Bans Sex Outside Marriage: పెళ్లికి ముందు ఎవరైనా సెక్స్ చేస్తే జైలుకే, కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన ఇండోనేషియా ప్రభుత్వం, చట్టాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ వద్ద నిరసనకారులు ప్రదర్శన

గతంలో పెండ్లికి ముందు శృంగారాన్ని నిషేధించే బిల్లుపై ఇండోనేషియా పార్లమెంట్ సంతకం చేసింది. ఈ చట్టం తాజాగా ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం.. ఇప్పుడు ఇండోనేషియాలో పెళ్లికి ముందు ఎవరితోనైనా శృంగార సంబంధం కలిగి ఉండటం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు, అంతే కాకుండా నేరంగా పరిగణిస్తారు.

Bans Sex Outside Marriage: పెళ్లికి ముందు ఎవరైనా సెక్స్ చేస్తే జైలుకే, కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన ఇండోనేషియా ప్రభుత్వం, చట్టాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ వద్ద నిరసనకారులు ప్రదర్శన
Representational Purpose Only (Photo Credits: Pexels)

Jakarta, December 6: ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పెండ్లికి ముందు ఎవరైనా సరే శృంగారంలో పాల్గొంటే వారిని నేరం చేసిన వారిగా పరిగణిస్తారు. ఈ కొత్త చట్టాన్ని (Sex Outside of Marriage Banned in Indonesia) సోమవారం జకర్తాలో జరిగిన పార్లమెంటరీ ప్లీనరీ సమావేశంలో ఇండోనేషియా న్యాయశాఖ మంత్రి యసోన్నా లావోలీకి.. పార్లమెంటరీ కమిషన్‌ అధిపతి బాంబాంగ్‌ వుర్యాంటో అందించారు. గర్భ నిరోదకం గురించి ప్రచారం చేయడానికి ఇదొక భాగమని ప్రభుత్వం తెలిపింది.

కాగా గతంలో పెండ్లికి ముందు శృంగారాన్ని నిషేధించే బిల్లుపై ఇండోనేషియా పార్లమెంట్ సంతకం చేసింది. ఈ చట్టం తాజాగా ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం.. ఇప్పుడు ఇండోనేషియాలో పెళ్లికి ముందు ఎవరితోనైనా శృంగార సంబంధం కలిగి ఉండటం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు, అంతే కాకుండా నేరంగా పరిగణిస్తారు. ఈ కొత్త చట్టం ప్రకారం భార్యాభర్తలు మాత్రమే శారీరక సంబంధం కలిగి ఉండాలి. దీంతో పాటు పెళ్లయిన జంట తమ భాగస్వామితో కాకుండా మరొకరితో శారీరక సంబంధాలు పెట్టుకున్నపక్షంలో అది కూడా నేరం పరిధిలోకి వస్తుంది.

అమెరికాలో ఘోర ప్రమాదం, రహదారిపై వెళుతున్న బస్సును మింగేసిన బురద, 34 మంది మృతి, మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు

వివాహిత జంట విషయంలో మహిళ లేదా పురుషుడు వారి భాగస్వామిపై కేసు నమోదు చేసినప్పుడు చర్యలుంటాయి. ఈ చట్టం ప్రకారం కోర్టులో విచారణకు ముందు ఫిర్యాదును ఉపసంహరించుకోవచ్చు. అయితే విచారణ ప్రారంభమైన తర్వాత చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు.

ఆందోళనకరంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం, చేతులు పర్పుల్‌ రంగులోకి మారిపోయాయని వార్తలు, తాజాగా మెట్ల మీద నుంచి జారిపడటంతో విరిగిపోయిన తుంటి ఎముక

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన సందర్భంగా పలువురు నిరసనకారులు పార్లమెంట్‌ వద్ద ప్రదర్శన నిర్వహించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

(The above story first appeared on LatestLY on Dec 06, 2022 05:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).