Donald Trump (photo-X/Donlad Trump)

New York, jan21: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్‌ దేశాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్‌(యూఎస్‌ డాలర్‌ విలువ తగ్గించేలా) ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలా చేసే ఏ బ్రిక్స్ దేశంపైనైనా 100 శాతం సుంకాన్ని విధిస్తామని హెచ్చరించారు.ఓవల్ కార్యాలయంలో జరిగిన అధ్యక్ష పత్రాలపై సంతకాల కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దేశాలన్నీ విదేశీ వాణిజ్యరంగంలో స్థానిక కరెన్సీల వాడకాన్ని పెంచాలని ఆలోచన చేస్తున్నాయి. ఇది అమెరికా డాలర్ పై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ చర్యను చేపట్టారు.