Anantapur DRO playing online rummy keeping public issues aside (Photo-Video Grab)

Vjy, Jan 21: అనంతపురం జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి కీలక సమావేశంలో రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులందరూ బిజీగా ఉన్నారు. కానీ, డీఆర్వో మలోలా మాత్రం ఈ సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరించారు.

కీలకమైన సమావేశంలో డీఆర్వో మలోలా తన సెల్‌ ఫోన్‌లో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ ఎంజాయ్‌ చేశారు. ఓవైపు సమావేశం జరుగుతున్నా డీఆర్వో మాత్రం కాలక్షేపం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో​, సదరు అధికారి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్న డీఆర్ఓ మలోలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

Anantapur DRO playing online rummy keeping public issues aside

సమావేశ మందిరంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఎందుకు ఆడాల్సి వచ్చింది.. అనే దానిపై డీఆర్ఓ మలోలను వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. డీఆర్ఓ‌ను విచారించాల్సిందిగా జాయింట్ కలెక్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నివేదిక ఆధారంగా డీఆర్ఓ మలోలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.