Islamabad, Feb 19: ఘోర భూకంపంతో వణికిపోయి ప్రపంచ దేశాల నుంచి సాయం కోసం టర్కీ (Turkey) ఆర్తిగా ఎదురు చూస్తుండగా మరో వైపు పాకిస్తాన్ (Pakisthan) చేసిన నిర్వాకం ఆ ప్రభుత్వాన్ని షాక్ కి గురి చేసింది. గత ఏడాది పాకిస్తాన్ ని భారీ వర్షాలు, వరదలు (Floods) అతలాకుతలం చేసినప్పుడు బాధితులను ఆదుకునేందుకు టర్కీ ప్రభుత్వం తమ దేశం నుంచి సహాయ సామాగ్రిని యుద్ధ ప్రాతిపదికన పాక్ కు పంపింది. నాడు ఆ వరదల్లో అనేకమంది పాకిస్తానీయులు మరణించగా .. వేలమంది నిరాశ్రయులయ్యారు.
అయితే టర్కీ నుంచి అందిన సాయాన్ని ఇప్పుడు పాక్ ప్రభుత్వం తిరిగి అదే దేశానికి పంపిన వింత వైనాన్ని షాహిద్ మసూద్ అనే జర్నలిస్టు వెలుగులోకి తెచ్చాడు.
Pakistan accused of sending same aid packages it received from Turkey for floods #news #dailyhunt https://t.co/RjbvaWk3Ul
— Dailyhunt (@DailyhuntApp) February 19, 2023