_911) January 1, 2024
🇯🇵 The roads have cracked open 🇯🇵
Another earthquake warning issued.
Very high waves are approaching the coasts.#earthquakes #japan #japanese #japannews #tsunami #NewYear pic.twitter.com/fXH0DgdA5Z
— Aditya Rathore (@imAdityaRathore) January 1, 2024
Chilling footage captures the intense arrival of the #Tsunami in Hokuriku Niigata's Noto Peninsula. A stark reminder of the need for preparedness in the face of nature's fury#Japan #earthquake pic.twitter.com/kYu2NsHC2Y
— Surajit (@surajit_ghosh2) January 1, 2024
🇯🇵SHOT FROM GROUND ZERO 🇯🇵
People are out on the Streets.
Japan has issued 3 levels of tsunami warnings to its residents in different states.
WHAT A SAD START TO NEW YEAR 2024.#japanese #japannews #japan #earthquackes #Tsunami #NewYear2024 pic.twitter.com/HM3Dd7WvE7
— Aditya Rathore (@imAdityaRathore) January 1, 2024
Japan earthquake latest: Tsunami warning after 7.6 on the magnitude scale and more than 50 other quakes hit - as at least 30 buildings collapse
#Earthquake #viralvideo #tsunami #Japanpic.twitter.com/gJhliA7Vzv
— Talha Hassan 🇵🇰 (@khattaks528) January 1, 2024
Strange behaviour of birds at time of earthquake in Japan. #tsunami pic.twitter.com/GwFLgYbIsG
— Eliteworld (@eliteworldwaves) January 1, 2024
దీంతో ఇషికావా ద్వీపకల్పంలో వాజిమా పోర్టులో 4.21 గంటల సమయంలో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో సునామీ అలలను గుర్తించారు. వాజిమాలో చాలా వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రహదారులపై భారీగా పగుళ్లు ఏర్పాడ్డాయి. మరికొన్ని చోట్ల సునామీ అలలు అత్యధికంగా ఐదు మీటర్ల ఎత్తు వరకు రావచ్చని హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 36 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
స్థానిక మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. భారీ భూకంపం కారణంగా జపాన్‌లో ఐదుగురు గాయపడ్డారు. సుమారు 34వేల ఇళ్లకు పవర్ కట్ లేదు. అనేక బిల్డింగ్‌లు కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. అయితే, ఈ భూకంపం ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం రాలేదు.
మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగటి, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముందు జాగ్రత్తగా ప్రజలు వెంటనే తీర ప్రాంతాలను వదిలి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ఆదేశించింది.
Here's Videos
Panic ensues as a massive #earthquake shakes a mall in #Japan, leaving people terrified and seeking safety#Tsunami pic.twitter.com/Fa1mOGmcKO
— Surajit (@surajit_ghosh2) January 1, 2024
Fire ongoing in Japan - More shakes being felt - Tsunami could get as high at 16.5 feet#japan #earthquake #tsunami
— Crime With Bobby (@crimewithbobby) January 1, 2024
జపాన్ తీరం వెంబడి భూకంపం కేంద్రానికి 300 కి.మీ పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇషికావాలో సుమారు 5 మీటర్ల ఎత్తు వరకు సునామీ (tsunami) అలలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెదర్ ఏజెన్సీ తన వార్నింగ్‌లో తెలిపింది. హొక్కియాడా నుంచి నాగసాకి మధ్య జపాన్ సముద్రతీరం వెంట సుమారు మూడు మీటర్ల ఎత్తులో సునామీ అలలు వచ్చే అకాశాలు ఉన్నాయి.
హోక్కాయిడో నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రధాన హైవేలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇషికావాలోని ప్రధాన అణువిద్యుత్తు కేంద్రం మాత్రం ఇప్పటి వరకు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది మే నెలలో జపాన్‌లో దాదాపు రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పట్లో 13 మంది గాయపడగా.. ఒకరు మృతి చెందారు. అప్పుడు కూడా భూకంప కేంద్రం ఇషికావా ప్రాంతంలోనే ఉంది.
తాజాగా వచ్చిన భూకంపం 1983లో వచ్చిన సీ ఆఫ్ జపాన్ భూకంపంతో పోలిఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పట్లో ఈ భూకంపంలో 104 మంది పౌరులు మరణించగా.. 324 మంది తీవ్రంగా గాయపడ్డారు. జపాన్‌లో ఏటా సగటున 5 వేల చిన్నాపెద్దా భూకంపాలు వస్తుంటాయి. అక్కడి ప్రజలు వీటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది. 40వేల కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌లో 450 అగ్నిపర్వతాలున్నాయి.
అందులో మెజారిటీ అగ్నిపర్వతాలు జపాన్‌లోనే కనిపిస్తాయి. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయి. జపాన్ 4 కాంటినెంటల్ ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్, ద ఫిలిప్పీన్, ద యురేసియన్, ద నార్త్ అమెరికా ప్లేట్‌లు తరచూ కదులుతూ ఉంటాయి. దాంతో భూమి కదిలి భూప్రకంపనలు, భూకంపాలు వస్తుంటాయి. ఇవే కాకుండా జపాన్ ట్రెంచ్‌గా పిలుస్తున్న జపనీస్ అగాధం కూడా భూకంపాలు రావడానికి మరో కారణం. పసిఫిక్ వాయువ్య ప్రాంతంలోని ఈ సముద్ర అగాధం 800 మీటర్ల లోతులో ఉంటుంది. అందులో కదలికలు ఏర్పడినప్పుడు భూకంపాలు, సునామీలు వస్తుంటాయి.