క‌త్తిపోట్ల‌కు గురైన బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ ముంబ‌యి లీలావ‌తి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ నెల 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండ‌గుడు క‌త్తితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. కాసేప‌టి క్రితం ఆయ‌న ఆసుప‌త్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. సైఫ్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన ఆగంతుకుడు ఆయ‌న‌పై దాడి చేసి, తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. దీంతో ఐదు రోజుల పాటు లీలావ‌తి ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందారు.నటుడు కోలుకోవ‌డంతో ఈరోజు ఆయ‌న‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

వివాదంలో బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా, ఆస్పత్రిలో ఉన్న సైఫ్‌ అలీ ఖాన్‌పై పెట్టిన పోస్టుపై దుమారం

సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్ప‌డిన నిందితుడిని ముంబ‌యి పోలీసులు ఆదివారం నాడు థానేలో అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో అత‌డు బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్‌గా పోలీసులు గుర్తించారు.

Saif Ali Khan Discharged:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)